భూమిపై ఆదిమ జీవం అభివృద్ధిసోన్ భద్ర ఫాసిల్స్ పార్క్

ఉత్తర ప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో ఉన్న సల్ఖాన్ శిలాజ ఉద్యానవనాన్నే అధికారికంగా సోన్‌భద్ర శిలాజ ఉద్యానవనంగా వ్యవహరిస్తుంటారు. ఇది కైమూర్ వన్యప్రాణుల అభయారణ్యం పచ్చదనం మధ్య ఉన్న ఒక అద్భుతమైన భౌగోళిక ప్రదేశం. ఇది జిల్లా ప్రధాన కార్యాలయం అయిన రాబర్ట్స్‌గంజ్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో సల్ఖాన్ గ్రామానికి సమీపంలో ఉంది. సుమారు 25 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఇది వింధ్య పర్వత శ్రేణిలో ఉంది. భౌగోళికంగా ఇది కఠినమైన భూభాగం. నిటారుగా ఉన్న కొండచరియలు, ప్రత్యేకమైన భౌగోళిక ప్రకృతి దృశ్యాలతో వర్గీకరించబడింది. ఈ ఉద్యానవనం సుమారు 1.4 బిలియన్ సంవత్సరాల నాటి శిలాజాల గొప్ప రిపోజిటరీకి నిలయంగా ఉంది. ఇది ప్రపంచంలోని పురాతన, బాగా సంరక్షించబడిన శిలాజ ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది.
వివిధ నిర్మాణాలలో చెల్లాచెదురుగా ఉన్న ఈ సైట్ శిలాజ సమ్మేళనం ప్రధానంగా అసాధారణమైన స్ట్రోమాటో లైట్‌ల కలెక్షన్ (సైనోబాక్టీరియా లేదా నీలి-ఆకుపచ్చ ఆల్గే లు సృష్టించిన నిర్మాణాలు)ను కలిగి ఉంది. ఇవి పురాతన పర్యావరణ పరిస్థితులు, సూక్ష్మజీవుల జీవితానికి ముఖ్యమైన సూచికలు. ఈ ప్రదేశంలోని స్ట్రోమాటోలైట్లలో ప్రధానంగా కనిపించేది వలస సైనోబాక్టీరియం అయిన ఇయోఎంటోఫిసాలిస్ sp. శిలాజాలు సున్నపురాయి శిల ఉపరితలాలపై చెల్లాచెదురుగా ఉన్న అలల రూపం లేదా వలయాకార/వృత్తాకార లేదా ఓవల్ రాతి నిర్మాణాలుగా కనిపిస్తాయి. ఈ నిర్మాణాలు పార్కులోని నిర్దిష్ట మండలాల్లో కేంద్రీకృతమై ఉన్నాయి.
సల్ఖాన్ శిలాజాలు జాగ్రత్తగా భద్రపరచబడ్డాయి. ఇవి భౌగోళిక చరిత్రలో కీలక సమయమైన ప్రొటెరోజోయిక్ ఇయాన్ సమయంలో మన గ్రహంపై నివసించిన తొలి జీవ రూపాల గురించి అమూల్యమైన అంతర్దృష్టులను అందిస్తున్నాయి. భూమిపై జీవ రూపాల పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి ఇది చాలా అవసరం. స్తంభం, స్ట్రాటిఫాం (పొరల రూపం), డోమల్ (గోపుర) రూపాలతో సహా వివిధ రకాల స్ట్రోమాటోలిటిక్ స్వరూపాలను ఈ ఉద్యానవనం కలిగి ఉంది. ఇవి వింధ్య సూపర్‌గ్రూప్ భందర్ సున్నపురాయిలో భద్రపరచబడ్డాయి. ఇది భూమిపై ప్రొటెరోజోయిక్ అవక్షేపణ శిలల అత్యంత విస్తృతమైన, బాగా సంరక్షించబడిన కలెక్షన్ లలో ఒకటి. సల్ఖాన్ పార్క్ సూపర్‌గ్రూప్‌లోని పురాతన భాగమైన ‘సెమ్రీ గ్రూప్’లో ఉంది.
