మాది తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా. ‘డయల్ యువర్ విల్లెజ్’ టూర్ లో భాగంగా అమెరికా నుండి వెళ్లి మా స్వంత గ్రామం సందర్శించడం జరిగింది. మా అమ్మా, నాన్నలు ఇద్దరు ఈ లోకంలో లేరు, ఊర్లో మా ఇల్లు కూడా కూలి పోయింది. మాత•భూమి మట్టిపై మమకారంతో ఉరికెళ్ళిన, మా ఊళ్ళో వాళ్ళను , మిత్రులను కలవాలనుకున్న మాట్లాడలనుకున్న. ఊర్లో కొంత మంది పిల్లలు, పెద్దలతో మాట్లాడిన. పిల్లలు నన్నెప్పుడు చూడలేదు, పరిచయం లేదు. మీరు ఎవ్వరు సార్ అని అడిగితే ఫలానా వారి పిల్లగాని అని చెప్పిన. ఏమో సార్ మాకు తెల్వదు అన్నరు. ఇంతటితో ఆపకుండా గ్రామంలోని ఇంకా పలువురి వ్యక్తుల గురించి అడిగితే వాళ్ళు గూడ తెల్వదు అని చెప్పిండ్రు. నాకు ఆశ్ఛర్యం కలిగింది. ఊరిలో ఉండి ఆ ఊరి కొంత మంది వ్యక్తులు, కుటుంబాల గురించి తెల్వక పొతే ఎట్లా అనిపించింది. వ్యక్తుల గురించే కాకుండా గ్రామ చరిత్ర వాటి ప్రత్యేకతలు కూడా తెలుసుకోవాలి. సదువులో మాత్రం ఎవరెవరిగురించో చరిత్రలో చదువుతం కానీ ఉర్లో ఉండి, ఉరి వ్యక్తుల గురించి తెలియదంటే బాధేసింది. మన గ్రామ చరిత్ర తెల్వకపోతే మన మండలం, మన జిల్లా చరిత్ర ఎట్లా తెల్సుకుంటాం. ఇక మరి చరిత్ర తెలియని వారు చరిత్ర స•ష్టించలేరు.
ఊర్లలో కొంత మంది ఆర్థికంగా ఉన్నవారు వారి కుటుంబ సభ్యుల పేరుపైన పాఠశాల, బస్సు స్టాండ్, లైబ్రరీ లాంటి వికట్టించిండ్రు. కట్టడాలకు కుటుంబ సభ్యుల పేర్లు పెట్టి తమ వంతు ప్రజలకు సౌకర్యాలు కల్పించి సమాజ సేవ చేసారు. ఈ రకంగా అలాంటి వారి ఊరి వ్యక్తుల గురించి, కుటుంబాల గురించి ఆ ఊరి ప్రజలకు మరియు భావి తరాలకు కొంత వరకు గుర్తుంది. ఇంకొంత మందికి గ్రామాశివారున చనిపోయిన తరువాత కనిపించే బిందానమో లేదా శిలా పలకమో! ఇది కూడా లేనివాళ్లు మట్టిలో మరిచిపోయియినట్టే!
ఇలా ఊర్లో ఉన్న మనుషులకు ఆ ఊరి సాధారణ వ్యక్తులు, కుటుంబాలు గురించి తెల్వకుంటే ఎట్లా అని నా మనసు కలిచివేసింది. ఆ మనుషుల గురించే తెల్వనప్పుడు ఇక వారి వ్యక్తిత్వం, గొప్పదనం, వారు గ్రామానికి చేసిన మంచి చెడుల చరిత్ర ఈ తరం వారికి ఎలా తెలుస్తుంది? మరి గ్రామానికి సంబందించిన చరిత్ర ఎలా సేకరిస్తాం, చరిత్ర ఎలా సంరక్షిస్తం, ఇతరులకు వివరిస్తాం?
స్థానిక చరిత్ర లేదు:
ప్రతి గ్రామానికి ఒక ప్రాముఖ్యత మరియు పూర్వ చరిత్రలు ఉంటాయి, ముఖ్యంగా ఆ గ్రామ జీవన శైలిలో ఆ ఊరికి చెందిన వ్యక్తులు కీలకమైన పాత్ర పోషిస్తారు. ప్రతి ఊరిలో ఎదో ఒక చెట్టు, పుట్ట, గుట్ట, పంట, గుడి, బడి, చెరువు, కుంట, వాగు, వంక, నాయకుడు, సాధారణ వ్యక్తి, కుటుంబం, ఆచారాలు, సంస్కృతికి ప్రత్యేక విశిష్టతను చాటుకుంటాయి. మన గ్రామంలో ఎనకటికి సమగ్ర పాలనా వ్యవస్థలు సరిగ్గా లేనప్పుడు ఊరి పెద్దలు మరియు ప్రజలు గ్రామ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించేవారు. గ్రామ ప్రజల జీవన శైలిలోఊరి పెద్దల ప్రభావం ఉండేది. ఆనాడు ప్రజలు భూమిపై ఆధారపడి జీవించిన మట్టి మనుషులు. ముఖ్యంగా ఆడోళ్ళు కూడా మగవారికి అన్ని రకాల సహాయంగా ఉండేవాళ్ళు. ఊరి పెద్దలు మంచి చెడు చూసేవాళ్ళు. మన ఊళ్లకు ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉంది కాబట్టి ఈ ఊరి ప్రజల ప్రత్యేకతలు, విశిష్టతలు కూడా చారిత్రాత్మకం. చరిత్ర లేనిదే సంస్క•తి లేదు. మన స్థానిక చరిత్ర మూలలను మరిచి పోకుండా మరింత శ్రద్ధ చూపాలి, పటిష్టం చేసుకోవాలి. గ్రామంలోని మట్టి మనుషులే చరిత్రకు మణులు మాణిఖ్యాలు. భారత దేశం చూడాలంటె పట్టణాలకన్నా ముందు పల్లెలు చూడాల్సినంత చరిత్ర మన గ్రామాలకుంది.
వ్యక్తుకులే కాకుండా అలాగే గ్రామంలోని ఆలయాలు, వాటి నిత్య నైవేద్యానికి మాన్యాలు, ఆచారాలు, వ్యవసాయ విధానాలు, గ్రామా ఆర్ధిక, పరిపాలక సంస్కరణలు, గ్రామం గురించిన గాథలు, విశ్వాసాలు, గ్రామం పుట్టుక గురించి అభూతకల్పనలు, గ్రామ సరిహద్దు వివరాలు చరిత్రకు సంబంధిచినవే. గ్రామంలోని భూములు, పంటలు, పన్నులు, చేనేత వంటి ఆనాటి ఉత్పత్తులు, వృక్షసంపద, జలవనరులు, ఖనిజాలు, సామాజిక సంబంధాలు, వ•త్తి కులాలకు మాన్యాలు వంటి వివరాలు ఆధునిక యుగం తెలుసుకోవాలి.
మనం పాఠ్యంశాలలో ‘చరిత్ర’ గురించి చదువుతాం, చరిత్రలో భాగంగా ఆనాటి రాజులు, వారి పాలన, వైభోగాలు, జీవన విధానం, మానవ అభివ•ద్ధి, రాష్ట్రాలు, దేశాలు, విదేశాలు మరియు గొప్ప వ్యక్తుల గురించి చదువుతం. కానీ మన ఊరి గురించి కానీ, ఆ ఊరి వ్యక్తుల గురించి చరిత్రలో ఎక్కడ చదువం. మన వాళ్లకు ఆ గుణ గణాలు లెవా? గుర్తించలేదా? మన గ్రామా వ్యక్తులు రాష్ట్ర స్థాయి లేక దేశ స్థాయి గొప్ప వ్యక్తులు కాకపోవచ్చు కానీ ఆ ఊరికి ఒక గొప్ప వ్యక్తులు కావచ్చు, వారి ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉండొచ్చు, వారి దయ గుణాలు, సేవా భావాలూ, పరిపాలన సంస్కరణలు మంచి చెడు ఏదైనా ఉండొచ్చు. మనం ఈ ఊరిని పాలించిన వాళ్ళు ఎవరని అడిగితే ఇద్దరు ముగ్గురు పేర్లకంటే ఎక్కువచెప్పరు, మిగతా వారి గురించి అసలే తెలువదు, కొంతమందికి ఆ ఊరి ప్రత్యేకత కూడా తెల్వకపోవచ్చు. నాకు మన బాధ్యతలలో ఎక్కడో ఖాళి ఉందని కొట్టొస్తుంది. కావున మన ఊరి చరిత్ర, మన మనుషుల గురించి మన పిల్లకు చెప్పాలనేదే నా అభిప్రాయం.
