ఉమ్మడి విజయనగరం జిల్లా ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్నది. ఈ జిల్లాకు వాయువ్యంలో ఒడిస్సా రాష్ట్రం, తూర్పులో శ్రీకాకుళం జిల్లా మరియు దక్షిణంలో విశాఖపట్నం జిల్లా కలదు.
ఈ జిల్లాలోని శిలలు ఆర్కవ్న్ పీరియడ్‍కు చెందిన ఈస్ట్రన్ ఘాట్ యొక్క కొండలైట్, చార్నొకైట్, మిగ్మ్టైట్ గ్రూప్‍లోని శిలలుగా నిర్ధారించబడినవి. వీటి పైన, అప్సర్‍గోండ్‍వానా, లాటరైట్ మరియు క్వాటర్‍నెరీకి చెందిన సేడిమెంట్స్ మరియు శిలలు కలవు. కొండలైట్ గ్రూప్‍లో క్వార్ట్జైట్, కాల్క్గ్రానులైట్, కాల్క్ సిలికేట్‍శిల, క్రిస్ట్లైన్‍లైమ్ స్టోన్, క్వార్టజోఫెల్స్ పాతిక్ నైస్, ఆగన్ నైస్, కార్డియే రైట్ నైస్, గ్రానిటాయిడ్ నైస్. ఈ శాన్య ప్రాంతంలో వీటిలో పెగ్మటైట్ వీన్స్ని చూడగలము. గోండ్‍వానాసాండ్‍స్టోన్‍ని కోస్తాప్రాంతంలో చూడగలము. వీటిలో ప్లాంట్ ఫాసిల్స్ని చూడగలము. కొండలైట్ శిలలపైన లాటరైట్ క్యాపింగ్స్ కలవు. క్వార్టర్ నెరి సెడిమెంట్స్ని నదులకు ఇరు ప్రక్కల మరియు కోస్తా ప్రాంతాలో చూడగలము. ఈ ప్రాంతంలోని నదులు గోస్తని, చంపావతి, కందివలస, వేదావతి, సువర్ణముఖి మరియు నాగావల్లి వీటి ఫ్లడ్ ప్లేన్ సెడిమెంట్స్ పుష్కలంగా ఉన్నవి. కోస్తాప్రాంతంలో బీచ్ మరియు డ్యూన్‍సాండ్స్ కలవు.
ఈ ప్రాంతంలో ఉత్తరాన అడవి, చీపురుపల్లికి పశ్చిమంలో గ్రాస్‍లాండ్స్ మరియు ఎక్కువ ప్రాంతం వ్యవసాయనికి ఉపయోగ పడేదిగా ఉన్నది. ఈ జిల్లాలో ఐదురకాల సాయిల్స్ కలవు. అది రెడ్ సాండిసాయిల్, రెడ్‍లోమిసాయిల్, లేటరైట్ సాయిల్, డెల్టాయిక్ సాయిల్, కోస్ట్ల్ సాండీపాయిల్. సీస్‍మో టెక్టానిక్ స్టడీ ప్రకారం ఈ ప్రాంతాన్ని జోన్-ఱ మరియు జోన్-ఱఱలో ఉన్నట్టు నిర్ధారించారు.
ఖనిజసంపద:
ఈ జిల్లాలో ఖనిజసంపద పుష్కలంగా ఉన్నవి. అవి మాంగనీస్, గ్రాఫైట్, క్లే, సిల్లిమనైట్ మైకా, ఐరన్ ఓర్, అపటైట్ మరియు కంకర్.
మాంగనీస్:
ఈ ఖనిజం యొక్క బెల్ట్ గర్విడి, గర్భం, పెరుమల్లి, చీపురుపల్లి, సాలుర్ ప్రాంతాలలో 60 కిలోమీటర్ల పొడువు మరియు 20 కిలోమీటర్ల వెడల్పు కలిగియున్నది. ఈ ఖనిజం కాల్క్ గ్రానులైట్ మరియు క్వార్ట్జైట్ శిలల్లో ఉంటుంది. దీనిలో ఎక్కువ శాతం ఐరన్ మరియు ఫాస్పరస్ ఉంటుంది. గర్భం బ్లాక్‍లో ఓర్‍బాడి 1900 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పు మరియు 25 నుండి 30 శాతం మాంగనీస్ ఉంటుంది. గర్విడి బ్లాక్‍లో ఓర్ బాడి 2650 మీటర్ల పొడవు, 3-10 మీటర్ల వెడల్పు మరియు 20 నుంచి 35 శాతం మాంగనీస్ ఉంటుంది.
