ఈ ప్రపంచంలో ఫోటోగ్రఫీ అనేది ఒక అద్భుతమైన కళ. ఒక మనిషి తన గురించి మరో మనిషికి చెబుతూ, తన గురించి తను తెలుసుకోవడమే ఫోటోగ్రఫీ యొక్క ఆర్టిస్టిక్ పర్పస్ అని ఈ ప్రపంచంలోనే గొప్ప ఆర్టిస్టులలో ఒకరైన Edward Jean Steichen చెబుతారు. అంతటి గొప్ప కళకు భారతదేశంలో మరింత ఎక్కువ గుర్తింపు రావాల్సిందిగా ఇక్కడి కళాకారులు భావిస్తూ ఉంటారు. నిజానికి భారతదేశంలో సగటు మనిషికి ఫోటోగ్రఫీ అనగానే పెళ్లిళ్లు, చావులు మాత్రమే గుర్తుకు వస్తాయి. అందుకు కారణాలు మరెన్నో ఉన్న, ఆ కళ యొక్క గొప్పతనం తనకు తెలియకపోయినా, ఫోటోగ్రఫీ కళ నుండి మనిషిని ఎవరూ విడదీయలేరు. అంతటి గొప్ప కళ అది. నిజానికి మనుషులకు సైన్స్ గురించి మ్యాథమెటిక్స్ గురించి మరియు మనం చదువుతున్న అన్ని సబ్జెక్టుల గురించి చాలా లోతుగా తెలుసు. అందుకు కారణం ఆ సబ్జెక్టులలో జరిగిన రీసెర్చెస్ మరియు రాయబడిన రీసెర్చ్ పేపర్స్. ప్రపంచంలో అన్ని సబ్జెక్టులపై రీసెర్చ్ చేస్తూనే ఉంటారు. కానీ కళలపైన చాలా తక్కువగా రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది. ‘‘మనిషికి జీవితం అంటే ఏంటో తెలిపేదే కళ’’ అలాంటి కళల పైన రీసెర్చ్ చేసి అందులోని గొప్పతనం గురించి ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది. అలాంటి కళలలో ఫోటోగ్రఫీకి చాలా ముఖ్యస్థానం ఉంది. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా హ్యూమన్ లైఫ్, ఫోటోగ్రఫీ పైన నాలుగు సంవత్సరాలు పాటు రీసర్చ్ జరిపి మన ముందుకు ‘‘UN/FRAMED LIVES’’ బుక్ తీసుకుని వచ్చారు జింక వరుణ్ కుమార్ నాయుడు.
ఏ కళాకారుడైన తన మనసుకు గాఢంగా తాకే ప్రశ్నలకు సమాధానాలు తన కళ నుండే తెలుసుకుంటాడు. ఇక్కడ కూడా అదే జరిగింది. ‘‘UN/FRAMED LIVES’’పుస్తకం ‘‘What is the most exciting thing to capture in Photography’’ అన్న ప్రశ్న నుండి మొదలైంది. ఈ పుస్తకం కేవలం రీసెర్చ్ మరియు ఫోటోగ్రఫీ కాఫీ టేబుల్ బుక్ మాత్రమే కాదు, నిజానికి ‘‘మనిషి యొక్క పుట్టుక నుండి చివరి వరకు, ఆ మనిషికి తన గురించి తనకు తెలుపుతూ, ఆ జీవితాలను ఫోటోగ్రఫిక్ ఆర్ట్తో భద్రపరిచిన ఒక జీవం ఉన్న పుస్తకం UN/FRAMED LIVES.
