September

కళ’తప్పుతున్న కంసాలి బతుకులు

విశ్వకర్మ చరిత్ర :‘శిల్పాచార్యాయ దేవాయ నమస్తే విశ్వకర్మణేమనవే మయాయ త్వష్ట్రేచ శిల్విన్‍ దైవ్ఞతే నమః’పురుషసూక్తంలో విరాట్‍ పురుషునిగా అభివర్ణితుడైన విశ్వకర్మ దేవశిల్పి. అష్టావసువులలో ఒకరైన ప్రభావను కుమారుడు. తల్లి యోగసిద్ధి. పురాణకథల్లో అనేక చోట్ల విశ్వకర్మ ప్రస్తావన కనిపిస్తుంది. అరవై నాలుగు కళలలో ఒకటైన వాస్తు (నిర్మాణ) శాస్త్ర స్థాపకుడు (గాడ్‍ ఆఫ్‍ ఆర్కిటెక్చర్‍) వాస్తు పురుషుడు. ‘విశ్వకర్మా సహంస్రాంశౌ’ అని ప్రమాణం. తొలిరోజులలో విశ్వకర్మను అపర బ్రహ్మ అనీ వ్యహరించేవారు. అప్సరస ఘృతాచిని, విశ్వకర్మ పరస్పరం …

కళ’తప్పుతున్న కంసాలి బతుకులు Read More »

దిగుడు బావుల పునరుద్ధరణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్య్తం చేసిన ‘ఫోరం ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍’

తెలంగాణ రాష్ట్రంలోని దిగుడు బావులను గుర్తించి, వాటిని పునరుద్ధరించడానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. అలాంటి స్టెప్‍వెల్‍ (దిగుడు బావులు) లను గుర్తించడానికి హైదరాబాద్‍ డిజైన్‍ ఫోరమ్‍ (హెచ్‍డిఎఫ్‍) సంస్థను భాగస్వామ్యం చేసుకుందని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్‍ శాఖా మంత్రి కేటీఆర్‍ తెలిపారు. ఈ సంస్థ భాగస్వామ్యంలో సూచించిన ప్రతిపాదిత వాటి పునరుద్ధరణ పూర్తయిన తర్వాత డిపార్ట్మెంట్‍ మరిన్ని బావులను పునరుద్ధరించనుంది. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‍ మరియు చుట్టుపక్కల చారిత్రాత్మకంగా ముఖ్యమైన 10 స్టెప్‍వెల్‍ (దిగుడు బావులు)ల …

దిగుడు బావుల పునరుద్ధరణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్య్తం చేసిన ‘ఫోరం ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍’ Read More »

ప్రముఖ ఫుట్‍బాల్‍ దిగ్గజం సయ్యద్‍ షాహిద్‍ హకీమ్‍ ఇక లేరు

భారత్‍ ఫుట్‍బాల్‍లో ‘స్వర్ణయుగం’లాంటి గత తరానికి ప్రతినిధిగా నిలిచిన ఆటగాళ్లలో మరొకరు నిష్క్రమించారు. నగరానికి చెందిన ప్రముఖ ఫుట్‍బాలర్‍, 1960 రోమ్‍ ఒలింపిక్స్లో భారత జట్టు సభ్యుడిగా ఉన్న సయ్యద్‍ షాహిద్‍ హకీమ్‍ ఆగస్టు 22న గుల్బర్గాలో కన్ను మూశారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. డెంగీ సోకడంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చామని, చికిత్స పొందుతుండగానే గుండెపోటుతో హకీమ్‍ మృతి చెందారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. గత ఏడాది జూలైలో కోవిడ్‍ బారిన పడిన ఆయన అనంతరం …

ప్రముఖ ఫుట్‍బాల్‍ దిగ్గజం సయ్యద్‍ షాహిద్‍ హకీమ్‍ ఇక లేరు Read More »

జంట నగరాల్లోని రక్షిత స్మారక చిహ్నాల పరిరక్షణకు తెలంగాణ రాష్ట్ర హరిటేజ్‍ అథారిటీ సమావేశం