ఈ ప్రదేశం స్థలాకృతిలో బహిర్గతమైన సున్నపురాయి పడకలు అరుదైన వృక్షసంపదతో కూడి ఉంటాయి. ఇవి బహిరంగ సహజ మ్యూజియంగా ఏర్పడతాయి. ఈ శిలాజ-సంపన్న పొరలను సులభంగా గమనించ వచ్చు. ఇది ఈ ప్రదేశాన్ని శాస్త్రీయ పరిశోధన, విద్యా పర్యాటకం రెండింటికీ అమూల్య వనరుగా మారు స్తుంది.
సల్ఖాన్ శిలాజ ఉద్యానవనం ఒక ముఖ్యమైన పాలియోబయోలాజికల్, భౌగోళిక ప్రదేశంగా దాని పాత్రకు మించి విస్తరించి ఉంది. కైమూర్ వన్యప్రాణుల అభయారణ్యం పచ్చని పరిసరాలలో ఉన్న ఇది, పొడి ఆకు రాల్చే అడవులు, పొదలు, గడ్డి భూములు, నదీ పర్యావరణ వ్యవస్థలను కలిగి ఉన్న తన వైవిధ్యమైన ప్రకృతి దృశ్యంతో గణనీయమైన పర్యావరణ ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది అనేక రకాల వృక్షజాలం, జంతు జాలానికి స్వర్గధామంగా ఉపయోగపడుతుంది.

సల్ఖాన్ శిలాజ ఉద్యానవనం, తన అసాధారణ పాలియోబయోలాజికల్, భౌగోళిక ప్రాముఖ్యతతో, ప్రారంభ జీవ పరిణామపు సహజ ఆర్కైవ్‌గా నిలుస్తుంది. భూమిపై ఆదిమ జీవం అభివృద్ధి చెందిన పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఒక ముఖ్యమైన సూచన బిందువుగా పనిచేస్తుంది.
ఈ ప్రదేశంలోని ప్రొటెరోజోయిక్ స్ట్రోమాటోలైట్‌లు భూమిపై జీవం ప్రారంభ చరిత్రలో ఒక కీలకమైన దశను వివరిస్తాయి: అదే ది గ్రేట్ ఆక్సీడేషన్ సంఘటన. స్ట్రోమాటోలైట్‌ల ప్రాథమిక రూపకర్తలైన సైనోబాక్టీరియా, భూ వాతావరణాన్ని ఆక్సిజన్‌తో నింపడంలో కీలక పాత్ర పోషించింది. ఇది ప్రాథమికంగా దాని భూరసాయన తత్వాన్ని మార్చివేసింది. గ్రహం మీద ఏరోబిక్ జీవం పరిణామానికి వీలు కల్పించింది.
ఈ ఉద్యానవనంలో – డోమల్ నుండి స్తంభాల వంటి నిర్మాణాల వరకు – స్ట్రోమాటోలైట్ స్వరూపాల వైవిధ్యం ప్రొటెరోజోయిక్‌లోని డైనమిక్ పర్యావరణ పరిస్థితులను ప్రతిబింబిస్తుంది. వీటిలో నీటి లోతు, అవక్షేపణ, తరంగ కార్యకలాపాలలో వైవిధ్యాలు ఉన్నాయి. బ్లాక్ చెర్ట్ బ్యాండ్‌లలో పొందుపరచబడిన మైక్రోఫాసిల్స్ సైట్ ప్రాముఖ్యతను మరింత ప్రగాఢమైందిగా చేస్తాయి. పోషకాల సైక్లింగ్, జీవగోళాన్ని స్థాపించడంలో కీలక పాత్ర పోషించిన పురాతన బ్యాక్టీరియా, ఆల్గల్ పర్యావరణ వ్యవస్థలను ఇవి ప్రదర్శిస్తాయి. సైనోబాక్టీరియా శిలాజ అకినెట్‌లు పర్యావరణ ఒత్తిడి కాలాలను సూచిస్తాయి. ఈ ప్రారంభ జీవ రూపాల అనుకూల వ్యూహాలను ప్రముఖంగా చాటిచెబుతాయి.
