February

ప్రకృతే సౌందర్యం! 21 ప్రకృతే ఆనందం!! సముద్ర గర్భం! మరో ప్రపంచం!

(గత సంచిక తరువాయి)పాలిచ్చే చేప : (mammal fish) – వేడినీటి చేపలు – అతిశీతల ప్రాంత చేపలు :అత్యంత చిరుచేప ఓ వింతగా భావిస్తుంటే, ఆఫ్రికాలోని అమెజాన్‍ ప్రాంతంలో పాలిచ్చే చేప లభించడం మరోవింత. వెయ్యి మీటర్ల లోతుల్లో కూడా చేపలు ఆవాసముంటే, మరికొన్ని చేపలు 500 C ఉష్ణోగ్రత వద్దకూడా జీవిస్తున్నట్లు, ఈ చేపలు ఉష్ణోగ్రత సమతుల్యతను (heat reducing) చేసుకునే యాంత్రికతను కలిగి వున్నట్లు కాలిఫోర్నియా సముద్రజలాల్లో గుర్తించారు. ఇది ఇలా వుంటే, …

ప్రకృతే సౌందర్యం! 21 ప్రకృతే ఆనందం!! సముద్ర గర్భం! మరో ప్రపంచం! Read More »

మాధవరం సెరెనిటీలో సిరిధాన్యాల వినియోగ సమావేశము

‘‘ఆరోగ్యమే మహాభాగ్యము’’ మనిషి ఎంత సంపాదించాడన్నది ముఖ్యం కాదు. ఎంతకాలం ఆరోగ్యంగా జీవించగలిగాడన్నదే ముఖ్యం. ఆరోగ్యమే అసలైన సంపద. కాబట్టి ఆరోగ్యవంతులే భాగ్యవంతులు’’. ఆరోగ్య సంపద కావాలంటే ‘చిరు’ధాన్యాలను ‘సిరి’ ధాన్యాలుగా భావించాలి. అవి చిన్న గింజలుగా కనిపించే ఆహార ధాన్యాన్ని మిల్లెట్స్ అంటారు. గడ్డి మొక్కల నుండి లభించే ధాన్యం ఇది. ఇప్పుడు సామలు, అరికలు, ఊదలు, కొర్రలు మరియు అండు కొర్రలు ఆరంటిని సిరిధాన్యాలుగా పిలుచుకుంటున్నాము. దీర్ఘకాలంగా వివిధ రోగాల బారిన పడిన వారే …

మాధవరం సెరెనిటీలో సిరిధాన్యాల వినియోగ సమావేశము Read More »

ఆయిల్‍ పామ్‍ – జీవ ఇంధనం

ఆయిల్‍ పామ్‍ను వంటనూనెగా ఉపయోగిస్తారు అని మాత్రమే మనకు తెలుసు. కాని ఆయిల్‍ పామ్‍ను జీవ ఇంధనంగా ఉపయోగించి ఇండోనేషియా దేశంలో విమానాన్ని నడిపించారు.పామాయిల్‍ నూనె కున్న డిమాండ్‍ను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం NAMEO-OP పథకం క్రింద రైతులను ప్రోత్సహిస్తున్నది.అర్హతలు:అనువైన భూమి, పట్టాదార్‍ పాస్‍బుక్‍, బోరు, కరెంట్‍ వసతులు కలిగియున్న ప్రతి రైతు ఆయిల్‍పామ్‍ తోట సాగు చేయవచ్చు.రైతు వాటా:ఒక మొక్కకు రూ.20/- చొప్పున ఎకరానికి రూ.1140/- ణణ ద్వారా జిల్లా ఉద్యాన మరియు పట్టుపరిశ్రమ శాఖ …

ఆయిల్‍ పామ్‍ – జీవ ఇంధనం Read More »

