వజ్రాలు కాని వజ్రాలు

(గత సంచిక తరువాయి)
HPHT వజ్రాలు:
1954 లో జనరల్‍ ఎలక్ట్రిక్‍ (GE)కి చెందినTracy Hall అనే శాస్త్రవేత్త అధిక పీడనం,(10 GPA)అధిక ఉష్ణోగ్రత (2000 డిగ్రీల సెల్సియస్‍) వద్ద గ్రాఫైట్‍ ను కరిగించి ఒక చిన్న 0.15 మి.మీల వజ్రాన్ని తయారు చేసినట్లు సమాచారం. 1970 నుండి రత్నాల గ్రేడ్‍ వజ్రాలను ఈ పద్ధతిలో తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పక్రియను ఆధునీకరించి 25 కారట్ల పరిమాణంలో కూడా HPHT వజ్రాలను తయారు చేస్తున్నారు. డీబీర్స్ వారు కృత్రిమ వజ్రాల పరిశోధనలో ముందంజలో ఉన్నారు.ప్రస్తుతం గ్రాఫైట్‍ స్థానంలో డైమండ్‍ గ్రిట్‍ వాడుతున్నట్లు సమాచారం.

CVD వజ్రాలు:
సివీడీ (CVD) కార్బన్‍ వేపర్‍ డిపాజిషన్‍ పక్రియ ద్వారా వజ్రాలు తయారు చేయటం 1950 నుండి ప్రారంభం అయింది. అయితే పూర్తి స్థాయిలో 1970లో 1980లో తక్కువ ఖర్చుతో డైమండ్‍ కాని ఉపరితలం పైన కూడా డైమండ్‍ కోటింగ్‍ చేయగలిగిన పరిస్థితికి వచ్చింది. మొదట హైడ్రోకార్బన్‍ గ్యాస్‍ ను పైరోలిసిస్‍ పక్రియ ద్వారా 800 సెంటీగ్రేడ్‍ ఉష్ణోగ్రత వద్ద ఒక పలుచని డైమండ్‍ పొర పైన పరుచుకుని ఎదిగేలా చేశారు. అందుకే దీనిని Chemichal Vapour Deposition, CVD పక్రియ అన్నారు. Willium G Eversole దీనికి ఆద్యుడు అనవచ్చు.
2013 నుంచి పెద్ద ఎత్తున ఈ CVD వజ్రాలు ముఖ్యంగా మెలే వజ్రాలను (చిన్న పరిమాణంలో ఉండే వజ్రాలు) తయారు చేస్తున్నట్లు సమాచారం. ఈ CVD పక్రియ సులభతరమైనది తక్కువ ఉష్ణోగ్రత, పీడనం వద్ద సాధ్యం కావటం వల్ల రోజు రోజుకు ఎన్నో మార్పులు వస్తున్నాయి. రానురానుCVDవజ్రాలు తక్కువ ఖర్చుతో, అతి సూక్ష్మ వజ్రాలను ఆల్ట్రాసౌండ్‍ కావిటేషన్‍ అనే పక్రియ ద్వారా కూడా తయారు చేస్తున్నారు. ఇక్కడ వాతావరణ ఉష్ణోగ్రత, పీడనం వద్ద గ్రాఫైట్‍ను సేంద్రియ ద్రవంలో డైమండ్‍గా తయారు చేయవచ్చు. ఈ పద్ధతి ఇంకా పరిశోధన స్థాయిలోనే ఉంది. 2024 నుంచి లిక్విడ్‍ మెటల్‍లో స్పటికీకరణ(Crystalyzation inside liquid metal) అనే పక్రియకు శాస్త్రజ్ఞులు పదును పెడుతున్నారు.

ద్రవరూపంలో ఉండే లోహ మిశ్రమంలోకి మిధేన్‍, హైడ్రోజన్‍ వాయువులను పంపించడం ద్వారా డైమండ్‍ తయారు చేసే పక్రియకు శాస్త్రజ్ఞులు పదును పెడుతున్నారు. దీనికి ఎక్కువ ఉష్ణోగ్రత పీడనం అవసరం లేదు. 150 నిమిషాలో డైమండ్‍ తయారు అవుతుంది.
ఈ విధంగా అనేక ఇతర రకాల క•త్రిమ పద్ధతుల్లో వజ్రాలు తయారీ విధానాలు అందుబాటులోకి వచ్చి వజ్రపరిశ్రమలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి.
HPHT రంగు మార్పిడి పక్రియ:
HPHT పద్దతి ద్వారా ‘‘వజ్రవిత్తనం’’ పైన కృత్రిమ వజ్రాలు ఉత్పత్తి చేయడం కాకుండా, సహజ వజ్రాల రంగు HPHTపక్రియ ద్వారా ఇనుమడింప చేయవచ్చు. ముఖ్యంగా గోధుమరంగు వజ్రాలను పసుపుపచ్చ, లేదా ఆకుపచ్చ రంగులోకి మార్చవచ్చు. ఇక్కడ వజ్రాలు సహజమైనవే కాని వాటి రంగు కృత్రిమంగా మార్పు చేయబడింది అని గుర్తించాలి. GIA వారు రిపోర్ట్ లో ఈ విషయం పొందుపరుస్తారు. ఇలా మార్పులకు గురి అయిన వజ్రాలు మార్కెట్‍ లో విలువ తక్కువగా ఉంటాయి.

