వయనాడ్ నేపథ్యంలో.. తూర్పు కనుమల్ని కాపాడుకుందాం!! తూర్పు కనుమల్ని ప్రపంచ సహజ వారసత్వ సంపదగా ప్రకటించాలి

ప్రకృతి ఎంత సుందరమైనదో, ఎంత దృఢమైనదో అంత సున్నితమైనది కూడా. ప్రకృతి సకల జీవరాశికి ఆవాస నిలయమే కాదు ఆ జీవరాశి మనుగడకు తరగని వనరుల పెన్నిధి కూడా.
సకల జీవరాశి ప్రకృతిని తమకు అవసరమైనంత వరకే ఉపయోగించుకుంటాయి. ఒక్క మనిషి మాత్రమే స్వార్థ చింతనతో, సుఖలాలసతో తనకున్న సాంకేతిక జ్ఞానంతో ప్రకృతిని విచ్చలవిడిగా ఉపయోగించుకుంటున్నాడు. …