పరుల కోసం

పూర్వం క•ష్ణా నది ఒడ్డునున్న శేరు గూడెంలో రాఘవయ్యనే జాలరి నివసిస్తుండే వాడు. తనకు పిల్లలు లేరు. తెల్లవారు జామున్నే వల తీసుకొని నది వద్దకు వెళ్ళేవాడు. పడవ మీద నీళ్ళ లోకి వెళ్ళి, తను పెట్టిన మావులు, బుట్టలు చూసుకునే వాడు. వాటిల్లో పడ్డ చేపల్ని తీసి, పడవలో ఉన్న తాటాకు బుట్టలో వేసుకొని తిరిగి యధా స్థానంలో వాటిని పెట్టేవాడు. తరువాత నది మీద పడవలో తిరుగుతూ వల విసిరే వాడు. పడిన చేపల్ని …

పరుల కోసం Read More »

ఓ అమ్మ – ఆవేదన

పిల్లలకు అత్యంత ఆనందానిచ్చేది ఆట బొమ్మలు.,కథల పుస్తకాలే. పాఠ్య పుస్తకాలు అందించే జ్ఞానానికి సమాంతరంగా మరెంతో లోకజ్ఞానాన్ని అందించేది బాల సాహిత్యమే. భాషకు సంబంధించిన ప్రాధమిక పరిజ్ఞానాన్ని అందించేవి కథలే. కొత్త కొత్త పదాలను పరిచయం చేసేది కథల పుస్తకాలే. పుస్తకాలు పిల్లల ఆలోచనా నైపుణ్యాలను పెంచుతాయి. వారి ఊహలకు ప్రాణం పోస్తాయి. వారిలో సృజనాత్మకతను పెంచుతాయి. పిల్లలలో నైతికతను, సక్రమమైన ప్రవర్తనను, మంచి చెడుల అవగాహనను పెంచే బాధ్యతను ఉమ్మడి కుటుంబాల్లో నాయనమ్మలు, అమ్మమ్మలు చెప్పే …

ఓ అమ్మ – ఆవేదన Read More »

భావితరాల ప్రయోజనకారి-నేటి విద్యావిధానం

అనేక సామాజిక రుగ్మతలకు మూలం నిరక్షరాస్యత.ఈ నిరక్షరాస్యతకు మూలం సామాజిక అసమానతలు. విద్య, వైద్య విధానాల రూప కల్పన, ఆచరణ ఆయా సామాజికాభివృద్ధికి కారణమవుతాయి. నూతన రాష్ట్రం ఏర్పడినాక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందరికీ విద్య అందాలన్న సదాశయంతో దేశంలో మరెక్కడా లేని విధంగా కెజీ టూ పీజీ ఉచిత విద్యకు అంకిత భావంతో అంకురార్పణ చేసింది. గిరిజన, ఆదివాసీ, మైనారిటీ, దళిత బహుజన విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలను, స్థానిక, ప్రాంతీయ భాషల అభివృద్ధిలో భాగంగా …

భావితరాల ప్రయోజనకారి-నేటి విద్యావిధానం Read More »

సిరిప్రెగడ భార్గవరావు

‘‘పల్లెలు మా నివాసములు పచ్చని పంట పొలాలు మా మనః పుల్లత గూర్చు చైత్రములు, బోదెల పైని రసాల శాఖికా పల్లవముల్‍ గ్రసించు చిరుపాటలదియాని తేనెతేటలు జిల్లు పికంబు మా యనుగుచెల్లెలు గానమె మాదు ప్రాణమౌ’’.అని కంఠమెత్తి పాడిన కవికోకిల సిరిప్రెగడ భార్గవరావు.ఎక్కడో నల్లగొండ జిల్లాలోని చండూరు సమీపముగల చిరుపల్లె గూడెపల్లిలో సిరిప్రెగడ జన్మించారు. ఆయన జనన తేది కూడా సాహితీలోకానికి తెలియదు. చాలా పిన్న వయస్సులోనే 1963లో ఆయన అస్తమించారు.1934లో గుంటూరు జిల్లా ‘ఏదుబాడు’ నుండి …

సిరిప్రెగడ భార్గవరావు Read More »

మనం మరచిన సంస్థాన మహిళలు

హైదరాబాద్‍ రాజ్యమే ఎనుకటి ఇండియాలో పెద్ద సంస్థానం. దానికి అనుబంధంగా ప్రతి జిల్లాలో చిన్న, పెద్ద సంస్థానాలు పరిపాలన సాగించేవి. ఈ సంస్థానాధీశులతో చాలా మందికి దగ్గరి సంబంధాలుండేవి. దోమకొండ సంస్థానానికి అమరచింత సంస్థానాధీశులతో, గద్వాల సంస్థాన పాలకులకు మెదక్‍ జిల్లాలోని పాపన్నపేట సంస్థానానికి, జటప్రోలు (కొల్లాపురం) సంస్థానాధీశులకి వెంకటగిరి, నూజివీడు, బొబ్బిలి పాలకులతో, వనపర్తి సంస్థానం వారికి మునగాల పాలకులతో సంబంధ బాంధవ్యాలుండేవి. ఇవన్నీ ఆ పరిపాలన సజావుగా జరగడానికి, వారి రాజరికాన్ని, అధికారాన్ని నిలుపుకోడానికి …

మనం మరచిన సంస్థాన మహిళలు Read More »

భగ్నహృదయాల దయ్యాల మేడ ‘వికార్‍ మంజిల్‍’

ప్రేమకోసం తాజ్‍మహల్‍ వెలిసింది. ఒక ప్రియుడు, తన ప్రియురాలికి ఇచ్చిన ప్రేమ కానుకగా హైద్రాబాద్‍ నగరం అవతరించింది.అసలు హైద్రాబాదే ఒక ప్రేమనగరం. కొడుకు మీద ప్రేమతో ఒక ముసలి తండ్రి నిర్మించిన వంతెన పూరానాపూల్‍. తన ముస్లిం భార్య మీద ప్రేమతో ఒక ఆంగ్లేయుడు కట్టించిన భవనమే కోఠిలోని రెసిడెన్సీ. ప్రస్తుతం ఇది ఉమెన్స్ కాలేజీగా చెలామణి అవుతుంది. ఒక ముస్లిం ప్రేమికుడు తన ఫార్సీ భార్యకోసం కట్టించిన మహల్‍ ‘‘వికార్‍ మంజిల్‍’’. అతను ఎవరో కాదు …

భగ్నహృదయాల దయ్యాల మేడ ‘వికార్‍ మంజిల్‍’ Read More »

పర్యావరణం – శాస్త్రం – నైతికత – తాత్విక దృక్పథాలు

(గత సంచిక తరువాయి) సోషల్‍ ఎకాలజీముర్రేబుక్‍చిన్‍ అనే సామాజిక సిద్ధాంతకర్త సాగించిన ఆలోచనధారను ‘సోషల్‍ ఎకాలజీ’గా వ్యవహరిస్తున్నారు. నాలుగు దశాబ్దాలపై చిలుకుగా ఈయన సామాజిక ఆధిపత్యం, ప్రకృతిపై ఆధిపత్యం మధ్యగల సంబంధాలను గురించి సాగించిన రచనల సారాంశం సోషల్‍ ఎకాలజీగా గుర్తింపు పొందింది.ఈయన సాగించిన చింతనకు మూలాలు భిన్న రకాలైన తాత్త్విక సంప్రదాయాలలో కనిపిస్తాయి. ముఖ్యంగా మార్క్సీయ సామ్యవాదం, ఉదార అరాచకవాదం, పాశ్చాత్య జీవవాదాలలో దర్శనమిస్తాయి. అదే విధంగా అరిస్టాటిల్‍, హెగెల్‍ వంటి తత్త్వవేత్తల ఆలోచనల ప్రభావం …

పర్యావరణం – శాస్త్రం – నైతికత – తాత్విక దృక్పథాలు Read More »