మన ఊరి మట్టి మనుషుల చరిత్ర ఎట్ల రాస్తాం, ఎవరు రాస్తారు, ఎక్కడ రాస్తరు అనేవి పెద్ద ప్రశ్నలే. ఊరికి సంబంధించి వ్యవస్తీకృత చరిత్ర వ్రాయడం అంత సులువు కాకపోయినా వ్రాయించే ప్రయత్నం చెయ్యొచ్చు. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి వ్రాయకున్నా కొంత మంది చరిత్ర రాయాలి, ఇతరులకు చెప్పాలి. అది అవసరం అనిపిస్తుంది. మన చరిత్ర ఇప్పుడు రాసుకోపోతే తరువాత వక్రీకరించే ప్రమాదం వుంది. మన చరిత్రను మనం సరైన ధృక్పథంతో రాసుకోని, కాపాడుకొని చదుకోవాల్సిన అవసరం ఉంది.
మనకు జీవిత అనుభవాలు, చదువుకున్న చరిత్ర ఎంత తెలిసినా మన అమ్మమ, తాత లేదా ఇంకొకరు యెనకటి చరిత్ర (ఎక్కడ వ్రాయనివి), పాతకాలం విషయాలు చెబుతుంటారు, మధుర స్మ•తులను నెమరు వేస్తుంటారు. మనకు ముఖ్యంగా మన కుటుంబం గురించి లేదా గ్రామానికి సంబంధించి విషయాలు, వాటి విశేషాలు, వారు చేసిన పనులగురించి చెప్పి మనకు చరిత్ర నేర్పుతుంటారు. మన అమ్మమ్మ, తాత కొంతవరకే చెబుతారు, అందరు అందరి గురించి చెప్పక పోవచ్చు. ఇవన్నీ ఎక్కడ రాసి
ఉండవు. ఈ రకంగా చరిత్ర ఒకతరం నుంచి ఇంకో తరానికి బదిలీ అవుతుంది. అదే చరిత్ర మనం మన పిల్లలకు లేక మన భావి తరాలకు చెప్పకుంటే చరిత్ర తుడుసుకుపోతుంది. మనం మన మట్టి మనుషులను మరిచిపోతాం.
స్థానిక చరిత్ర నమోదు:
బ్రిటిషు వాళ్ళు గ్రామ చరిత్రలు రాసినట్టు చెప్పినా మనకు ఎక్కడ కనపడవు. మన గ్రామ చరిత్రలు నమోదు చేసేముందు, ఈ రంగంలో స్వతంత్ర సామాజిక శాస్త్రవేత్తల అధ్యాయాలను, పరిశోధనలు, విశ్లేషణలు చేసినవాళ్లను ఈ రకమైన చరిత్ర నమోదు చేసిన వాళ్ళను సంప్రదించి వారి అనుమభావాలను తెలుసుకొని వారి ఆచరణలు పాటించి చరిత్ర రాస్తే భావి తరాలకు పటిష్టమైన చరిత్రను అందించిన వాళ్లమవుతాం.
మరి మనం ఎక్కడ రాయని స్థానిక గ్రామా చరిత్ర ఎట్లా రాస్తాం, ఎలా కాపాడుకుంటాం? ఎక్కడ మొదలు పెడదాం, ఎట్లా కొనసాగిస్తాం అనేవి ముందున్న సవాళ్లు. గ్రామా స్థానికుల చరిత్ర పలు రకాలుగా నమోదు చెయ్యొచ్చు. మొదటిది ఎవరికీ తెలిసింది వాళ్ళు చెప్పేది, వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పింది రాసి పెట్టడం (Unorganized). రెండోది వ్యవస్థీకృత (Organized) వ్యవస్థ ఏర్పాటు చేసి గ్రామానికి సంబదించిన చరిత్ర నమోదు చేయుట.
మన పూర్వీకులకు చదువు అంత రాకపోవొచ్చు, చరిత్రకు సంబదించిన సాక్షాలు అంత దొరకవు. కావున చరిత్రను సంరక్షించాలంటే మొదట చేయాల్సిన పని ఆ కుంటుంబానికి చెందిన వ్యక్తులు, పెద్దలు, పాత తరం వారు మౌఖికంగా చెప్పే చరిత్ర (Oral History) విషయాలను తప్పక నమోదు చేయాలి. ఒక వ్యక్తి తెలిసిన విషయాలు అతని జ్ఞాపక శక్తితో ముడి పడి ఉంటాయి. ఎదో రకంగా పెద్ద వయస్సు ఉన్న వారినుంచి వ్యక్తుల మరియు చరిత్ర అధికాంరంగా లేదా అనధికారంగా ఇంటర్వ్యూ రూపంలో బందించి చరిత్ర సంబంధించిన విషయాలు నమోదు చేసుకోవాలి.
ఈ సారి తెలంగాణ సందర్శించినప్పుడు మిత్రుడి అభ్యర్థన మేరకు వారి వూరికి వెళ్లి వాళ్ళ గ్రామ సర్పంచును కలిసిన. ఒక గొప్ప భావాలూ ఉన్న వ్యక్తిని కలిసిన భావన కలిగింది. విల్లెజి డెవలప్మెంట్ డైలాగ్‍లో భాగంగా ఆ సర్పంచుతో చాలా విషయాలపై చర్చ జరిగింది. ఆ ఊరి చరిత్రలో భాగంగా ఆ గ్రామా పంచాయితీ ఏర్పడ్డ తరువాత ఆ గ్రామా సర్పంచులు, ఉప సర్పంచుల ఫోటోల తో పాటు వారిగురించి క్లుప్తంగా వ్రాసి పెట్టె ఆలోచన ఉందని చెప్పిండు. వీటిని గ్రామా పంచాయితీ ఆఫీస్లో పెడ్తా అన్నడు. నాకు అద్బుతమైన ఆలోచన అనిపించింది. ఇంకా ఒక ఉత్తరప్రదేశ్ సర్పంచ్‍తో మాట్లాడితే ఆ చిన్న ఊర్లో ఒక మ్యూజియం లాగా ఏర్పాటు చేసి ఆ ఊరికి సంబంధించిన పాత వస్తువులు పూర్వపు వ్యక్తుల ఫోటోలు పెట్టించినట్టు చెప్పిండు.
ఈ రకంగా గ్రామాలలో గ్రామా పంచాయితీ ఆఫీసులోనో, మ్యూజియంలోనో, గ్రంధాలయంలోనో ఎక్కడో ఆ ఊరి వ్యక్తుల గురించి ఇతరవాటిపై సంక్షిప్తగా రాసి పెడితే, దీనివల్ల ఎంతో కొంత గ్రామస్తులకు ఆ ఊరి వ్యక్తుల గురించి, గ్రామ చరిత్ర తెలిసే అవకాశం ఉంటది. గ్రామ పాఠశాలలలో వారానికి ఒకసారి తప్పనిసరిగా ‘గ్రామ చరిత్ర’ను సబ్జెక్టుగా ఊరి గురించి చెపితే బాగుంటది. హైస్కూల్ వరకు వివిధ సంవత్సరాలలో సాంఘీక శాస్త్రంలో తప్పని సరిగా గ్రామ, మండల చరిత్ర పాఠాలు చేర్చాలి. ప్రతి జిల్లా చరిత్ర ప్రత్యేకంగా ముద్రించి ఉపవాచకంగా (సప్లిమెంటరీ) ఉంచినా బాగుంటది. గ్రామంలోని ప్రతి వ్యక్తి మరణించిన తరువాత వారి కుటుంబ సభ్యులు వెంబడే ఆ వ్యక్తిపై ఒక పేజీ అతనిపై పుట్టు పూర్వోత్తరాలు, వ్యక్తిత్వం, సమాజానికి చేసిన పనుల గురించి వ్రాస్తే బాగుంటది.
ఇంకో పక్క ప్రభుత్వం కూడా స్థానికి చరిత్ర పై ద•ష్టి పెట్టి గ్రామానికి ఒక ‘గ్రామా చారిత్రాత్మక సమాజం’ (‘Village Historical Society’) పెడితే బాగుంటది. వీళ్లు గ్రామానికి సంబంధించి చారిత్రాత్మక విషయాలు విశ్లేషించి సేకరించడం, సంరక్షించడం, పరిశోదించి మరియు వివరచడం. ఇలా ఒక వ్యవస్థీకరణ ద్వారా చరిత్ర సేకరిస్తే, మన చరిత్ర, వారసత్వాన్ని ఒక తరం నుంచి ఒక తరానికి ఇవ్వగలుగుతాం.
మేము స్థానిక చరిత్ర నమోదు చేయాలని ఒక ప్రాజెక్ట్ రూప కల్పన చేస్తున్నం, మీకు ఆసక్తి ఉంటే మీరు భాగస్వాములై సూచనలు మరియు సలహాలు చేయండి, ఈ ఇమెయిల్ కు రాయండి.
–విలెజ్ ,vcharithra@gmail.com