అంతేగాకుండా, ఈ ప్రదేశంలో ప్రారంభ బహుళ సెల్యులార్ జీవ రూపాల ఆధారాలు ఆధునిక జీవవైవిధ్యం వైపు పరిణామ మార్గంలో కీలకమైన అడుగును సూచిస్తాయి.
భౌగోళికంగా, ఈ ఉద్యానవనం భూమిపై అత్యంత విస్తృతమైన, బాగా సంరక్షించబడిన ప్రొటెరోజోయిక్ అవ క్షేపణ వారసత్వాలలో ఒకటైన వింధ్య సూపర్‌గ్రూప్‌లో ఉంది. దీని అవక్షేపణ పొరలు పర్యావరణ, నిక్షేపణ ప్రక్రియల వివరణాత్మక కాలక్రమాన్ని అందిస్తాయి. భూమి చరిత్ర ప్రారంభ అధ్యాయాలలోకి వెళ్లేందుకు ఒక ప్రత్యేకమైన లెన్స్‌ను అందిస్తాయి. వింధ్య శ్రేణిలోని సెమ్రి గ్రూపులో ఈ సైట్ స్థానం ప్రారంభ జీవితం వృద్ధి చెందిన, పరిణామం చెందిన పరిస్థితులను అర్థం చేసుకోవడానికి భౌగోళిక, జీవసంబంధమైన సూచన బిందు వుగా దాని పాత్రను నొక్కి చెబుతుంది.
పురాజీవశాస్త్ర ప్రాముఖ్యత, కీలకమైన పరిణామ మైలురాళ్ల ఆధారాలు, బాగా సంరక్షించబడిన భౌగోళిక శ్రేణుల కలయిక సల్ఖాన్ శిలాజ ఉద్యానవనాన్ని భూమిపై జీవం మూలాలు, వైవిధ్యతను అర్థం చేసుకోవ డానికి ఒక అమూల్యమైన వనరుగా చేస్తుంది.

ప్రమాణం (viii): సల్ఖాన్ లోని 1.4 బిలియన్ సంవత్సరాల పురాతన శిలాజాలు స్ట్రోమాటోలైట్స్ అత్యుత్తమ రికార్డును ఏర్పరుస్తాయి. ఇవి భౌగోళిక చరిత్రలో కీలకమైన సమయమైన ప్రొటెరోజోయిక్ ఇయాన్‌ ను అర్థం చేసుకునేందుకు తిరుగులేని అవకాశాన్ని అందిస్తాయి. భూమిపై జీవ రూపాల పరిణామాన్ని అర్థం చేసు కోవడానికి ఇది ముఖ్యమైనది. ఈ ప్రదేశంలోని శిలాజ స్ట్రోమాటోలైట్‌లు అత్యంత పురాతనమైన, బాగా సంర క్షించబడిన ప్రారంభ జీవితానికి ఉదాహరణలలో ఒకటి. ఈ నిర్మాణాలు పురాతన సూక్ష్మజీవుల పర్యా వరణ వ్యవస్థల వైవిధ్యం, సంక్లిష్టతను వెల్లడిస్తాయి. గ్రహం మీద జీవితాన్ని ఆకృతి చేసిన ప్రారంభ జీవ ప్రక్రియలపై వెలుగునిస్తాయి.
