ఉమ్మడి ప్రకాశం జిల్లాశిలా మరియు ఖనిజ సంపద

ఉమ్మడి ప్రకాశం జిల్లా 20,250 చదరపు కిలోమీటర్లలో విస్తరించి యున్నది. ఈ జిల్లాకి ఉత్తరంలో గుంటూరు జిల్లా, పశ్చిమంలో కర్నూలు జిల్లా, నెల్లూరు, కడప జిల్లాలు, దక్షిణంలో మరియు వాయువ్యంలో మహబూబ్‍నగర్‍ జిల్లా కలదు. ఈ జిల్లాలోని ప్రముఖమైన పట్టణాలు ఒంగోలు, అద్దంకి, పొదిలి, కనిగిరి, మార్కాపూర్‍. కోల్‍కత్తా-చెన్నై రహదారి ఈ ప్రాంతంగుండా వెళ్తుంది. ఈ నగరాలను కలిపే బ్రాడ్‍ గేజ్‍ రైల్వే లైన్‍ ఈ ప్రాంతం నుండి వెళ్తుంది.
ఈ జిల్లా యొక్క పశ్చిమ ప్రాంతంలో NNE-SSW దిశలో ఉన్న స్ట్రక్చరల్‍ రిడ్జెస్‍ని చూడగలము. ఇవి 842 మీ ఎత్తు వరకు వున్నవి. ఈశ్వరకుప్పం కొండ వాయువ్యంలో వున్నది. ఇది అతి పెద్ద ఎత్తుగల కొండ, ఇది 901 మీ ఎత్తు కలదు. ఇది ఓక స్ట్రక్చరల్‍ డోమ్‍. దీనిలో ఉన్న శిల బైరన్‍ కొండఫార్మేశన్‍కు చెందిన క్వార్ట్జైట్‍. ఈ జిల్లా యొక్క తూర్పు ప్రాంతం ప్లేన్‍ లాండ్‍లో అక్కడక్కడ కొండలు, చిన్న పాటి గుట్టలు కలవు. ఇందులో కొన్ని ప్రముఖమైనవి నిశాన్‍ కొండ (665 మీ), చీమకుర్తి (658మీ). దీనిని ఆనుకొని అలూవియల్‍ ప్లేన్‍ అనగా గుండ్లకమ్మ, మూసి నదుల ఫ్లడ్‍ప్లేన్‍ సెడిమెంట్స్ మరియు ఒంగోలు వద్ద బీచ్‍ సెడిమెంట్స్ కలవు.

ఈ ప్రాంతంలో ఈస్ట్రన్‍ ఘాట్‍ యొక్క కొండలైట్‍ చార్నోకైట్‍ గ్రూప్‍లకు చెందిన శిలలు అనగా గార్నెట్‍ – సిల్లి మనైట్‍ నైస్‍, క్వార్ట్జైట్‍, హైపర్‍స్టీన్‍ నైస్‍, పైరాక్సీనైట్‍లని, మాగ్నటైట్‍ క్వార్టజైట్‍ వీటిని పొదలి వద్ద చూడగలము. మిగ్నటైసడ్‍ క్వార్ట్జ్‍ మైకా శిస్ట్తో పాటు ఆంఫిబొలైట్‍ తూర్పు మరియు ఆగ్నేయంలో చూడగలము. దక్షిణ మధ్య ప్రాంతాలలో శిలలు చాలా వరకు మిగ్మటైస్‍ అవ్వబడినవి. దక్షిణ-మధ్య ప్రాంతంలో కయనైట్‍ స్టారోలైట్‍ బయోటైట్‍ మస్కోవైట్‍ శిస్ట్తో పాటు అన్‍క్లాసిఫైడ్‍ మెటమార్ఫిక్స్ యొక్క పార్ఫిరో బ్లాస్ట్స్‍ని చూడగలము. వీటితో ఫెర్చుజినస్‍ క్వార్ట్జైట్‍ మరియు క్రిస్ట్లైన్‍ లైమ్‍స్టోన్‍లను దక్షిణ-మధ్య ప్రాంతంలో చూడవచ్చును.

