October

ఆకుపచ్చ నగరం… హరిత హైదరాబాద్‍

ప్రకృతి సమవాది. తను ఇవ్వదగిన ప్రతిదీ సృష్టిలోని ప్రతి జీవరాశికీ అవసరాలకి అనుగుణంగా అందించగల వర ప్రసాదిని. జీవరాశులన్నిటిలో తెలివైనవాడుగా పరిగణించ బడుతున్న మనిషి ‘ప్రకృతి తన ఒక్కడిదే’ అన్న భావనతో అవసరానికి మించి వినియోగించటంతో జీవ వైవిధ్యం దెబ్బ తినడమే కాక, ప్రకృతిలో సమతుల్యతకి విఘాతం ఏర్పడుతుంది. దీని వల్ల ప్రకృతి విపత్తులు వేగంగా వెంట వెంటనే తోసుకొస్తున్నాయి. మానవాళి అవసరాలకి అనుగుణంగా ప్రకృతిని క్రమబద్ధంగా వినియోగించుకోగల విజ్ఞత నేటి తక్షణ అవసరం. హైదరాబాద్‍ నగరం …

ఆకుపచ్చ నగరం… హరిత హైదరాబాద్‍ Read More »

జహీర్‍ భాయ్‍ – ఒక నిశ్శబ్ద ధిక్కార స్వరం

ది సియాసత్‍ డైలీ మేనేజింగ్‍ ఎడిటర్‍ జహీరుద్దీన్‍ అలిఖాన్‍ ఆగస్టు 7, సోమవారం అల్వాల్‍లో ప్రజా యుద్ద నౌక తన చిర కాల స్నేహితుడైన గద్దర్‍ అన్న అంత్యక్రియల ఊరేగింపులో గుండెపోటు కారణంగా మరణించారు. ఆయన అకాల మరణం సామాజిక కార్యకర్తలకు అణగారిన వర్గాలకు తీరని దుఖం. గద్దరన్న మరణంతో జహీర్‍ భాయ్‍ తో పాటు యావత్‍ తెలంగాణ సమాజం శోక సముద్రంలో మునిగి ఉన్న సమయంలో మరో దుఃఖాన్ని మిగిలించి వెళ్ళాడు జహీర్‍ భాయి. ఆగస్ట్ …

జహీర్‍ భాయ్‍ – ఒక నిశ్శబ్ద ధిక్కార స్వరం Read More »

భానుడి గుట్టు… భారత్‍ గుప్పిట్లో…!! ఏ ఆదిత్య – ఎల్‍1

ఆ చల్లని సముద్ర గర్భందాచిన బడబానల మెంతో?ఆ నల్లని ఆకాశంలోకానరాని భానువులెందరో? అంటూ సుదూర విశ్వాంతరాళంలో మనకు తెలియని రహస్యాలెన్నో ఉన్నాయని తన గేయం ద్వారా విలక్షణ శైలిలో వ్యక్తీకరించారు మహాకవి దాశరథి కృష్ణమాచార్య. ఆ రహస్యాలను ఛేదించేందుకేనా అన్నట్లుగా గతంలో మంగళ్‍యాన్‍ పేరుతో అంగారక గ్రహంపైకి, తాజాగా చంద్రయాన్‍-3 పేరుతో చంద్రుడి ఉపరితలంపై రోవర్‍ను సాఫ్ట్ ల్యాండింగ్‍ చేయించడం ద్వారా రెండు గ్రహాంతర ప్రయోగాలను నిర్వహించి సరికొత్త ఉత్సాహంతో ఉన్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ …

భానుడి గుట్టు… భారత్‍ గుప్పిట్లో…!! ఏ ఆదిత్య – ఎల్‍1 Read More »

జానే కాహా గయే ఓదిన్

మొన్న మొన్న కొన్ని రోజుల క్రింద పొద్దు పొద్దుగాల్నే నేనింకా పక్క మీద నిద్ర మబ్బుల ఉండంగనే మా సుశక్క ఫోను.‘‘అరే లోకి! నీకు తెలుసారా? ఆషా టాకీసు మొత్తం కూలగొ ట్టిండ్రు. ఇగక్కడ షాపింగ్‍ మాల్‍ కడ్తరంట’’ అని అంగలారుస్తూ తన పాత జ్ఞాపకాల మూటను విప్పి ‘‘నీకు జ్ఞాపకముందా 1972ల అండ్ల మనిద్దరం ‘గంగా జమునా’ సీన్మా సెకండ్‍ షో చూసినం’’ అంటూ వైజయంతిమాల పాడిన ‘‘డుండో డుండోరే సాజ్‍నా’’ పాట లోకి వెళ్లి …

జానే కాహా గయే ఓదిన్ Read More »

మట్టిని కాపాడుకుందాం… మనిషినీ కాపాడుకుందాం!

ఇటీవల హైదరాబాద్‍ సమీపంలో రంగారెడ్డి జిల్లా కన్హా శాంతివనంలో ‘4 పర్‍ 1000’ పేరిట ఆసియా పసిఫిక్‍ ప్రాంతీయ సదస్సు జరిగింది. కన్హా శాంతివనంలో జరిగిన సదస్సుకు ముఖ్య అతిథిగా తెలంగాణ వ్యవసాయ మార్కెటింగ్‍ సహకార శాఖామాత్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్‍ రెడ్డి హాజరయ్యారని పత్రికలలో వచ్చింది. మంత్రులన్న తరువాత అనేక సదస్సులలో, సమావేశాలలో పాల్గొనవలసి వస్తుంది. అదంత ముఖ్యమైన విషయం కాకపోవచ్చు కాని, ఆ సదస్సులో నిరంజన్‍రెడ్డి మాట్లాడిన విషయాలు, ప్రస్తావించిన అంశాలు ఎంతో ముఖ్యమైనవి, …

మట్టిని కాపాడుకుందాం… మనిషినీ కాపాడుకుందాం! Read More »

తెలంగాణా తొలి పంచాయతనం గంగాపురం శిథిల చెన్నకేశవాలయం

వైదిక బ్రాహ్మణ మతశాఖల్లో సామరస్యం కోసం పూనుకొన్న ఆదిశంకరాచార్యులు ఒకే ప్రాంగణంలో ఐదుగురు ప్రధాన దేవతల ఆరాధనకు వీలు కల్పించే పంచాయతన అనే ఐదు దేవాలయాల సముదాయ నిర్మాణానికి ఒక కొత్త నమూనా నిచ్చాడు. ఏ దేవతను మధ్యలో పెట్టి ఆలయాన్ని నిర్మిస్తారో ఆ దేవత పేరున ఆ పంచాయతనం పిలువ బడుతుంది. అదుగో, అలా విష్ణు పంచాయతనంగా కొలువైంది మహ బూబ్‍నగర్‍ జిల్లా, జడ్చర్ల మండలం, గంగాపురంలోని చెన్నకేశవాలయం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే తొలి …

తెలంగాణా తొలి పంచాయతనం గంగాపురం శిథిల చెన్నకేశవాలయం Read More »

ఆకుపచ్చ నగరం అందరికీ ఆదర్శం చింతచెట్టు కింద పాఠాలతో హైదరాబాద్‍ అభివృద్ధి

సెప్టెంబర్‍ 28…ఈ తేదీ రాగానే… 1908లో హైదరాబాద్‍ ను ముంచెత్తిన చరితాత్మక వరదలే గుర్తుకొస్తాయి. అప్పట్లో ఈ వరదలు నాటి నగరంలో అధిక భాగాన్ని జలమయం చేశాయి. వేలాది మందిని నిరాశ్రయులుగా మార్చాయి. వరదలు వచ్చి నేటికి 115 ఏళ్లు గడిచినా… ఈ నగరానికి నాటి స్మృతులు నేటికీ తడి ఆరకుండానే ఉన్నాయి. అఫ్జల్‍ గంజ్‍ పార్క్ (నేడు ఉస్మానియా ఆసుపత్రిలో భాగం) లో ఉన్న ఓ చింత చెట్టు నాటి జ్ఞాపకాలను నేటికీ గుర్తు చేస్తూనే …

ఆకుపచ్చ నగరం అందరికీ ఆదర్శం చింతచెట్టు కింద పాఠాలతో హైదరాబాద్‍ అభివృద్ధి Read More »

