నడకేరా అన్నిటికి మూలం..
‘‘పాలిటెక్నిక్‍లో చదివి డిప్లొమా తీసుకున్న నువ్వొచ్చి ఈ బిల్డింగ్ కన్‍స్ట్రక్షన్‍లో ఎలా చేరావ్ సుధీర్?’’ అడిగాడు గోపాల్.‘‘నిజమే! ఒకప్పుడు పాలిటెక్నిక్‍లో డిప్లొమా ప్యాసయితే తప్పకుండా ప్రభుత్వోద్యోగం దొరికేది. ఇప్పుడా పరిస్థితి లేదు. పాలిటెక్నిక్‍లో డిప్లొమా ఎన్నో కష్టాలతో పూర్తిచేశాను. స్కాలర్‍షిప్ వస్తుండేది. ప్రభుత్వం కూడా మనం కట్టాల్సిన ఫీజుల్ని రీయింబర్స్ చేయిస్తుండేది. అయితే డిప్లొమా పూర్తిచేసిన తర్వాత యే ఆధారం లేదు. మా తల్లిదండ్రులే వలసకూలీలుగా యే బీహార్‍కో, గుజరాత్‍కో వెళ్తుంటారు. అందువల్ల నేనూ కొంతకాలమైనా వలసకూలీగా …