ధార్‍వార్‍ సూపర్‍గ్రూప్‍కు చెందిన క్వార్ట్జ్‍ క్లోరైట్‍-సెరిసైట్‍ శిస్ట్తో కూడిన క్వార్ట్జైట్‍ కడప బేసిన్‍ యొక్క త్రస్‍లెడ్‍ కాంటాక్ట్కి తూర్పులో ఉన్నవి.
ఈ ప్రాంతంలో పలు ఇగ్నియస్‍ ఇంట్రూశన్స్ని చూడగలము. ఇవి చాలా వరకు EGMB మరియు ధార్‍వేర్‍ క్రేటాన్‍ యొక్క కాంటాక్ట్ జోన్‍లో కలవు. ఇవి ఆల్‍కలి గ్రానైట్స్, నెఫిలిన్‍ సయనైట్స్, హార్న్బ్లెండ్‍ సైనైట్స్, వీటి యొక్క అవుట్‍క్రాప్స్ని కనిగిరి, పొదిలి, అద్దంకి, దర్సి ప్రాంతాలలో చూడగలము. చీమకుర్తి కాంప్లెక్స్కు చెందిన నొరైట్‍-గ్యాబ్రోతోపాటు చిన్న మొత్తంలో అనార్తోసైట్‍, పెరాక్సినైట్‍లని కూడా ఈ ప్రాంతాలలో చూడగలము. వాటి మార్జిన్స్లో ఫెయలైట్‍-క్వార్ట్జ్‍ మాన్‍జోనైట్‍ పొదలలివద్ద చూడగలము.
పురిమెట్ల వద్ద లాంఫ్రోఫైర్‍ డైక్‍ని చూడగలము. పశ్చిమ ప్రాంతంలో కడప బేసిన్‍ యొక్క నల్లమలై గ్రూప్‍కు చెందిన బైరన్‍ కొండ ఫార్మేశన్‍, కంభం ఫార్మేశన్‍, శ్రీశైలం క్వార్ట్జైట్‍లు కలవు. బైరవకొండ ఫార్మేశన్‍లో క్వార్ట్జైట్‍తో పాటు స్లైట్‍ కలదు. కంభం ఫార్మేశన్‍లో చాలా వరకు శేల్‍, ఫిలైట్‍ శిలలు కలవు. దోమల వద్ద క్వార్ట్జైట్‍తో కూడిన ఈశ్వర కుప్పం డొమ్‍ కలదు. నల్లమలై గ్రూప్‍శాలలపైన అన్‍కస్‍ఫర్మెబుల్‍గా శ్రీశైలం క్వార్ట్జైట్‍ ఉంటుంది. ఇది ఓకప్లాటూ రూపంలో ఉంటుంది. కర్నూలు గ్రూప్‍కు చెందిన శిలలు ముఖ్యంగా బనగానపల్లి క్వార్ట్జైట్‍, నార్జిలైమ్‍స్టోన్‍లపైన అన్‍కన్‍ఫర్మబుల్‍గా శ్రీశైలం క్వార్ట్జైట్‍ కలదు. బేసల్‍ బనగానపల్లి క్వార్ట్జైట్‍తోపాటు సన్నటి కంగ్లామరేట్‍ ఉంటుంది. ఇది డైమండిఫెర్రస్‍గా నిర్ధారించబడినది. దీనిని ఆగ్నేయంలో కృష్ణానదికి సమీపంలో చూడగలము.

నార్జిలైమ్‍స్టోన్‍ బనగానపల్లి క్వార్ట్జైట్‍పైన ఉంటుంది. మరియు ఇది ప్లాగీ, మాసివ్‍గా ఉంటుంది. అప్పర్‍ గోండవానా శిలలు లోవర్‍ క్రిటేశియస్‍ పీరియడ్‍కు చెందినవి. ఇవి ఆర్క్యన్‍ శిలలపైన అన్‍కన్‍ఫర్మెబుల్‍గా ఉంటవి. వీటిని ఇడుపులపాడు, పూనూరు, బుదవాడ, పావలూరు, వేమవరం, ఉప్పు గుండూరు, కందుకూరు ప్రాంతాలలో చూడవచ్చును. ఈఫార్మేశన్స్లో చాలా వరకు సాండ్‍స్టోన్‍లో శేల్‍ ఇంటర్‍కెలేశన్స్తో కూడి వుంటుంది. ఈ గోండ్‍వానా శిలలపైన పలు ప్రాంతాలలో లాటరైట్‍ క్యాపింగ్స్ 17 M. నుండి 37 M ఎత్తులో M.S.I పైన ఉన్నవి.