ఉమ్మడి ఖమ్మం జిల్లా శిలా మరియు ఖనిజ సంపద

ఈ జిల్లాలోని ప్రాంతం రాష్ట్ర విభజన జరగక ముందు 15,886 చదరపు కిలోమీటర్లుగా వుండేది. కాని విభజన సమయంలో ఈ జిల్లాలోని ఏడు (7) మండలాలు ఆంధప్రదేశ్‍లో కలపబడినవి. అవి బూర్గంపహాడ్‍, కుక్కునూరు, నెల్లిపాక, చింతూర్‍, వి.ఆర్‍పురం మరియు కూనవరం మండలాలు. దీని వల్ల దాదాపు 3000 చదరపు కిలోమీటర్లు ఈ జిల్లా మరియు తెలంగాణ రాష్ట్రం కోల్పోయింది. ఈ జిల్లాకు ఉత్తర దిశలో చత్తీస్‍గఢ్‍ ఒడిషా రాష్ట్రాలు, దక్షిణాన ఆంధప్రదేశ్‍, పశ్చిమంలో వరంగల్‍, నల్గొండ మరియు …

ఉమ్మడి ఖమ్మం జిల్లా శిలా మరియు ఖనిజ సంపద Read More »

జ్ఞాపకాల మూట అక్టోబర్‍ 9న ‘‘ప్రపంచ తపాలా దినోత్సవం’’

నిన్న మొన్నటి వరకూ టెలిఫోన్‍ కలిగిన వారిదే. మధ్యతరగతిది ఉత్తరం. పేదవాడికి పోస్ట్కార్డ్. కనీసం ఐదు దశాబ్దాల భారతీయుల జీవన భావోద్వేగాలు లేఖలు, ఉత్తరాలు, ఇంటర్వ్యూ కార్డులు, మనీ ఆర్డర్‍ల చుట్టే తిరిగాయి. ఉత్తరం లేకపోతే… పోస్ట్మేన్‍ లేకపోతే ఆ జ్ఞాపకాలు ఉండేవా? అక్టోబర్‍ 9 ‘వరల్డ్ పోస్ట్ డే’ సందర్భంగా కొన్ని ఉద్వేగాల రీవిజిట్‍.1970లు, 80లు కొడుకుల మనిఆర్డర్‍ల కోసం తల్లిదండ్రుల కళ్లు కాయలు కాచేలా చేశాయి. నిరుద్యోగ భారతంలో కొడుకు ఉద్యోగం సంపాదించి ఎంతో …

జ్ఞాపకాల మూట అక్టోబర్‍ 9న ‘‘ప్రపంచ తపాలా దినోత్సవం’’ Read More »

ప్రపంచ వారసత్వ పటంలో శాంతినికేతన్‍

విశ్వకవి రవీంద్రనాథ్‍ ఠాగూర్‍ నెలకొల్పిన శాంతినికేతన్‍కు యునెస్కో వరల్డ్ హెరిటేజ్‍ సైట్‍ గుర్తింపు లభించింది. పశ్చిమబెంగాల్‍ లోని శాంతినికేతన్‍ సాంస్క•తిక, విద్యాకేంద్రంగా వెలుగొందుతోంది. సౌదీ అరేబియాలోని రియాద్‍ లో జరిగిన వరల్డ్ హెరిటేజ్‍ కమిటీ(World Heritage Committee)45వ సెషన్‍ సందర్భంగా ఈ గుర్తింపు ప్రకటన వెలువడింది. ప్రాధాన్యం:శాంతినికేతన్‍కు UNESCO వరల్డ్ హెరిటేజ్‍ హోదా లభించడం శాంతినికేతన్‍ సాంస్క•తిక, విద్యాత్మక ప్రాధాన్యతను చాటి చెబుతుంది. దాని విశిష్ట ఆర్కిటెక్చరల్‍ హెరిటేజ్‍ను కాపాడేందుకు వీలు కల్పి స్తుంది. రవీంద్ర నాథ్‍ …

ప్రపంచ వారసత్వ పటంలో శాంతినికేతన్‍ Read More »