నవమాసాలు అమ్మ కడుపులో
రక్తమాంసాల మధ్య పరిచయం
లేని ఒంటరి జీవితాన్ని గడిపిన పసిపాపను నేను
కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టి
నవమాసాల పాలబుగ్గ వయసులో
పాపాత్ముడి చేతిలో బలైన పసిపాపను నేను
పరాయివాడైనా పాపాయిలా నన్ను
నవ్విస్తాడనుకున్నాను కాని కామంతో
కవ్విస్తాడని కలలో ఊహించని పసిపాపని నేను
అమ్మఒడికి దూరమై ఆడి పాడే
వయసులో అందమైన ప్రపంచం
నుండి నేడు అద •శ్యమైన పసిపాపను నేను
కామంతో కళ్లు మూసుకుపోయి
సిగ్గులేని సభ్యసమాజంలో తలదించి
తనువును చాలించిన పసిపాపను నేను
ఏ ఘడియలో నిద్ర లేచానో కాని
మలి ఘడియ రాకముందే కానరాని
లోకానికి చేరుకున్న నేటి పసిపాపను నేను
పాలబుగ్గల నా పసి బాల్యం
తల్లిదండ్రుల సాక్షిగా కామాంధుడి
చేతిలో స్మశానానికి దగ్గరైన పసిపాపను నేను
- కమ్మరి శ్రీనివాస్ చారి
ఎ : 9177324124