వరుణ్ తనకు తాను ఒక ప్రశ్నగా మారి, తాను చూసిన ప్రపంచంలో, అందులో ఉన్న మనుషులు, వాళ్లలో కూడా ఉండే అవే ప్రశ్నలు? అంతులేని ఆ ప్రశ్నల నుండే వరుణ్ యొక్క Photographic Prosp[ective మొదలైంది అని చెప్పవచ్చు. వరుణ్ నమ్మే ఫిలాసఫీ ఏంటి అంటే ‘‘అంతులేని ఈ అంతరిక్షంలో ఎన్నో అంతులేని galaxies, అందులో Milky Way Galaxy ఒకటి, అందులో 9 గ్రహాలు, అందులో ఒకటి అయిన భూమిలో మాత్రమే ప్రాణం ఉంది. ప్రాణం పోసుకున్న అన్ని ప్రాణులలో మనిషి మాత్రమే తెలివైనవాడు. అంతటి తెలివైన మనిషి, తాను తన కోసం క్రియేట్ చేసుకున్న ఈ సొసైటీలో ఆ మనిషే చాలా ప్రశ్నలతో ఒక ప్రశ్నగా మిగిలిపోతున్నాడు!! ఆ ప్రశ్నల్లో దాగివున్న అంతులేని ఎమోషన్స్ని చాలా లోతుగా అర్థం చేసుకొని, తన ఫోటోగ్రఫిక్ ఆర్ట్తో, ఆ ఎమోషన్స్కి జీవం పోస్తూ తన కెమెరాలో భద్రపరిచి UN/FRAMED LIVES పుస్తకంతో మనకు పరిచయం చేశాడు.
ఇంతటి గొప్ప పుస్తకానికి పునాది ఎలా జరిగిందో వరుణ్ ఈ పుస్తకంలో ఇలా వివరిం చారు. నా చిన్నప్పుడు నుండి మా నాన్నగారు ప్రతిరోజు గ్రంథాలయానికి వెళ్లేవారు. ఇప్పుడూ వెళ్తున్నారు. అలా నాకు కూడా పుస్తకాలతో స్నేహం పెరిగింది. పదో తరగతికి వచ్చే లోపల అనేక పుస్తకాలు చదివేశాను. అమ్మ రమాదేవి, నాన్న రమేష్ నాయుడు నన్ను ఎంతగానో పుస్తకాల వైపు ప్రోత్సహించారు. మా చెల్లెలు పూజిత కూడా పెయింటర్. మాది ఒక చిన్నపాటి కళాకారుల ఫ్యామిలీ అని చెప్పవచ్చు. ఆ పుస్తకాలే నన్ను గ్రాడ్యుయేషన్‍లో జవహర్‍లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్టస్లో B.F.A (ఫోటోగ్రఫీ) చేయడానికి ఎంతగానో సపోర్ట్ చేశాయి. గ్రాడ్యుయేషన్ తర్వాత ఒక రెండు సంవత్సరాల పాటు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కెమెరా డిపార్ట్మెంట్‍లో వర్క్ చేశాను.

ఆ తర్వాత భారతదేశంలోనే టాప్ ఫిలింస్కూల్ అయిన సత్యజిత్ రాయ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ (SRFTI)కి ఎంట్రన్స్ రాసి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాను. ఆ ఇంటర్వ్యూలో నన్ను అడిగిన ప్రశ్న ‘‘What is the most exciting thing to capture in Photography’’ అని దానికి నా Prospective Add చేసి హ్యూమన్ లైఫ్ అని చెప్పి అప్పటికి నేను తీసిన ఫోటోగ్రాఫ్స్ అన్ని సబ్‍మిట్ చేశాను. యూనివర్సిటీలో సీటు వచ్చిన తర్వాత ‘Oindrilla Hazra Ma’ am SRFTIలో న్యూ CRT (Class Room Theater)లో ఫస్ట్ క్లాస్ సినిమాటోగ్రఫీ క్లాస్ అందులోను ఫోటోగ్రఫీ గురించి క్లాస్ స్టార్ట్ చేశారు. వరుణ్ హ్యూమన్ లైఫ్ పైన తన ఫోటోగ్రఫీ పైన ఉన్న పర్సెపెక్టివ్ నాకు చాలా uniqueగా అనిపించింది అంటూ నన్ను డయాస్ పైకి పిలిచి. ఆ టాపిక్‍పై క్లాస్ చెప్పించింది. మనిషి జీవితం, ఫోటోగ్రఫీ గురించి డీటెయిల్‍గా మాట్లాడిన నా నాలెడ్జ్ని చూసి ఒక రీసెర్చ్ పేపర్‍గా ఎందుకు రాయకూడదు అని నాకు సజెస్ట్ చేసింది. ఆర్టిస్టులకు తన ఆర్ట్పైన మరియు తన పైన అంతులేని ఒక చిన్నపాటి మధనం జరుగుతూ ఉంటుంది. యూనివర్సిటీలో అదికూడా మొదటి రోజు నాకు ఇష్టమైన సబ్జెక్ట్ ప్రొఫెసర్ నా ఐడియాలజీని సపోర్ట్ చేస్తూ ఉంటే ఎక్కడో తెలియని ధైర్యం. వరుణ్ నువ్వు హ్యూమన్ లైఫ్ మరియు ఫోటోగ్రఫీ పైన రీసెర్చ్ చేయగలవు. నా సపోర్ట్ నీకు ఎప్పుడూ ఉంటుందని చెప్పిన మా మేడం మాటలు వల్లనే ఈరోజు UN/FRAMED LIVES book భారతదేశంలోనే మొట్టమొదటిగా వచ్చిన హ్యూమన్ లైఫ్ ఫోటోగ్రఫీ రీసెర్చ్ కాఫీ టేబుల్ బుక్‍గా చరిత్రలో నిలిచింది.
ముందుగా మనం పుస్తకం యొక్క పేరు గురించి మాట్లాడు కోవాలి. UN/FRAMED LIVES R (UN)+(/)+(FRAMED)+(LIVES) ఇక్కడ UN మరియు WAVE (ది)కి సింబల్ అంటే ఆర్టిస్ట్ యొక్క Thought Process Energy బుక్ చూసే Viewer కి అదే విధంగా పాస్ అవుతుంది అని indicate చేస్తుంది. మరియు logo of the book, FRAMED అంటే సింబాలిక్‍గా చెప్పడం ఫోటోగ్రాఫిక్ టర్మ్లో, మరియు LIVES అంటే వాళ్ళ జీవితాలు. ఇక cover పేజ్ గురించి మాట్లాడాల్సి వస్తే Yellow Frame border metaphoricalగా వాళ్ళ జీవితాలను ఫ్రేమ్ చేసామని ఇండికేట్ చేస్తుంది. ఎల్లో కలర్ కలకత్తాని రిప్రజెంట్ చేస్తుంది.
ఇక Cover Photograph గురించి మాట్లాడాల్సి వస్తే ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఫోటోగ్రాఫిక్ టర్మస్లో అది ఒక well artistic composed Photograph మరియు లోతైన ఎమోషన్స్ ఉన్న ఫోటోగ్రాఫ్ అని తెలుపవచ్చు. వరుణ్ మాటల్లోనే దాని గురించి ఇంకా లోతుగా తెలుసుకుందాం, చిన్నప్పుడు మనకు తెలిసే ప్రపంచం అమ్మానాన్న మాత్రమే, అమ్మ అంటే ఇలా ఉంటుంది. నాన్న అంటే ఇలా ఉంటారు అని మనకు అర్థం అవుతుంది. కానీ స్త్రీ మరియు పురుషుడు కలయికతో ఉండే Transgenders గురించి మనకు చిన్నప్పుడు అర్థం కాదు. నాకు అర్థం కాని విషయాలన్నీ ఒక ప్రశ్నగా మిగిలి పోయేవి. నేను పెరిగే కొద్దీ వాళ్ళపై భయం మొదలయింది తప్పితే వాళ్లు నాకు ఎప్పుడూ అర్థం అయ్యే వాళ్ళు కానే కాదు. ఎప్పుడు వాళ్ళ చప్పట్లతో భయపెట్టే వాళ్లు, ఆరోజు కలకత్తా రైల్వే స్టేషన్లో నేను కూర్చొని ఒక చిన్న బాబు ఫోటోగ్రాఫ్ తీస్తూ ఉంటే నా దగ్గరికి సరదాగా మాట్లాడి, ఆ చిన్న బాబు ఫోటో తీసినందుకు నన్ను మెచ్చుకొని చాలా బాగా మాట్లాడి లోకల్ ట్రైన్‍లో వాళ్లు వెళ్ళిపోతుండగా నా వైపు అంటే నా కెమెరా వైపు చూసి నవ్వుతూ బాయ్ చెప్పి వెళ్ళిపోతుంటే, అందమైన నవ్వులు నా కెమెరాలో బంధించాను!! అప్పటివరకు నాకు వాళ్ళ పైన ఉన్న ఒక అభిప్రాయం, ప్రశ్నలు ఒక్కసారిగా నా ఫోటోగ్రఫిక్ ఆర్ట్లోనే దొరికాయని అనిపించింది. వాళ్లపై నాకున్న అభిప్రాయమే మారిపోయింది. ఒక ప్రాణిని ప్రాణి లాగ చూడాలి. నన్ను నేను ఎంత సమానంగా చూసుకుంటానో అందర్నీ అలానే చూడాలి అని నాకు నేర్పిన చిరునవ్వులు ఆ ఫోటోగ్రాఫ్‍లో ఉన్నాయి. నన్ను నన్నుగా మార్చిన ఫోటోగ్రాఫ్ అది అంటూ వరుణ్ చాలా poeticగా ఆ ఫోటోగ్రఫీని describe చేశారు.

నిజానికి నలుపు తెలుగు రంగులతో క్రియేట్ చేయబడిన UN/FRAMED LIVES books చిత్రాలు ఒక అద్భుతం అని చెప్పాలి. ఈ పుస్తకం 100 సంవత్సరాల కంటే ఎక్కువ జీవించాలని, ఇందులో వాడిన Mont Blanc Extra White (160 GSM) పేపర్ జర్మనీ నుండి స్పెషల్‍గా తెచ్చింది. అది 100 సంవత్సరాల కంటే ఎక్కువ వరకు కాలపరిమితి ఉంటుంది.
మొట్టమొదటి UN/FRAMED LIVES పుస్తకం, వరుణ్ అమితంగా ఇష్టపడే భారతదేశంలోనే గొప్ప ఫోటోగ్రాఫర్ అయిన Raghu Rai గారిని కలిసి ఆయన మెప్పు పొంది పుస్తకం ఈ ప్రపంచంలోకి వచ్చింది. అలానే భారతదేశంలో ఉండే గొప్ప గొప్ప సినిమా దర్శకులు శ్రీ బి. నర్సింగ్‍రావు, నాగరాజ్ మంజులే, నాగ్ అశ్విని, హను రాఘవపూడి మరియు గొప్ప గొప్ప పెయింటర్స్ నుండి కళాకారుల నుండి UN/FRAMED LIVES పుస్తకానికి మరియు వరుణ్‍కి ఎంతగానో ప్రోత్సాహం, ప్రేమ దొరుకుతుంది. ఈ పుస్తకానికి పని చేసిన వ్యక్తులు Producer – Hari Charana Prasad, Editor – P. Rose Shashikala Jason, Designer – Shashi Kiran Kukudala, Post Production – Vinod Kumar Peta, Kinor Kumar, Support Team – J.Poojitha Naidu, Aishwarya.
భారతదేశంలోనే గర్వించదగ్గ ఈ పుస్తకం రూపొందడానికి తనకంటే ఎక్కువగా ఈ ప్రకృతి, ఎంతోమంది గొప్ప మనుషులు వల్లనే UN/FRAMED LIVES books ఈ ప్రపంచం ముందర నిలబడింది అంటాడు వరుణ్. వరుణ్ లాంటి గొప్ప కళాకారులు మరెన్నో విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భారతదేశం గర్వించదగ్గ UN/FRAMED LIVES booksకి, వరుణ్‍కి మీ ఆదరణ చూపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Dr. A.R. KAMAL ROY,
Head of Dept. of Photography &
Visual Communication
Jawaharlal Nehru Architecture and
Fine Arts University, Hyderabad.
m : 9160594642
e: arkamalroy@gmail.com