కోస్తా ప్రాంతంలో మరియు గుండ్లకమ్మ, మూసి నదులకు ఇరు ప్రక్కల క్వాటర్‍నెరిసెడిమెంట్స్ కలవు. ఇవి ఫ్లూవియల్‍ మరియు మెరైన్‍ సెడిమెంట్స్గా గుర్తించారు. గుండ్లకమ్మ నది యొక్క ఫ్లడ్‍ప్లేన్‍లో వాల్‍కానిక్‍ యాష్‍ని తోబా వాల్కా నిజంతో కొరిలేట్‍ చేయబడినది. ఈ బేసిన్‍లో పలు ఫాసిల్స్ని కనుగొన్నారు. అవి బొవాయిడ్‍ సర్విడ్స్, ఇక్వస్‍ ఎలిఫస్‍ మొలర్స్, ప్రీ మొలర్స్, స్టాగ్‍ యొక్క హార్న్, టర్టుల్‍ యొక్క షెల్‍.
ఈ జిల్లాలో రెడ్‍సాండీసాయిల్‍ మధ్య ప్రాంతంలో, మిక్స్డ్‍ రెడ్‍ మరియు బ్లాక్‍ సాయిల్‍ పశ్చిమంలో, లాటరైటిక్‍ సాయిల్‍ కందుకూరు ప్రాంతంలో, డెల్టాయికి అల్లూవియల్‍ సాయిల్‍ అద్దంకి పరిసరాలలో చూడగలము.

ఈ జిల్లా యొక్క పశ్చిమ ప్రాంతం అడవి ప్రాంతం. మధ్యప్రాంతం వ్యవసాయానికి పనికి వచ్చే ప్రాంతం. అక్కడక్కడా గ్రాస్‍ లాండ్స్ ఉన్నది. కోస్తా ప్రాంతం వ్యవసాయానికి చాలా మెరుగ్గా వున్నది. కారణం పుష్కలంగా నీటి వసతి మరియు సారవంతమైన సాయిల్‍ వల్ల ఈ జిల్లాలో గుండ్లకమ్మ మరియు మూసి నదుల మధ్య ఉన్న ప్రాంతం నియొటెక్టానిక్‍ యాక్టివిటికి ఆధారంగా పలు ఎపిసెంటర్స్ కలవు. ఈ ప్రాంతం సీస్మిక్‍ ఏక్టివిటికి గురైనట్టు ఆధారాలు ఉన్నవి. ఈ ప్రాంతాన్ని సీస్మొటెకానిక్‍ స్టడి ప్రకారం మూడు సీస్మిక్‍ జోన్స్గా నిర్ధారించారు. జోన్‍-1 (పశ్చిమంలో) జోన్‍-2 (మధ్యప్రాంతంలో) మరియు జోన్‍-3 (తూర్పు ప్రాంతం)

ఖనిజ సంపద:
ఈ జిల్లాలో ఖనిజ సంపద పుష్కలంగా ఉన్నది. మేజర్‍ మినరల్స్ మైనర్‍ మినరల్స్తో పాటు క్రిటికల్‍ మినరల్స్ కూడా దొరికే అవకాశమున్నది.
ఐరన్‍ ఓర్‍:
ఐరన్‍ ఓర్‍ మాగ్నటైట్‍ క్వార్ట్జైట్‍ రూపంలో పలు ప్రాంతాలలో కలదు. వీటి బ్యాండ్స్ ఈస్ట్రన్‍ ఘాట్‍కు చెందిన పై రాక్సిన్‍ గ్రాన్యులైట్స్లో ఉంటుంది. చెప్పుకోదగ్గ మాగ్నటైట్‍ క్వార్ట్జైట్‍ బ్యాండ్స్ ఒంగోలు, అద్దంకి ప్రాంతాలలో లోగ్రేడ్‍ ఓర్‍ దొరుకుతుంది. ఒంగోలు, కొనిజేడు, సోనంపూడి ప్రాంతాలలో 292 మిలియన్‍ టన్స్ ఓర్‍ 30 నుండి 37 శాతం ఐరన్‍ ఉంటుంది. అద్దంకి ప్రాంతంలో బైరపల్లి, ఎర్రపాలెం, తుమ్మవరం, మానికేశ్వరం డిపాజిట్స్లో 4 మిలియన్‍ టన్స్ ఉంటుంది.
డైమెన్‍శన్‍స్టోన్‍:
చాలా ప్రసిద్ధి చెందిన గ్యాలాక్సీ గ్రానైట్‍ అనగా బ్రాన్‍జైట్‍తో కూడిన గ్యాబ్రో చీమకుర్తి ప్రాంతలో కలదు. ఇది ఈ ప్రాంతంలో మాత్రమే కలదు. దేశంలో ఎక్కడా దొరకదు. దీనిని విస్త్రుతంగా మైనింగ్‍ చేస్తున్నారు. విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇది కాకుండా, బ్లాక్‍గ్రానైట్‍ (డొలరైట్‍) మరియు గ్రానైట్స్, సైనైట్స్ని కూడా మైనింగ్‍ చేస్తున్నారు.
స్లేట్‍:
మంచి క్వాలిటి స్లేట్‍ మార్కాపూర్‍ వద్ద మైన్‍ చేస్తున్నారు. ఇది 38 కిలోమీటర్ల పొడువు 3.2 కిలోమీటర్ల వెడల్పు కలిగి యున్నది. చిన్న ఓబోబాయనపల్లి నుండి మల్లపేట మధ్యలో కలదు.
క్లే నిక్షేపాలు:
ఈ జిల్లాలో క్లే నిక్షేపాలు పుష్కలంగా కలవు. ఇది ఎక్కువ శాతం మైకేశియస్‍ మరియు ప్లాస్టిక్‍ వెరైటీస్‍గా ఉన్నవి. వీటి నిక్షేపాలు కందుకూరు ప్రాంతంలో అప్పర్‍ గోండ్‍వానా ఫార్మేశన్స్తో అసోసియేట్‍ అయినవి.
కయనైట్‍:
ఈ కయనైట్‍ లేంటి కులర్‍ అగ్రిగేట్స్ రూపంలో క్వార్ట్జ్‍ వీన్స్లో చూడగలము. ఈ క్వార్ట్జ్‍ వీన్స్ కయనైట్‍ శిస్ట్లో చుండి ప్రాంతంలో 10 కిలోమీటర్ల పొడవు, 6 కిలోమీటర్ల వెడల్పుగల బెల్ట్లో కలవు.
మాంగనీస్‍:
మాంగనీస్‍ ఓర్‍ కంభంకి ఈశాన్యంలో మరియు బేసినపల్లికి ఈశాన్యంలో దొరుకుతుంది.

బెరైటీస్‍:
బెరైటీస్‍ బేసినపల్లికి 5 కిలోమీటర్ల దూరంలో ఉత్తరంలో కలదు. ఈబెరైట్‍తో పాటు గజ్జలకొండ ప్రాంతంలో చాల్కోపైరైట్‍, పైరైట్‍, మాలకైట్‍, అజురైట్‍ కుంభం ఫార్మేశన్‍ యొక్క క్లోరైట్‍ ఫిల్లైట్‍, డొలమైట్‍లో చూడగలము.
గ్రావెల్‍ నిక్షేపాలు:
సాగిలేరు వ్యాలీలో పుష్కలంగా గ్రావెల్‍ నిక్షేపాలు కలవు. వీటిలో ఓల్డ్ వర్కింగ్స్ ఉండటం విశేషం. ఈసర్ఫేస్‍ గ్రావెల్స్ గిద్దలూరు, పోరుమామిళ్ల మరియు కలసపాడు ప్రాంతాలలో 40 కిలోమీటర్లలో విస్తరించి యున్నది. ఈ గ్రావెల్స్ నల్లమలై కొండ ప్రాంతం నుండి వచ్చినట్టు నిర్ధారించారు. జి.ఎస్‍.ఐ. ఈ గ్రావెల్‍ సాంపుల్స్ని టెస్ట్ చేసి ఇవి డైమండి ఫెర్రస్‍ నేచర్‍ ఉన్న గ్రావెల్స్ అని నిర్ధారించారు.
ఫౌన్‍డ్రిసాండ్‍:
గ్రే, యెల్లో, బఫ్‍ కరడ్‍ సాండ్‍ కోస్తా ప్రాంతంలో గుంటూరు జిల్లాలోని బాపట్లకు ప్రకాశం జిల్లాలోని చిన్న గంజామ్‍ మధ్యలో 35 కిలోమీటర్ల పొడవు, 1 నుండి 2 కిలోమీటర్ల వెడల్పు గల ప్రాంతంలో విస్తరించి యున్నది. ఈ సాండ్‍ బెడ్స్ 2 నుండి 5 మీటర్ల తిక్‍నెస్‍తో 85 నుండి 90 శాతంSio2 తో కూడి యుంటుంది. ఇది ఫౌండ్రి సాండ్‍గా ఉపయోగిస్తారు.
క్వార్ట్జ్‍:
ఈ జిల్లాలో క్వార్ట్జ్‍ వీన్స్ / రీఫ్స్ పలు ప్రాంతాలలో కలవు. ఇవి చాలా మంచి క్వాలిటి క్వార్ట్జ్‍. ఇందులో 98 శాతం నుండి 99.7 శాతం వరకు Sio2 ఉంటుంది. దీనిని గ్లాస్‍ పరిశ్రమలో ఉపయోగిస్తారు. ఇందు హైక్వాలిటి క్వార్ట్జ్‍ అనగా 99.9 శాతం ఉన్న Sio2వాటిని ఎలక్ట్రికల్‍ కండక్టివిటి సరిపడా ఉన్నవాటిని ఎలక్ట్రానిక్‍ చిప్స్ మ్యానుఫాక్చరింగ్‍కు ఉపయోగిస్తారు. వీటి నిక్షేపాలు దర్శి, అద్దంకి, గిద్దలూరు, బొమ్మిరెడ్డిపల్లి, ఇడమకల్లు మరియు పలు ప్రాంతాలలో ఉననవి.

మినరల్‍ పిగ్‍మెంట్స్:
ఈ మినరల్‍ పిగ్‍మెంట్స్ సామాన్యంగా ఓకరస్‍ పదార్థాల నుండి తీయబడుతుంది. వీటిని, పేంట్‍, ప్లాస్టర్‍, మొరటార్‍ సిమెంట్‍, లినోలియం, రబ్బర్‍ పరిశ్రమలలో ఉపయోగిస్తారు. ఈ జిల్లాలో కుంభం ఫార్మేశన్‍లో డొలమైట్‍-శేల్‍ కాంటాక్ట్లో దొరుకుతుంది. వీటి నిక్షేపాలు చింతగింజలపాడు వద్ద 2000 టన్నుల రిజర్వు ఉన్నట్టు నిర్ధారించారు. జి.ఎన్‍.ఐ బోర్నాల, నల్లగొండ వద్ద చిన్న మెత్తంగా ఉన్నట్టు రిపోర్ట్ చేసారు.
మాలిబ్‍డినైట్‍ (MOS2):
ఇది మాలిబ్‍డినం యొక్క ముఖ్యమైన ఓర్‍. దీనిని స్టీల్‍, ఎలక్ట్రికల్‍ పరివ్రమలలో ఉపయోగిస్తారు. ఈ జిల్లాలో ఈ ఖనిజం స్టోరాడిక్‍గా E-W ట్రెండింగ్‍ క్వార్ట్జోఫెల్స్ పాతిక్‍ వీన్స్లో. ఈ వీన్స్ కనిగిరి గ్రానైట్‍లో ఇంట్రూసివ్స్గ టవి. ఇది సల్‍పైడ్స్తో పాటు దొరుకుతుంది. వీటి నిక్షేపాలు కనిగిరి, పొదిలి, దెవంగనగర్‍ ప్రాంతాలలో కలవు. వీటిలో మాలిబ్‍దినం వ్యాలూస్‍ 5.78 ppm నుండి 215 ppm వరకు ఉంటవి.
వల్కానిక్‍యాశ్‍:
ఈ వల్కానిక్‍యాశ్‍ గుండ్లకమ్మ నదిలో, టెర్రెసెస్‍లో చూడగలము. దీనిని సుమాత్ర దీవిలో జరిగిన వీల్‍కానిక్‍ ఎరప్‍శన్‍తో కొరిలేట్‍ చేశారు. దీనిని 75,000 సంవత్సరాల క్రిందట జరిగిన విస్పోటకానికి చెందినదిగా నిర్ధారించారు. దీనిని డిటర్జెంట్స్లో ఉపయోగిస్తున్నారు.

  • కమతం మహేందర్‍ రెడ్డి
    ఎ :91 90320 12955

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *