
ఆయిల్ పామ్, కొబ్బరి, వక్క, వెదురు, సేంద్రియ సాగు వంటి అంశాలపై శ్రీ విజయ్ కుమార్ సముద్రాల వ్రాసిన వ్యాసాలు దక్కన్ ల్యాండ్ మాసపత్రికలో ప్రచురింపబడ్డాయి. ఈయన రాసిన వ్యాసాలను జిల్లా కలెక్టర్లు, ఉద్యాన శాఖ డైరెక్టర్లు ఇతర ఉన్నతాధికారులు, డ్రిప్ కంపెనీ ప్రతినిధులు, రైతులు పలు సందర్భాల్లో అభినందించారు. ఈయన రాసిన ‘‘రామనా చందనాలో.. వెన్నెల… ఆయిల్ పామ్‍కు వందనాలు’’.. అనే పాట రాష్ట్రవ్యాప్తంగా అభినందనలు పొందింది.
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కవి సమ్మేళనాలలో కూడా ఈయన పాల్గొని అభినందనలు పొందారు. 31.07.2025న పదవీ విరమణ చేయుచున్న శ్రీ విజయ్ కుమార్ సముద్రాల గారికి దక్కన్ ల్యాండ్ మాసపత్రిక తరపున అభినందనలు తెలియజేస్తున్నాం
-దక్కన్ న్యూస్