సల్ఖాన్ శిలాజ పార్క్ 2020 ‘రక్షిత, సంరక్షించబడిన ప్రాంతాలలో భౌగోళిక పరిరక్షణ కోసం మార్గదర్శ కాలు’లో ఐయూసీఎన్ సూచించిన కీలకమైన భౌగోళిక-వారసత్వ ఆసక్తి వర్గాలలో ఒకటి – ‘జీవన పరి ణామం’. ఇది 2021 ‘భౌగోళిక ప్రపంచ వారసత్వం – ప్రపంచ వారసత్వ సమావేశం ప్రమాణం (viii) యొక్క వర్తింపునకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్’ ప్రకారం థీమ్ -1 – ‘భూ గ్రహం చరిత్ర – జీవ పరిణామం’ కింద కూడా అర్హత పొందింది. ఈ థీమ్ కింద, ఫనెరోజోయిక్ యుగం ప్రపంచ వారసత్వ జాబితాలో బాగా ప్రాతినిధ్యం వహిస్తుం దని, బహుళ సైట్‌లు వేర్వేరు కాలాలు, బయోటోప్‌లను ప్రదర్శించడంతో, భూమి చరిత్రలో 85% వాటా ఉన్నప్పటికీ, ప్రీ-కేంబ్రియన్ శిలాజ ప్రదేశాలు తక్కువగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయని ఐయూసీఎన్ స్పష్టం చేసింది. గ్రేట్ ఆక్సీడేషన్ సంఘటనతో సహా కీలకమైన ప్రీ-కేంబ్రియన్ సంఘటనలు జాబితాలో పూర్తిగా ప్రాతినిధ్యం వహించబడలేదని ఇది నొక్కి చెబుతుంది. సల్ఖాన్ శిలాజ పార్క్ ప్రాముఖ్యత ఈ ప్రాతి నిధ్యానికి సంబంధించి గుర్తించబడిన అంతరాలతో సంపూర్ణంగా సమలేఖనం చేయబడింది. ఈ ప్రదేశంలోని శిలాజ రికార్డులు కీలకమైన పరిణామ పరివర్తనలను సంగ్రహిస్తాయి, వీటిలో బహుళ సెల్యులారిటీ అభివృద్ధి, గ్రేట్ ఆక్సీడేషన్ సంఘటన (అంటే ఆక్సిజన్ ఉత్పత్తి చేసే జీవుల పెరుగుదల) ఉన్నాయి. ఈ సంఘటనలు భూమిపై జీవ పథాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించాయి.
సల్ఖాన్ సున్నపురాయి సూక్ష్మ శిలాజాలు త్రిమితీయంగా సంరక్షించబడ్డాయి. చాలా తక్కువ మార్పులకు లోనయ్యాయి. వీటిలో బెడ్‌డెడ్ స్ట్రోమాటోలైట్‌లు, చెర్టిఫైడ్ స్ట్రోమాటోలైట్‌లు ఉన్నాయి. సైట్ శిలాజాల అసాధారణ సంరక్షణ, వైవిధ్యం గొప్ప శాస్త్రీయ వనరుగా పనిచేస్తాయి. ప్రొటెరోజోయిక్ ఇయాన్ పాలియో ఎన్విరాన్‌మెంట్‌ను పునర్నిర్మించడానికి కీలకమైన ఆధారాలను అందిస్తాయి. ఇది ప్రారంభ జీవిత పరిణామా న్ని ప్రభావితం చేసిన పర్యావరణ పరిస్థితులను అర్థం చేసుకోవడంలో సహాయ పడుతుంది. ఇప్పటికే ఉన్న ప్రపంచ వారసత్వ శిలాజ రికార్డులో గణనీయమైన తాత్కాలిక అంతరాన్ని తగ్గించడం ద్వారా, ఇది ప్రారంభ జీవ చరిత్ర ప్రపంచ గుర్తింపును విస్తరించడానికి ఒక అసాధారణ అవకాశాన్ని సూచిస్తుంది.

సల్ఖాన్ శిలాజ పార్క్ దాని భౌగోళిక, పాలియోబయోలాజికల్ లక్షణాల పరంగా అధిక స్థాయి సమగ్రతను కలిగి ఉంది. ప్రతిపాదిత సైట్ సరిహద్దు దాని అత్యుత్తమ సార్వత్రిక విలువకు దోహదపడే అన్ని అవసరమైన అంశాల పూర్తి ప్రాతినిధ్య నమూనాను కలిగి ఉంది. వీటిలో బాగా సంరక్షించబడిన స్ట్రోమాటోలైట్ శిలాజాలు, అనుబంధ అవక్షేపణ శిల నిర్మాణాలు ఉన్నాయి. సల్ఖాన్ శిలాజాలలో ఎక్కువ భాగం ఈ క్షేత్రంలో సిటులోనే ఉన్నాయి. అందువల్ల వాటి పర్యావరణ సందర్భంలో అధ్యయనం కోసం అందుబాటులో ఉన్నాయి.