గ్రాఫైట్:
ఈ ఖనిజం యొక్క డిసెమినేశన్స్ కొండలైట్ శిలలో దక్షిణం మరియు వాయువ్యంలో ఉన్నది. సామన్యంగా వీటి డిసెమినేశన్స్ ఫేక్స్ మరియు పాకెట్స్ రూపంలో పాలూరు, లకింపూర్ ప్రాంతాలలో దొరుకుతుంది. గ్రాఫైట్ సామాన్యంగా మీడియం గ్రేడ్‍గా 10-30 శాతం, కార్బన్‍తో కూడి వుంటుంది. ఇది కొండలైట్ శిలలో శివలింగాపురం, తుమ్మరవల్లి, మారుపల్లి, బుద్రాయ వలస కొండ మోసురు, డొలెంబా ప్రాంతాలలో దొరుకుతుంది.
మైకా:
పెగ్మటైట్ వీన్స్లో మస్కోవైట్ రూపంలో ఈ ఖనిజం డొలెంబా, కురుపం ప్రాంతాలలో చూడగలము. పైరాక్సినైట్‍లో ఉన్న కార్పొనేట్ వీన్స్లో ఫ్లాగొఫైట్‍మైకా పాకెట్స్ రూపంలో కొసిగూడ ప్రాంతంలో చూడగలము.
క్లేనిక్షేపాలు:
ఒక మోస్తరి ప్లాస్టిక్, సిల్టీక్లే ట్యాంక్‍బెడ్స్లో దొరుకుతుంది. దీనిని టైల్స్ మరియు డ్రేనేజ్‍పైప్స్ మ్యానుఫాక్చరింగ్‍లో
ఉపయోగిస్తారు. విజయనగరం నుండి దెనికడ్ వెల్లెదారిలో ఉన్న జముననారాయనపురం వద్ద ఓక టైల్స్ ఫాక్ట్రీ ఉన్నది.
క్వార్ట్జైట్:
కొన్ని ప్రాంతాలలో కొండలైట్‍లో బ్యాండ్స్ రూపంలో ఈ క్వార్ట్జైట్‍ఏ ఇంప్యురిటీస్ లేకుండా ఉన్నవి పొరాలి ప్రాంతంలో ఉన్నది. వీటిని ఫెర్రోసిలికాన్ మ్యానుఫాక్చరింగ్‍లో ఉపయోగిస్తారు.
మొలిబ్‍డీ నైట్:
వీటి స్ట్రీక్స్, స్ట్రింజర్స్ కోటగండేడు ప్రాంతంలో పైరాక్సినైట్‍లో ఉన్న క్వార్ట్జో ఫెల్స్ పాతిక్ వీన్స్లో చూడగలము.
సిల్లిమనైట్:
సిల్లిమనైట్ కొండలైట్‍లో బండిల్స్, శ్రెడ్స్ రూపంలో విజయనగరంకు దక్షిణంలో మరియు పెద్దారవ్వం ప్రాంతాలలో కలదు.
అపటైట్:
ఈ జిల్లాలో కాశీపట్నంకి ఉత్తర ప్రాంతంలో ఉంటుంది. ఇది ఒక మినరల్ బెల్ట్ విజయనగరం మరియు విశాఖపట్నం జిల్లాలో విస్తరించి యున్నది. ఈ ఖనిజం ఈస్ట్రన్ ఘాట్ సూపర్‍గ్రూప్ శిలలో ఉన్న అపటైట్-వర్మిక్యులైట్-మాగ్నటైట్ వీన్స్లో ఉంటుంది. ముఖ్యంగా ఫ్రాక్చర్ ఫిల్లింగ్స్ రూపంలో చార్నొకైట్ మరియు కొండలైట్ కాంటాక్ట్ వద్ద ఉన్నవి. దాదాపు 110 వీన్స్ని రికార్డ్ చేసారు జి.ఎస్.ఐ. అందులో 30 వీన్స్ని ఎకనామికల్ అని నిర్దారించారు. అవి సీతారామపురం, రేగువలస, బుడి మరియు సీతంపేట వద్ద వున్నది. ఈ వీన్స్ NNW-WWE మరియు NW-SE దిశలలో ఉన్నవి. వీటి పొడవు కొన్ని మీటర్ల నుండి 600 మీటర్ల వరకు ఉంటవి. వీటి విడ్త్ కొన్ని సెంటిమీటర్ల నుండి 2.5 మీటర్ల వరకు కలదు. వీటి రిజర్వు 0.299 మిలియన్ టన్నులగా నిర్దారించారు. వీటిలో 35 నుండి 42.5 శాతం P2O5 ఉంటుంది.
టైటానియం: ఈ ఖనిజం కోస్తాప్రాంతంలో కోనాడవద్ద బీచ్ సాండ్‍లో ప్లేసర్ డిపాజిట్ రూపంలో దొరుకుతుంది. ఇందులో టైటానియం ఇల్మనైట్ మరియు రూటైల్ ఖనిజాలలో ఉంటుంది.
- కమతం మహేందర్ రెడ్డి
 ఎ :91 90320 12955
 
														