బి.ఆర్‍.కె.ఆర్‍ భవన్‍లో తెలంగాణ రాష్ట్ర హెరిటేజ్‍ అథారిటీ (రాష్ట్ర స్థాయి) మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‍ కుమార్‍ అధ్యక్షత వహించారు. జంట నగరాల్లోని 26 రక్షిత స్మారక చిహ్నాలు (Protected Monuments), కుతుబ్‍ షాహీ సమాధులు మరియు గోల్కొండ కోటకు సంబంధించిన హెరిటేజ్‍ సమస్యలపై కమిటీ చర్చించింది. రక్షిత స్మారక చిహ్నాలపై సంక్షిప్త స్టేటస్‍ నోట్‍ ఫోటోలతో సహాతయారు చేయాలని, తదుపరి చర్యల నిమిత్తం తనిఖీ నివేదికను సమర్పిం చాలని …

జంట నగరాల్లోని రక్షిత స్మారక చిహ్నాల పరిరక్షణకు తెలంగాణ రాష్ట్ర హరిటేజ్‍ అథారిటీ సమావేశం Read More »

ప్రమాదంలో పుడమి కవచం

సెప్టెంబర్‍ 16న ఓజోన్‍ పరిరక్షణ దినోత్సవం ఒక ఆక్సిజన్‍ అణువులో సాధారణంగా రెండు ఆక్సిజన్‍ పరమాణువులు ఉంటాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆక్సిజన్‍ అణువుకు మరో ఆక్సిజన్‍ పరమాణువు జతచేరినప్పుడు ‘ఓజోన్‍’ అణువు ఏర్పడుతుంది. మూడు ఆక్సిజన్‍ పరమాణువులతో కలసి ఏర్పడుతుంది గనుక ‘ఓజోన్‍’ను ‘ట్క్రెయాక్సిజన్‍’ అని కూడా అంటారు. ఓజోన్‍ పొర స్ట్రాటోస్పియర్‍ వద్ద భూమికి 15 నుంచి 35 కిలోమీటర్ల ఎత్తున ఆవరించి ఉంటుంది. రుతువుల్లో మార్పుల బట్టి, భౌగోళిక పరిస్థితుల బట్టి ఓజోన్‍ …

ప్రమాదంలో పుడమి కవచం Read More »

పంప మహాకవి గాథ

తెలుగుభాషకు ప్రాచీనహోదానిచ్చింది కుర్క్యాలలోని బొమ్మలగుట్ట త్రిభాషాశాసనం. ఈ శాసనం క్రీ.శ.945 ప్రాంతందై వుంటుందని కుర్క్యాలశాసనాన్ని పరిశోధించి, పరిష్కరించి వెలుగులోనికి తెచ్చిన నేలటూరి వేంకట- రమణయ్య అభిప్రాయం. ఈ శాసనంలో పేర్కొనబడ్డ రెండు ప్రదేశాలలో ఒకటి సిద్ధశిల. దీనిమీదనే శాసనం, బొమ్మలమ్మ (చక్రేశ్వరి), ఆద్యంత తీర్థంకరులు, ఇతర జైనమునుల శిల్పాలు చెక్కబడ్డాయి. రెండవది వృషభాద్రి. బొమ్మలమ్మగుట్టనే వృషభాద్రి అంటారు కాని, నేలటూరి అభిప్రాయం ప్రకారం ఈ గుట్ట ఎక్కడుందో గుర్తించబడలేదు. అంతేకాదు కుర్క్యాల శాసనకర్త జినవల్లభుని సోదరుడు మహాకవి …

పంప మహాకవి గాథ Read More »

తీర్పుల్లో ఉర్దూ కవిత్వం

ఉర్దూ భాషకి కోర్టులకి అవినావభావ సంబంధం ఉంది. ఉర్దూ పదజాలం కోర్టు పరిభాషలో ఎక్కువగా కన్పిస్తూ వుంటుంది. శాసనాలలో కూడా ఉర్దూ పదాలు ఎక్కువగా దొర్లుతూ వుంటాయి. వకాలత్‍, హలఫ్‍నామా, వకీలు, గవా, హాజిర్‍హై లాంటివి కొన్ని ఉదాహరణలు.ఉర్దూ పదాలు, పదబంధాలే కాదు, చాలా తీర్పుల్లో ఉర్దూ కవిత్వం కూడా కన్పిస్తూ వుంటుంది. సంక్లిష్టమైన కేసుల్లో, అదే విధంగా ప్రజల దృష్టిని ఎక్కువగా ఆకర్షించిన కేసుల్లో కూడా ఉర్దూ కవిత్వం దర్శనం యిస్తూ వుంటుంది. యుద్ధనేషియా కేసులో, …

తీర్పుల్లో ఉర్దూ కవిత్వం Read More »

ప్రకృతే నియంత్రిస్తుంది! 11 ప్రకృతే శాసిస్తుంది!! భూపరిమాణ శాస్త్రం – సర్వేల విధానం!

(గత సంచిక తరువాయి)గర్‍వాల్‍, కుమాన్‍ జిల్లాల ఆక్రమణ:1814-15 గూర్ఖాలతో యుద్ధం చేసిన బ్రిటీషువారు ఖాడ్మండును ఆక్రమించాలనుకున్నారు. గూర్ఖాల ప్రతిఘటనతో సాధ్యంకాలేదు. కాని, గూర్ఖాల ఆధిపత్యం తక్కువగా వున్న గర్‍వాల్‍, కుమాన్‍ జిల్లాల్ని (నేటి ఉత్తరాఖండ్‍) బ్రిటీషు వారు చేజిక్కించుకున్నారు. వెంటనే విలియం వెబ్‍కు కుమాన్‍ ప్రాంతాన్ని, జాన్‍ హడ్‍సన్‍ (Hodgson)కు గర్‍వాలా ప్రాంతాన్ని అప్పజెప్పారు. వీరు 1816లో తమ సర్వేలను ప్రారంభించారు.రాబర్ట్ మరణంతో ఆయన కుటుంబ బాధ్యతలతోపాటు, మిగతా సర్వే బాధ్యతల్ని హెన్రీ తిరిగి స్వీకరించాడు. అప్పటికే …

ప్రకృతే నియంత్రిస్తుంది! 11 ప్రకృతే శాసిస్తుంది!! భూపరిమాణ శాస్త్రం – సర్వేల విధానం! Read More »

సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం

(షుగర్‍ (డయాబెటిస్‍), బీపీ థైరాయిడ్‍, ఊబకాయం, కీళ్ళనొప్పులు,రక్తహీనత తదితర 45 రకాల వ్యాధులు, 14 రకాల క్యాన్సర్లను దేశీ ఆహారంతో జయించే పద్ధతులు) ఆహారం విషపూరితం2030 నాటికి కోటి 40 లక్షల మంది వరకు కేన్సర్‍ బారిన పడే పరిస్థితి నెలకొంది. దీనిక ప్రధాన కారణం… ప్రతి రోజూ మనం తింటున్న విషతుల్యమైన ఆహారమే! ఇప్పుడు తింటున్న ఆహారం మరింత విషపూరితంగా మారిపోతోంది. పురుగు మందులుజనాభా పెరుగుతున్న కొద్దీ అధికంగా ఆహారం ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఏర్పడింది. …

సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం Read More »

మార్జాల రాజు

అనగనగా ఒక ఊళ్లో గొల్లవాడి ఇంట్లో ఒక పిల్లి ఉండేది. పాలు, పెరుగు తాగి వెన్న మెక్కి ఆ పిల్లి పిప్పళ్ళ బస్తాలా తయారయింది. దాన్ని చూస్తే మిగతా పిల్లులకు వెన్నెముకలో వణుకు పుట్టుకొచ్చి ఆమడదూరం పారిపోయేవి. దాంతో పిప్పళ్ళ బస్తా లాంటి పిల్లికి కళ్లు నెత్తిమీది కొచ్చాయి. తన పేరు మార్జాల రాజుగా మార్చేసుకొంది. మిగతా పిల్లులతో మాట్లాడటం తనకు తలవంపులుగా భావించేది.ఒకనాడు మార్జాలరాజు ఒక కాయితం, కలం తీసుకొని అడవిలోకి వెళ్ళింది. దానికి అక్కడ …

మార్జాల రాజు Read More »