ఈ ప్రదేశం కైమూర్ వన్యప్రాణుల అభయారణ్యం (కేడబ్ల్యూఎల్ఎస్) రక్షిత గొడుగు కిందకు వస్తుంది. అభయారణ్యం లోని గుర్మా శ్రేణిలో ఉన్నందున, ఇది దాని శిలాజాలను, చుట్టుపక్కల పర్యావరణ వ్యవస్థను రక్షించే బహుళ -స్థాయి చట్టపరమైన చట్రాన్ని కలిగి ఉంది. ఈ ప్రదేశంలో మానవ జోక్యం తక్కువగా ఉంది. అది శిలాజాలు వాటి సహజ స్థితిలో ఉండటానికి వీలు కల్పిస్తుంది. స్థానిక, జాతీయ అధికారులు ఈ ప్రదేశాన్ని రక్షించడానికి తగు చర్యలు తీసుకున్నారు. కొనసాగుతున్న పరిరక్షణ ప్రయత్నాలు పార్క్ శిలాజ రికార్డు సమగ్రతను కాపాడటం లక్ష్యంగా పెట్టుకున్నాయి.

కైమూర్ వన్యప్రాణుల అభయారణ్యంలోని గుర్మా శ్రేణిలో ఉన్న సల్ఖాన్ శిలాజ ఉద్యానవనం, రాష్ట్ర అటవీ శాఖ అధికార పరిధిలోకి వస్తుంది. బహుళ-స్థాయి చట్టపరమైన రక్షణ చట్రాన్ని కలిగి ఉంది.
1972 నాటి వన్యప్రాణుల (రక్షణ) చట్టం ప్రకారం కైమూర్ వన్యప్రాణుల అభయారణ్యం జారీ చేసిన నోటిఫికేషన్‌లో దీని చట్టపరమైన రక్షణకు పునాది ఉంది. ఈ అభయారణ్యం రక్షిత జోన్ శిలాజ ఉద్యాన వనంతో సహా 501 చదరపు కిలోమీటర్ల విస్తారమైన ప్రాంతాన్ని కలిగి ఉంది. ఈ నోటిఫికేషన్ మొత్తం ప్రాంతాన్ని రక్షిత మండలంగా పేర్కొంటుంది. అడవి జంతువుల ఆవాసాలను అలాగే శిలాజ ఉద్యానవనం లోని భౌగోళిక నిర్మాణాలను దెబ్బతీసే లేదా నాశనం చేసే ఏదైనా కార్యకలాపాలను నిషేధిస్తుంది. ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్, 1927 (ఐఎఫ్ఏ) సల్ఖాన్ శిలాజ ఉద్యానవనం ప్రకటిత అటవీ ప్రాంతంలోకి వస్తుంది కాబట్టి దాని రక్షణకు కూడా దోహదపడుతుంది. ఈ చట్టం అటవీ శాఖకు అడవిలో కార్యకలాపాలను నియంత్రించ డానికి, అటవీ వనరుల అక్రమ వెలికితీతను నిరోధించడానికి అధికారం ఇస్తుంది. జీవ వైవిధ్య చట్టం, 2002 (బీడీఏ) శిలాజ ఉద్యానవనంలోని ప్రత్యేక జీవవైవిధ్యానికి అదనపు రక్షణను అందిస్తుంది. బీడీఏ కింద శిలాజాలు జీవ వైవిధ్యం భాగాలుగా గుర్తించబడ్డాయి. ఇది వాటి పరిరక్షణ విలువను నొక్కి చెబుతుంది. వాటి రక్షణకు మంచి చట్టపరమైన ఆధారాన్ని అందిస్తుంది. అటవీ (సంరక్షణ) చట్టం, 1980 (ఎఫ్‌సిఏ) అటవీ భూమిని అటవీయేతర ప్రయోజనాల కోసం మళ్లించడాన్ని నియంత్రించడం ద్వారా అడవులను రక్షించడం, సంరక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. శిలాజ ఉద్యానవనం అభయారణ్యం అటవీ ప్రాంతంలోకి వస్తుంది కాబట్టి, ఎఫ్‌సిఏ అదనపు రక్షణ పొరను అందిస్తుంది.
అంతేగాకుండా, కేడబ్ల్యూఎల్ఎస్ యొక్క ఎకో-సెన్సిటివ్ జోన్ నోటిఫికేషన్ అభయారణ్యం సరిహద్దు చుట్టూ 1 కి.మీ. దాకా విస్తరించి ఉంది. ఈ జోన్ శిలాజ ఉద్యానవనంతో సహా రక్షిత ప్రాంతంపై వాటి ప్రభావాన్ని తగ్గించడానికి కార్యకలాపాలను నియంత్రిస్తూ, నిర్వహిస్తూ బఫర్‌గా పనిచేస్తుంది.
కైమూర్ వన్యప్రాణుల అభయారణ్యం నిర్వహణ ప్రణాళిక సల్ఖాన్ శిలాజ ఉద్యానవనంలోని శిలాజాలతో సహా దాని జీవవైవిధ్య రక్షణ, పరిరక్షణ కోసం నిర్దిష్ట వ్యూహాలను వివరిస్తుంది. సాధారణ ప్రజలు ఆ ప్రాంతాన్ని చేరుకోవడాన్ని నియంత్రించడం, సందర్శకుల కోసం ప్రకటిత మార్గాలు, అవగాహన కార్యక్రమాలపై దృష్టి సత్ఫలితాలను అందిస్తున్నాయి. అటవీ అధికారులు/ఫ్రంట్‌లైన్ సిబ్బంది పెట్రోలింగ్, పర్యవేక్షణ ప్రయత్నా లను, పరిరక్షణ ప్రయత్నాలలో స్థానిక సమాజ నిమగ్నత, ఆక్రమణలు – అనధికార కార్యకలాపాలను నివారించడానికి అవగాహన ప్రచారాలకు కూడా సైట్ నిర్వహణ ప్రణాళిక మార్గనిర్దేశం చేస్తుంది. మొత్తంమీద, ఇది అటవీ శాఖ కార్యకలాపాలకు ఒక చట్రాన్ని అందిస్తుంది, సైట్ రక్షణ, నిర్వహణకు సమన్వయపూరిత, క్రమబద్ధమైన విధానాన్ని నిర్ధారిస్తుంది.

సల్ఖాన్ శిలాజ ఉద్యానవనంలోని ప్రొటెరోజోయిక్ శిలాజాల అద్భుతమైన కలెక్షన్, భూమిపై జీవం ప్రారంభ చరిత్రను సంగ్రహావలోకనం చేసే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంపిక చేసిన సైట్‌ల సమూహంలో ఒకటిగా నిలిచింది. ఈ సమూహంలో సల్ఖాన్ ప్రత్యేక స్థానాన్ని బాగా అర్థం చేసుకోవడానికి, ఇతర ప్రముఖ శిలాజ ప్రదేశాలతో తులనాత్మక విశ్లేషణ చాలా ముఖ్యమైనది.

సల్ఖాన్, ఎల్లోస్టోన్ రెండూ స్ట్రోమాటోలైట్లు, మైక్రోశిలాజాల గొప్ప సేకరణలను కలిగి ఉన్నాయి. ఇవి ప్రొటెరోజో యిక్ పర్యావరణ వ్యవస్థల గురించి అంతర్దృష్టులను అందిస్తాయి. సల్ఖాన్ శిలాజాలు చాలా పాతవి. ఎల్లోస్టోన్ యొక్క 500 మిలియన్ సంవత్సరాల పురాతన నిర్మాణాలతో పోలిస్తే 1.4 బిలియన్ సంవత్సరాల నాటివి. ఈ వయస్సు వ్యత్యాసం చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇది భూమి చరిత్రలో మునుపటి, తక్కువగా అర్థం చేసుకున్న, తక్కువ వివరించిన కాలానికి వెళ్లేందుకు ఒక మార్గాన్ని అందిస్తుంది. అంతేగా కుండా, సల్ఖాన్ శిలాజాలు అసాధారణమైన సంరక్షణను ప్రదర్శిస్తాయి. ఇది మరింత వివరణాత్మక శాస్త్రీయ అధ్యయనానికి వీలు కల్పిస్తుంది.

న్యూఫౌండ్‌ల్యాండ్ ఆగ్నేయ కొనపై ఉన్న మిస్టేకెన్ పాయింట్, దాదాపు 565 నుండి 541 మిలియన్ సంవత్సరాల క్రితం ఎడియాకరన్ కాలం చివరి నుండి ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన ప్రదేశం. ఇది మనకు తెలిసిన పురాతనమైన పెద్ద, సంక్లిష్టమైన బహుళ సెల్యులార్ జీవులను కలిగి ఉంది. ఇక్కడి శిలాజాలు “ఎడియాకరన్ బయోటా”లో భాగం. ఇందులో ఇసుకరాయిలో ముద్రలుగా భద్రపరచబడిన మృదువైన శరీర జీవుల శిలాజాలు ఉన్నాయి. ఈ సైట్ సంక్లిష్ట జీవుల ప్రారంభ పరిణామం, మరింత సంక్లిష్టమైన పర్యావరణ వ్యవస్థలకు పరివర్తన గురించి అమూల్యమైన సమాచారాన్ని అందిస్తుంది.
సల్ఖాన్ శిలాజ ఉద్యానవనం, మిస్టేకెన్ పాయింట్ రెండూ భూమిపై జీవం ప్రారంభ చరిత్ర గురించి కీలకమైన అంతర్దృష్టులను అందిస్తాయి, కానీ అవి వేర్వేరు కాలాలు, వేర్వేరు జీవ పరిణామ రకాలను సూచిస్తాయి. సల్ఖాన్ పురాతన సూక్ష్మజీవుల ప్రపంచంలోకి, వాతావరణ ఆక్సిజన్ సంతృప్తతకు దారితీసిన పరిస్థితులలోకి ఒక మార్గాన్ని అందిస్తుంది. మిస్టేకెన్ పాయింట్ అనేది కేంబ్రియన్ విస్ఫోటనానికి ముందు సంక్లిష్టమైన, బహుళ సెల్యులార్ జీవుల ఆవిర్భావాన్ని గురించి తెలియజేస్తుంది. రెండు ప్రదేశాలు కూడా భూమి యొక్క జీవ, భౌగోళిక చరిత్రను అర్థం చేసుకోవడానికి అమూల్యమైనవి, అదే సమయంలో అవి జీవ పరిణామంలో వివిధ దశలను ప్రముఖంగా చాటిచెబుతాయి.

జోగ్గిన్స్ ఫాసిల్ క్లిఫ్స్ దాదాపు 310 మిలియన్ సంవత్సరాల క్రితం కార్బోనిఫెరస్ కాలం నుండి ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యమైన ప్రదేశం. భూమిపై బొగ్గు-ఏర్పడే అడవులు వాటి గరిష్ట స్థాయిలో ఉన్న సమయం నాటి అసాధారణమైన జీవుల వివరాలను ఈ ఫాసిల్ క్లిఫ్స్ సంరక్షిస్తాయి. ప్రారంభ టెట్రాపోడ్ శిలాజాలతో “శిలాజ అడవులు”గా పేరొందిన ఈ ప్రదేశం, భూమిపై నివసించే సకశేరుకాల పరిణామం, ఆ కాలంలో ఉనికిలో ఉన్న పర్యావరణ వ్యవస్థల గురించి ప్రత్యేకమైన వివరాలను అందిస్తుంది.
సల్ఖాన్ శిలాజ పార్క్, జాగ్గిన్స్ ఫాసిల్ క్లిఫ్స్ రెండూ వాటి శిలాజ రికార్డులకు ముఖ్యమైనవే. అవి భూమి చరిత్రలోని వేర్వేరు కాలాలను సూచిస్తాయి. జీవుల పరిణామంలోని వివిధ దశల గురించి అంతర్దృష్టులను అందిస్తాయి. సల్ఖాన్‌లోని శిలాజాలు కొన్ని ప్రారంభ, సరళమైన జీవుల రూపాలను సూచిస్తాయి. జోగ్గిన్స్ ప్రారంభ సరీసృపాలు, ఉభయచరాలు, వివిధ రకాల వృక్ష జాతులతో సహా మరింత అధునాతన జీవ రూపాల గొప్ప రికార్డును అందిస్తుంది. జల వాతావరణాల నుండి భూసంబంధమైన వాతావరణాలకు జీవం మారడాన్ని అధ్యయనం చేయడానికి జోగ్గిన్స్ సైట్ చాలా ముఖ్యమైనది.

‘జెనిసిస్ ఆఫ్ లైఫ్’ ప్రాంతం అని కూడా పిలువబడే బార్బర్టన్ మఖోంజ్వా పర్వతాలు భూమిపై ఉన్న పురాతన భౌగోళిక నిర్మాణాలలో ఒకటిగా చెప్పవచ్చు. 3.6 బిలియన్ సంవత్సరాల నాటి శిలలు ఇక్కడ ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉత్తమంగా సంరక్షించబడిన పురాతన శిలలు కొన్ని ఉన్నాయి. ఇవి ప్రారంభ భూమి క్రస్ట్ నిర్మాణం, టెక్టోనిక్ ప్రక్రియలు, తొలి జీవుల రూపాలు ఉద్భవించిన పరిస్థితులను తెలుసుకునేం దుకు ఒక ప్రత్యేకమైన మార్గాన్ని అందిస్తాయి. ఈ ప్రాంతం పురాతన మైక్రోబియల్ మాట్స్, స్ట్రోమాటోలైట్‌లతో సహా భూమిపై జీవం పురాతన ఆధారాలకు నిలయంగా ఉంది.
సల్ఖాన్ శిలాజ ఉద్యానవనం, బార్బెర్టన్ మఖోంజ్వా పర్వతాలు రెండూ భూమిపై జీవం ప్రారంభ చరిత్ర గురించి అంతర్దృష్టులను అందిస్తాయి. సల్ఖాన్ శిలాజ ఉద్యానవనం దాని ప్రొటెరోజోయిక్ స్ట్రోమాటోలైట్‌లకు ముఖ్య మైనది. ఇది పురాతన సైనోబాక్టీరియా ద్వారా ఏర్పడింది. ఇది భూమి వాతావరణాన్ని ఆక్సిజన్‌తో నింప డంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. తద్వారా ప్రారంభ సూక్ష్మజీవుల జీవితం, గ్రహాన్ని ఆకృతి చేసిన వాతా వరణ మార్పుల గురించి సమాచారాన్ని అందిస్తుంది. మరోవైపు, బార్బెర్టన్ మఖోంజ్వా పర్వతాలు భూమిపై జీవం గురించి కొన్ని పురాతన శిలలు, ఆధారాలతో మునుపటి కాలంలోని వివరాలను అందిస్తాయి. ఇది గ్రహం నిర్మాణం, జీవం మూలాలను అర్థం చేసుకోవడానికి కీలకమైన ప్రదేశంగా మారుతుంది.

ఈ ఐకానిక్ సైట్ అసాధారణమైన కేంబ్రియన్ శిలాజాలను సంరక్షిస్తుంది. ఇది “కేంబ్రియన్ విస్ఫోటనం” సమయంలో జంతు జీవితంలో వేగవంతమైన వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది. బర్గెస్ షేల్ భూమి చరిత్రలో తరువాతి కాలపు స్నాప్‌షాట్‌ను అందించినప్పటికీ, సంక్లిష్ట జీవుల తదుపరి పరిణామాన్ని వివరించడం ద్వారా ఇది సల్ఖాన్ శిలాజ రికార్డుకు పూరకంగా ఉంటుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *