మ్యూజియంలపై అవగాహన తప్పనిసరి

అంతర్జాతీయ స్థాయిలో, సమాజ అభివృద్ధిలో మ్యూజియంల పాత్రపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు డెక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ ట్రస్టు హైదరాబాద్‍, తెలంగాణ రాష్ట్ర హెరిటేజ్‍ డిపార్టుమెంట్‍, సివిల్‍ సొసైటీ గ్రూప్‍ సంయుక్త ఆధ్వర్యంలో ‘అంతర్జాతీయ మ్యూజియం డే’ను 2025 మే 18న హైదరాబాద్‍ గన్‍ఫౌండ్రీలోని సెంటినరి హెరిటేజ్‍ మ్యూజియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాది మంది ఆక్స్ఫర్డ్ గ్రామర్‍ హైస్కూల్‍ విద్యార్థులు ‘‘ఎ మ్యూజియం డే వాక్‍’’ చేశారు. అనంతరం మ్యూజియంలో టెర్రకోట (మట్టి) కుండలు, గార వస్తువులు (మానవుని చేతి, ముఖం), రాతి విగ్రహాలు (బుద్ధుని, మానవుడు, శ్రీదేవి, భూదేవి), బద్రి, లోహపు వస్తువులు, ఫర్నిచర్‍, పింగాణి పాత్రలు, రామప్ప ఆలయం, సంగేమేశ్వరం, త్రికుటాలయం, కపిలేశ్వరం, ఈశ్వరస్వామి ఆలయం (పాలమర్రి) ప్రదర్శిస్తూ, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్‍ OU, ఆర్కిటెక్ట్ కాలేజ్‍ విద్యార్థులు, ఆక్స్ఫర్డ్ స్కూల్‍ విద్యార్థులకు వాటిపై అవగాహన కల్పించారు. అదేవిధంగా, మ్యూజియంలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి పలువురు మ్యూజియం నిపుణులు వివరించారు. డిపార్ట్మెంట్‍ ఆఫ్‍ హెరిటేజ్‍ తెలంగాణ అసిస్టెంట్‍ డ్కెరెక్టర్‍ మాధవి స్వాగతోపన్యాసం చేశారు.


అనంతరం డెక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ ట్రస్టు చైర్మన్‍ మణికొండ వేదకుమార్‍ మాట్లాడుతూ ప్రపంచంలోనే నేషనల్‍ మ్యూజియం అతి ఉత్తమమైనదన్నారు. కుతుబ్‍షాహి పీరియడ్‍, అజప్‍షాహి పీరియడ్‍ల వరకు మ్యూజియంలకు ప్రాముఖ్యత ఇచ్చారని గుర్తుచేశారు. హైదరాబాద్‍లోని సాలార్‍జంగ్‍ మ్యూజియం ప్రపంచలోనే గొప్ప మ్యూజియం అని అన్నారు. బోధన్‍, కామారెడ్డి ప్రాంతాల్లోని తాను పర్యటించి, స్థానికులను అడిగి, అక్కడి చారిత్రక కట్టడాలు, ప్రదేశాలను తెలుసుకొని, ఒక ప్రాజెక్టును రూపొందించానని ఈ సందర్భంగా తెలిపారు. ఎంత సాఫ్ట్వేర్‍ రంగంలోకి వెళ్లి సాంకేతికంగా అభివృద్ధి చెందినా మన చరిత్ర, సంస్కృతిని మరువద్దన్నారు. నిజాం నవాబులు చారిత్రక సంపదను బాగా విలువనిచ్చేవారని గుర్తుచేశారు. చారిత్రక కట్టడాలు, ప్రదేశాలను చూడటమే కాకుండా వాటి వెనుక ఉన్న న్కెపుణ్యత, సాంకేతికతను తెలుసుకోవాలని కోరారు.


తెలంగాణ ట్రైబల్‍ మ్యూజియం క్యూరేటర్‍ ద్యావనపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ మ్యూజియం వల్ల ప్రజలకు వల్ల వినోదం, జ్ఞానం కలుగుతుందని తెలిపారు. మ్యూజియంలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగికి ఉండాలని సూచించారు. సాలార్‍ జంగ్‍ మ్యూజియం భారతదేశంలో మూడవ అతిపెద్ద సంగ్రహాలయంగా ప్రసిద్ధి చెందిందని గుర్తుచేశారు.

ఇంటర్నేషనల్‍ కౌన్సిల్‍ ఆఫ్‍ మ్యూజియమ్స్ (ఐకామ్‍) సర్వప్రతినిధి సభ తీర్మానం ప్రకారం ఏటా మే నెల 18వ తేదీని అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవంగా జరుపుకోవాలని 1977లో నిర్ణయించింది. మ్యూజియం నిపుణులు ప్రజలను కలవడానికి, మ్యూజియంలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వారిని తెలియచేయడానికి ఈ దినోత్సవం ఉపయోగపడుతుంది. 2009లో ఎక్కువ మందిని దృష్టిని ఆకర్షించింది. 2009లో జరిగిన అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం వేడుకల్లో 90కి పైగా దేశాలలో 20,000 మ్యూజియంలు వివిధ కార్యక్రమాలను నిర్వహించింది. 2010లో 98 దేశాలు, 2011లో 100 దేశాలు, 2012లో 129 దేశాలలో 30,000 మ్యూజియంలు ఈ వేడుకలో పాల్గొన్నాయి. 2011లో ఈ దినోత్సవ అధికారిక పోస్టర్‍ 37 భాషలలోకి అనువదించబడింది. 2012 నుండి ఈ సంఖ్య 38కి పెరిగింది. అంతర్జాతీయ స్థాయిలో, సమాజ అభివృద్ధిలో మ్యూజియంల పాత్రపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉన్నది.


రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్‍ ఆఫ్‍ ఆర్కియాలజీ సి.హెచ్‍. బాబ్జీ రావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వారసత్వ కట్టడాలు ఎంతో ప్రసిద్ధి చెందింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలోనున్న కోటలు, గడీలు మొదలైన, వాటి ద్వారా మన చరిత్రను తెలుసుకోవచ్చని తెలియజేశారు.
వారసత్వ ఉద్యమకారుడు రత్నాకర్‍ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి జిల్లాలో ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలని అన్నారు. ఆ జిల్లాకు సంబందించిన పురాతన వస్తువులను భద్రపరచడం వల్ల అక్కడి జిల్లా ప్రజలు, విద్యార్థులకు వారి జిల్లా ప్రాముఖ్యత మరియు చరిత్రను తెలుసుకునే అవకాశం ఉంటుందని అన్నారు.


ప్రముఖ చరిత్రకారులు సంగనభట్ల నర్సయ్య మాట్లాడుతూ.. పురావస్తు సంపద ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో జనగామ జిల్లాలో చాలా ఉన్నాయి. నేను జనగామ జిల్లా వాసిగా నేను చాలా గర్వపడుతున్నాను. నేడు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న సమయంలో మన గ్రామ చరిత్ర కనుమరుగు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది.


డా. శ్యాంసుందర్‍ రావు, స్థపతి మాట్లాడుతూ, నార్త్ ఇండియా నుండి మొదలైన బౌద్దం తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది ఒడ్డు నుండి కృష్ణా నది ఒడ్డున గల నాగార్జున సాగర్‍ వరకు విస్తరించిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ సుందరీమణుల పోటీల వివిధ దేశాల నుంచి పాల్గొన్న ప్రపంచ సుందరీమణులు బుద్దవనంను సందర్శించారని తెలిపారు.


ఈ కార్యక్రమంలో లయన్‍ ధనుంజయ, అసిస్టెంట్‍ డైరెక్టర్‍ మాధవి, అసిస్టెంట్‍ ఆఫ్‍ అర్కియాలజి కె.రూపిక, సూపరిటెండెంట్‍ రాజు, ప్రముఖ ఫోటోగ్రాపర్‍ రమేశ్‍ డెక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ ట్రస్టు కో-ఆర్డినేటర్‍ ప్రభాకర్‍, ఇన్‍చార్జి ఖైజర్‍ బాషా తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *