December

సింగరేణి సోలార్‍ విద్యుత్‍ సద్వినియోగానికి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‍ వ్యవస్థ

సోలార్‍ విద్యుత్తును నిలువ ఉంచడమే లక్ష్యం.. పైలెట్‍ ప్రాజెక్ట్గా ఒక మెగావాట్‍ ప్లాంట్‍దీని ద్వారా ఏడాదికి రూ.1.6 కోట్ల విలువైన సోలార్‍ సద్వినియోగంప్రయోగాత్మకంగా మందమర్రి సోలార్‍ ప్లాంట్‍లో ఏర్పాటుప్రయోగం సఫలమైతే మరో 2 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‍ ఏర్పాటుతద్వారా మొత్తం రూ.4.8 కోట్ల లబ్ధిసింగరేణి సీఎండీ ఎన్‍.బలరామ్‍ వెల్లడి సోలార్‍ విద్యుత్‍ సద్వినియోగం, పొదుపు చర్యల్లో భాగంగా సింగరేణి సంస్థ మరో వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. మందమర్రి సోలార్‍ ప్లాంట్‍లో పగటిపూట ఉత్పత్తి జరిగి, …

సింగరేణి సోలార్‍ విద్యుత్‍ సద్వినియోగానికి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‍ వ్యవస్థ Read More »

పామాయిల్‍ గెల – కాసులు గలగల

ఆయిల్‍ పామ్‍ రైతుకు అమ్మలా అండనిచ్చే మంత్రి తుమ్మల… ప్రస్తుతం ఏ రైతు నోట విన్నా… ఇదే మాట. అనుక్షణం పామాయిల్‍ రైతుల సంక్షేమాన్ని గురించి ఆలోచించే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతుకు మేలు చేసే ఏ అవకాశాన్నైనాఉపయోగించుకుంటారు. సెప్టెంబర్‍ నెలలో కేంద్ర మంత్రి శివరాజ్‍ సింగ్‍ చౌహాన్‍ ఖమ్మం జిల్లా సందర్శించినప్పుడు వారికి ఆయిల్‍ పామ్‍ రైతుల సాధకబాధకాలు వివరించారు. నూనెల మీద దిగుమతి సుంకం తక్కువగా ఉండటం వల్ల జరిగే నష్టాన్ని వివరించారు. కేంద్ర …

పామాయిల్‍ గెల – కాసులు గలగల Read More »

పర్యావరణాన్ని పరిరక్షించే గిరిజనుల కల్పవృక్షం!

పేదవాడి కలప, ఆకుపచ్చ బంగారంగా పేరొందిన వెదురు- అడవులకు స్థిరీకరణ శక్తిగా పనిచేస్తుంది. అడవుల్లో వర్షాల ధాటికి మట్టి కొట్టుకొని పోకుండా నిలువరిస్తుంది. అడవులపై ఆధారపడిన గిరిజనులతోపాటు, గ్రామీణుల జీవితాలతోనూ వెదురు పెనవేసుకుపోయింది. జీవనోపాధి మార్గంగానే కాకుండా, సామాజిక, సాంస్కృతిక, మతపరమైన కార్యకలాపాల్లోనూ ఒక భాగంలా మారింది. వెదురుకు ఉన్న బహుళ ప్రయోజనకర లక్షణాల కారణంగా గిరిజనులు తదితరులకు ఆదాయ, ఉపాధి కల్పనలో తోడ్పడుతోంది. గిరిజనుల వేట, ఆహార సేకరణ, వ్యవసాయ పనిముట్లు, సంగీత వాయిద్యాలు, గృహోపకరణాలు …

పర్యావరణాన్ని పరిరక్షించే గిరిజనుల కల్పవృక్షం! Read More »

పురాతన ధాన్యం- చిరుధాన్యాల పుణరాగమనం మిల్లెట్‍ మ్యాన్‍ ఆఫ్‍ ఇండియా డా. ఖాదర్‍ వలికి ఆక్స్ ఫర్డ్ గ్రామర్‍ స్కూల్‍ సత్కారం

నవంబర్‍ 18న హైదరాబాద్‍, హిమాయత్‍నగర్‍లోని ఆక్స్ఫర్డ్ గ్రామర్‍ స్కూల్‍ యాజమాన్యం పద్మశ్రీ అవార్డు గ్రహిత డాక్టర్‍ ఖాదర్‍ వలికి ఆతిథ్యమిచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా సత్కారగ్రహీత డాక్టర్‍ ఖాదర్‍వలి మాట్లాడుతూ.. వరి మరియు గోధుమ వంటి సాంప్రదాయ ప్రధాన పంటల నుండి ప్రపంచ ఆహార ఉత్పత్తి మరియు మానవ ఆరోగ్యంపై మన ద•ష్టిని మరల్చవలసిన అవసరాన్ని డాక్టర్‍ వలి చెప్పారు. అతను కొర్రలు, ఊదలు, సామలు, అరికలు, అండు కొర్రలు, సజ్జలు, రాగులు, వరిగలు మరియు జొన్నలు …

పురాతన ధాన్యం- చిరుధాన్యాల పుణరాగమనం మిల్లెట్‍ మ్యాన్‍ ఆఫ్‍ ఇండియా డా. ఖాదర్‍ వలికి ఆక్స్ ఫర్డ్ గ్రామర్‍ స్కూల్‍ సత్కారం Read More »

సాదిక్‍ అంటే నిరంతర చలనం!

ఒక సంఘ సేవకుడి గురించి మాట్లాడుకుందాం. ఒక మనసున్న స్నేహితుడి గురించి మాట్లాడుకుందాం. ఒక సాహిత్య ప్రేమికుడి గురించి మాట్లాడుకుందాం. సాహిత్యానికి నాలుగు చక్రాల కాళ్ళిచ్చి తోపుడుబండి పేరిట ఊరూరా చేర్చిన కార్యకర్త గురించి మాట్లాడుకుందాం. చదువుకోవడానికి ఆర్ధికసాయం అవసరమైన వాళ్ళకు నేనున్నానని అండగా నిలబడ్డ ఒక చేయూత గురించి మాట్లాడుకుందాం. ఒక జర్నలిస్ట్ గురించి ఒక ఆధునిక పెళ్లిళ్ల పేరయ్య గురించి ఒక ప్రేమికుడి గురించి హిందీ పాటల పిచ్చిలో రెండు చెవులు కోసేసుసుకున్న వ్యక్తి …

సాదిక్‍ అంటే నిరంతర చలనం! Read More »

పిల్లల గ్రంథాలయాలు – ప్రాముఖ్యత

57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలపై కార్యక్రమం బాల చెలిమి తెలంగాణ రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం సహకారంతో, హిమాయత్‍నగర్‍, హైదరాబాదులోని ఆక్స్ఫర్డ్ గ్రామర్‍ స్కూల్‍ కలసి నవంబర్‍ 19న, 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ‘‘పిల్లల గ్రంథాలయాలు మరియు వాటి ప్రాముఖ్యత’’ పై కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం, అఫ్జల్‍గంజ్‍, హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమానికి చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ ఛైర్మన్‍ మరియు బాలచెలిమి ప్రధాన సంపాదకులు, వేదకుమార్‍ మణికొండ అధ్యక్షత …

పిల్లల గ్రంథాలయాలు – ప్రాముఖ్యత Read More »

ప్రాచీన ఖగోళ విజ్ఞాన గని ‘ముడుమాల’

ఎన్నికల సంరంభం ముగిసి ఫలితాల కోసం ఉత్సుకతో ఎదురుచూస్తున్న వేళ ‘దక్కన్‍ల్యాండ్‍’ ప్రజల ముందుకు వస్తున్నది. నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణా సాధనలో ప్రధాన నినాదాలయ్యాయి. గడిచిన కాలంలో అనేక కారణాల వలన నియామకాలలో ఎదురయిన ఆటంకాలు, వైఫల్యాలు నిరుద్యోగ యువతలో ఆందోళనకు కారణమయ్యాయి. రాబోయే నూతన ప్రభుత్వం ముందు నిరుద్యోగ సమస్య సవాలుగా నిలువనుంది. ఏ ప్రభుత్వమయినా సమాజంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రణాళికా బద్ధంగా కృషి చేస్తుంది. ఆ క్రమంలో అనేక రూపాలలో ఆటంకాలు …

ప్రాచీన ఖగోళ విజ్ఞాన గని ‘ముడుమాల’ Read More »

పర్యావరణ ఉద్యమాల చిరునామా కెప్టెన్‍ జలగం రామారావు

పర్యావరణవేత్త, సామాజిక చింతనాపరుడు కెప్టెన్‍ జలగం రామారావు. తన 94వ ఏట అనారోగ్యంతో హైదరాబాద్‍లో మరణించారు.ప్రత్యేకంగా పర్యావరణం,కాలుష్యం అంశాలపై పని చేసే వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఖమ్మం జిల్లాలో జన్మించిన ఆయన ఇంజినీరింగ్‍ పూర్తి చేశాక నౌకాదళంలో చేరారు. కెప్టెన్‍ స్థాయికి ఎదిగి 23 సంవత్సరాలు పనిచేసి పదవీ విరమణ పొందారు. దాదాపు రెండు దశాబ్దాలు హైదరాబాద్‍లో చిన్న మెషిన్‍ టూల్స్ పరిశ్రమ నడిపించారు. అందువల్ల పరిశ్రమ రంగంలో జరుగుతున్న అవక తవకలను, పరిశ్రమలు వెదజల్లే కాలుష్యాన్ని, …

పర్యావరణ ఉద్యమాల చిరునామా కెప్టెన్‍ జలగం రామారావు Read More »

గత చరిత్రపు మరచిపోయిన మెట్లబావులు రాష్ట్ర చరిత్రలోకి తొంగిచూపు

హైదరాబాద్‍ చారిత్రాత్మక పరిసరాలు, కాలనీలలో ‘‘హైదరాబాద్‍లోని బౌలీలు’’(చారిత్రాత్మక మెట్లబావులు) అన్వేషణ.కాకతీయుల పాలనలో వర్షపు నీటిని సమర్ధవంతంగా పట్టుకోవడంలోమెట్లబావులు కీలక పాత్ర పోషించాయి.గుజరాత్‍కు భిన్నంగా తెలంగాణలో మెట్లబావుల కార్యాచరణపై దృష్టి సారించిసమర్థవంతంగా పనిచేయడానికై రూపొందించాయి. తెలంగాణలో మరుగన పడిన, మరచిపోయిన మెట్ల బావుల ఉనికిని కనుగొనడానికి, అన్వేషించడానికి మరియు డాక్యుమెంట్‍ చేయడానికి, హైదరాబాద్‍ డిజైన్‍ ఫోరం అధ్యక్షుడు ప్రొఫెసర్‍ యశ్వంత్‍ రామమూర్తి నేతృత్వంలో అతని బృందం నైపుణ్యంతో, విషయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి రూపొందించి, సమర్పించిన ‘‘ది ఫర్గాటెన్‍ స్టెప్వెల్స్ …

గత చరిత్రపు మరచిపోయిన మెట్లబావులు రాష్ట్ర చరిత్రలోకి తొంగిచూపు Read More »

పర్యావరణ హితం – గాంధీ దీపధారి

పర్యావరణ హితవరులుగా వ్యక్తులు, వ్యవస్థలు. వారి వారి వైఖరులు ఒక మేరకు మనకు దారి చూపుతుంటాయి. దిశానిర్దేశం చేస్తూ ఉంటాయి. ప్రతి సందర్భంలోనూ ఎదుర్కోవలసిన ప్రశ్న ఏమిటంటే సమస్యలో భాగమవుతామా? లేక పరిష్కారంలో భాగంగా ఉంటామా? అనేది ఇదొక ఎడతెగని, ఎంతకీ సంతృప్తికర సమాధానం దొరకని ప్రశ్నగానే మిగులుతుంది. అభివృద్ధి, స్థిరత్వం, సమతుల్యతను సాధించడం అనేవి ఒకదాని కొకటి అభిముఖంగా నిలవటమే కాక పరస్పరం ఖండించుకుంటూ ఉంటాయి. గాంధీ మహాత్ముడు గ్రామ పునరుద్ధరణ మీదనే భారతదేశ స్వాతంత్య్రం …

పర్యావరణ హితం – గాంధీ దీపధారి Read More »