కృత్రిమ వజ్రాలను గుర్తించడం ఎలా?
కృత్రిమ వజ్రాలు సహజ వజ్రాలు దాదాపు ఒకే భౌతిక, రసాయనిక లక్షణాలు కలిగి ఉండటం వల్ల వీటిని గుర్తించటం చాలా కష్టతరం.
GIA వంటి సంస్థలు సహజ వజ్రాలకు సర్టిఫికెట్‍ జారీ చేస్తారు. కృత్రిమ వజ్రాల పరీక్ష విషయంలో GIAఇటీవల ఒక నిర్ణయాన్ని ప్రకటించింది. ఇక పైన సహజ సిద్ధమైన వజ్రాలకు వాడే 4C టెర్మినాలజీ కృత్రిమ వజ్రాలకు వాడకుండా వాటికోసం ప్రత్యేక పదాలతో కూడిన ఒక విధానం అనుసరించాలని GIAభావిస్తోంది. టామ్‍ మోసెస్‍ అనే GIA అధికారి ప్రకారం, మార్కెట్లో దొరికే కృత్రిమ వజ్రాలు ప్రీమియం మరియు స్టాండర్డ్ అనే రెండు శ్రేణులుగా లభిస్తున్నాయి. 4C టెర్మినాలజీ ఒకదాని నుండి ఇంకొక శ్రేణిలోకి నిరంతరం మారుతూ ఉండే సహజ వజ్రాలు కోసం రూపొందించిన ప్రణాళిక. దీనిని కృత్రిమ వజ్రాలకు వర్తింప చేయటం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
కృత్రిమవజ్రాలు CVD ఘనాకారంలో (Cubic) మరియు HPHT వజ్రాలు ‘‘ఘన అష్టభుజి’’ (క్యూబుక్టోహెడ్రాన్‍) రూపంలో
ఉంటాయి. కృత్రిమ వజ్రాలలో నైట్రోజన్‍ ఉండదు. కృత్రిమ వజ్రాలు అల్ట్రా వాయలెట్‍ షార్ట్ వేవ్‍ పై ఫ్లోరోసెంట్‍/ ఫాస్పరసెంట్‍గా
ఉంటాయి. సహజ వజ్రాలు కొన్ని లాంగ్‍ వేవ్‍ పై ఫ్లోరోసెంట్‍గా ఉండవచ్చు. ఇప్పుడు CVD excluder పరికరాలు మార్కెట్‍లో ఉన్నాయి. కృత్రిమ వజ్రాల గర్డిల్‍ పైన L.C అని ఉంటుంది. సర్టిఫికెట్‍లో కూడా స్పష్టంగా ఈ విషయం పొందుపరుస్తారు.సహజ వజ్రాలు అనేక రకాల సహజంగా ఏర్పడిన దోషాలు, కల్మషాలు మొదలైనవి కలిగి ఉంటాయి. వీటిని జాగ్రత్తగా పరిశీలిస్తే కృత్రిమ వజ్రాల నుండి వేరుగా గుర్తించడం సాధ్యం అవుతుంది.

లాన్స్డలైట్‍ (Lonsdaleite):
లాన్స్డలైట్‍ అనేది షట్కోణ స్ఫటిక నిర్మాణం కలిగిన కార్బన్‍ యొక్క అలోట్రోప్‍. కొన్నిసార్లు దీనిని ‘‘షడ్భుజవజ్రం’’ అని కూడా పిలుస్తారు. కాని ఈ లాన్స్డలైట్‍ సహజరూపంలో ‘‘సబ్‍మైక్రో స్కోపిక్‍’’ గా చాలా అరుదుగా లభిస్తుంది. ఈ మారుపేరు తప్పుదారి పట్టించేది మరియు సాంకేతికంగా అసంబద్ధంగా ఉంది. లాన్స్డలైట్‍ కొన్ని రకాల ఉల్కలు మరియు యూరిలైట్ల (Ureilites) లో చాలా అరుదుగా కనిపిస్తుంది.
ఇప్పుడు మార్కెట్లో చాలా సులభంగా దొరికే తెల్లని బంతుల వంటి వస్తువులు లాన్స్డలైట్‍ కానే కాదని అవి ‘‘క్లే బాల్స్’’ మాత్రమే అని నిపుణులు అంటున్నారు. ఇలాంటివి కొనేటప్పుడు నిపుణుల అభిప్రాయం తెలుసుకుంటే మంచిది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *