చరిత్రలో చందుపట్ల – విద్దేశ్వరాలయం
కళ్యాణీచాళుక్యులు కొలనుపాక(ఉప)రాజధానిగా క్రీ.శ.973 నుండి రెండవతైలపుని నుండి క్రీ.శ.1156 రెండవ జగదేకమల్లుని వరకు పరిపాలించారు. ఆ తర్వాత కూడా కళ్యాణీచాళుక్యులు కొంతకాలం పాలకులుగా వున్నప్పటికీ అది గణనీయం కాదు. కళ్యాణీచాళుక్య చక్రవర్తి త్రిభువనమల్లుడు(1076-1126) భువనగిరిపై గొప్పదుర్గాన్ని నిర్మింపజేసాడు. అతని తర్వాత కుమారసోమేశ్వరుడు లేదా భూలోకమల్లుడు(1126-1138), రెండవ జగదేకమల్లుడు (1138-1156) చక్రవర్తులైనారు. భువనగిరిలో త్రిభువనమల్లుని కాలంలో మహాప్రధాన, దండనాయకులుగా తొలుత మల్లచమూపతి తర్వాత అతని సోదరుడు విద్ధమయ్య భువనగిరి దుర్గాధిపతులైనారు. విద్ధమయ్య లేదా విద్ధమరసరు భువనగిరికి సమీపంలోని చందుపట్ల …






