ప్రత్యేక రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి: దేవాదాయ & అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తరువాత, ముఖ్యమంత్రే స్వయంగా భక్తిపరుడు కాబట్టి దేవాలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఏ కార్యక్రమం మొదలు పెట్టినా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి మొదలు పెడతారన్నారు. సమైక్య రాష్ట్రంలో దేవాదాయ శాఖ అంటే కొన్ని పేర్లు మాత్రమే వినబడేవి. తిరుపతి కలిగియు దైవం వెంకటేశ్వర్లస్వామి, విజయవాడ కనకదుర్గ, సింహాచలం అప్పన్న, అన్నవరం సత్యనారాయణ ఇలా కొన్ని పేర్లు మాత్రమే భక్తుల నోట వినిపించేవి. […]








