భారతదేశమంతటా గుప్త కాలపు ఆలయాలు అత్యంత తార్కికంగా రూపకల్పన చేయబడ్డ నిర్మాణాలు. వాటి శిల్ప రూపకల్పన బౌద్ధ మరియు హిందూ శైలుల అంశాలను కలిపి, గుప్త యుగపు సాంస్కృతిక మరియు మత సమ్మేళనాన్ని ప్రతిబింబిస్తుంది. శిల్పక లక్షణాల సృజనాత్మక సమన్వయం, అందులో సవివరమైన చెక్కింపులు మరియు అలంకరణా రూపకల్పనలు, ఆ కాలపు అద్భుతమైన శిల్పకళా నైపుణ్యాన్ని మరియు కళా ప్రావీణ్యాన్ని కనబరుస్తాయి. ఆలయాలు ప్రత్యేక నిర్మాణశైలితో ప్రశంసనీయం గాను, మత చిహ్నాల సమతౌల్యం, మెరుగైన రూపకల్పన మరియు సంక్లిష్టమైన శిల్ప కళాసౌందర్యం వాటి ప్రత్యేకత.

ఈ ఆలయాలు సాధారణంగా చతురస్ర గర్భగృహ పథకం, సమతల పైకప్పు, ప్రదక్షిణ మార్గం, మరియు తక్కువ ఎత్తు గల శిఖరంతో నిర్మించబడ్డాయి. ప్రధాన ద్వారాలు ఎక్కువగా T ఆకారంలో ఉండి, వాటిపై అలంకార బ్యాండ్లు, ద్వారపాలులు, గణులు, నది దేవతలు, సింహ శిరాలు, కమల ముకులు వంటి ప్రతిరూపాలు చెక్కబడి ఉండేవి.
గుప్త ఆలయాల వాటా ఎక్కువగా సూర్యరశ్మిలో ఎండబెట్టిన ఇటుకలు మరియు టెర్రకోటాతో నిర్మించబడ్డాయి. కొన్నింటికి సాండ్స్టోన్ వాడబడింది. ఉదయగిరి గుహలు రాయి చెక్కిన శిల్ప కళను అసాధారణ స్థాయిలో ప్రదర్శించే మినహాయింపు. ప్రణాళిక, శిల్ప స్తంభాలు, సవివరమైన చెక్కింపులు గుప్త యుగ శిల్పకారుల సృజనాత్మక మేధస్సును ప్రతిబింబిస్తాయి. సహజ రాయి రూపాన్ని సృజనాత్మకంగా ఉపయోగించి, కొన్ని అదనపు నిర్మాణాలతో కలిపి ఉపయోగకరమైన స్థలాలను సృష్టించారు.
చారిత్రక ప్రాముఖ్యత
గుప్త ఆలయాలు భారతీయ కళ, శిల్పకళ మరియు సంస్క•తికి సువర్ణయుగాన్ని ప్రతిబింబిస్తాయి. ఆలయాల శ్రేణి, దేవత గుహ (గర్భగ•హం), చిన్న మండపం, ముఖ మండపం వంటి భాగాల రూపకల్పన వికాసాన్ని చూపుతుంది. ఇవే తరువాత భారతీయ ఆలయ రూపకల్పనలో మూల సూత్రాలుగా మారాయి.
సాంచి ఆలయం నెం. 17: భారతదేశంలో స్వతంత్ర హిందూ ఆలయాల మొదటి ఉదాహరణల్లో ఒకటి. ఇది బౌద్ధ స్థూప నిర్మాణం నుండి దేవాలయ నిర్మాణాల దిశగా జరిగిన మార్పును సూచిస్తుంది. దీని ద్వారా గుప్త యుగంలో సాంస్కృతిక, మత, కళాత్మక పరిణామాలను అర్థం చేసుకోవచ్చు.
గుహ నెం. 1 (ఉదయగిరి) : చారిత్రక ప్రాముఖ్యత కలిగి ఉంది, ఎందుకంటే ఇది ఆ కాలపు మతాచారాలు మరియు సాంస్క•తిక సంప్రదాయాలపై విశదమైన అవగాహనను అందిస్తుంది. గుహ లోపలి శిల్పాలు, బాస్ట్రెలీపులు (reliefs), అలంకరణలు పురాణ గాథలు, దేవతలు మరియు రాజ ప్రదర్శనలకు సాక్ష్యం.
నాచనా (మధ్యప్రదేశ్) – పార్వతి ఆలయం: నాగర మరియు ద్రావిడ శిల్ప శైలుల మేళవింపుతో సాంస్క•తిక మార్పిడులపై స్పష్టమైన అవగాహనను ఇస్తుంది.


దశావతార ఆలయం – దేవఘఢ్ (ఉత్తర ప్రదేశ్): హిందూ మత సంప్రదాయాలను ప్రతిబింబించే శిఖర నిర్మాణం కలిగి ఉంది. శిఖరం కలిగిన తొలి ఆలయాల
ఉదాహరణలలో ఒకటి. విష్ణువు దశావతారాల సవివర చెక్కింపులు ఆ కాలపు సమృద్ధమైన ఐకానోగ్రాఫిక్ సంప్రదాయానికి ఉదాహరణ.
భితర్గావ్ ఆలయం (కాన్పూర్ సమీపంలో): గుప్త యుగపు ఇటుక ఆలయంలో ఎత్తైన పిరమిడ్ వంటి శిఖరం మరియు స్తంభాలతో కూడిన ముందు మండపం ఉంది.
టిగావా (మధ్యప్రదేశ్): గుప్త కాలపు ప్రముఖ విష్ణు ఆలయం.విష్ణువు మూర్తి ప్రధానంగా ఉంటుంది.గుప్త శిల్ప సూత్రాలకు అనుగుణంగా నిర్మాణం.
సాంస్కృతిక వారసత్వం
గుప్త యుగం కేవలం శిల్ప విజయాలకు మాత్రమే కాకుండా, కళ, సాహిత్యం, గణితం, విజ్ఞానశాస్త్రం వంటి రంగాలకు చేసిన కృషికి ప్రసిద్ధి.
సాంచి ఆలయం బౌద్ధ మరియు హిందూ శిల్ప మూలకాల మేళవింపుతో ఆ కాలంలో జరిగిన సాంస్కృతిక మార్పులు మరియు మతసమ్మేళనంను ప్రతిబింబిస్తుంది.
ఇది భారతీయ ఆలయ చరిత్రలో ప్రాముఖ్యమైన దశ, వివిధ మత-సాంస్కృతిక ప్రభావాల ఏకమైపోవడాన్ని చూపిస్తుంది.
అన్ని గుప్త ఆలయాలు హిందూ దేవాలయాల మొదటి నమూనాలు. ఇవి ప్రాచీన భారతదేశంలోని సాంకేతిక పురోగతిపై విలువైన దాఖలాలు.

క్రిటీరియా (Criteria)
క్రిటీరియన్ (i):
గుప్త ఆలయాల ప్రాముఖ్యత వాటి ప్రయోగాత్మక విలువలో ఉంది. వీటివల్ల ఆలయ రూపకల్పనకు ముందడుగు పడింది మరియు తరువాతి శతాబ్దాలలో ప్రామాణీకరణ సాధ్యమైంది.
ఇవి తార్కిక ప్రమాణాలు, నిర్మాణ సరసత, సమతౌల్యం, బౌద్ధ మరియు హిందూ శైలుల సమ్మేళనం, సవివర శిల్పాలు, సృజనాత్మక రూపకల్పన మూలకాలతో ప్రత్యేకతను సాధించాయి. రాయి చెక్కిన శిల్ప నిర్మాణంలో ఇవి అసాధారణ ప్రతిభను ప్రదర్శించాయి.
క్రిటీరియన్ (iii):
గుప్త ఆలయాలు గుప్త యుగంలోని శిల్ప శైలులు, సాంస్కృతిక మరియు మతపరమైన ఆచారాల మార్పు యొక్క ప్రత్యేక సాక్ష్యం.
సాంచి ఆలయం బౌద్ధ-హిందూ శైలుల సమ్మేళనానికి ప్రతీక. ఇది మతసంస్కృతుల మధ్య మార్పులను ప్రతిబింబిస్తుంది. ఇది భారతదేశంలో కనుగొనబడిన ప్రాచీన ఆలయాలలో ఒకటి.
5, 6వ శతాబ్దాలలో అభివృద్ధి చెందిన గుప్త ఆలయాల గవాక్షద్వారాలు, సవివరమైన ద్వారాల అలంకరణలు గుప్త యుగ శిల్ప వైభవానికి సాక్ష్యం.
కొన్ని ఆలయాలు ఇవాళ కూడా జీవించి పూజార్ధంలో ఉపయోగిస్తున్నందున వాటి వారసత్వం ‘జీవంతం’గా నిలిచింది.
గుప్త ఆలయాలు ప్రస్తుతం భారత పురాతత్వ సర్వే (ASI) ఆధ్వర్యంలో రక్షణలో ఉన్నాయి. వాటి నిర్మాణ సమగ్రత, చారిత్రక ప్రాముఖ్యత, కళా వారసత్వాన్ని కాపాడటానికి సంరక్షణ ప్రయత్నాలు జరిగాయి.
పరిపాలన, నిలుపుదల, మరియు అవగాహన కార్యక్రమాలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. ఇవి అన్ని ప్రాచీన స్మారక చిహ్నాలు మరియు పురావస్తు స్థలాల చట్టం కింద రక్షించబడ్డాయి. గుప్త ఆలయాలు భారతదేశపు శిల్ప, సాంస్కృతిక, మతమూల్యాలను ప్రతిబింబిస్తాయి.
ప్రపంచ వారసత్వ జాబితాలో ఈ ఆలయాలను చేర్చడం వల్ల ఇవి విశ్వవ్యాప్త గుర్తింపును పొందుతాయి.
ఇవి ఓపెన్ ఎయిర్ మ్యూజియంల వలె, ప్రాచీన భారతీయ కళ, నిర్మాణం, మతంపై అధ్యయనం చేసే పండితులు, విద్యార్థులకు విలువైన అనుభవాన్ని కలిగిస్తాయి.
ప్రతిపాదిత వరల్డ్ హెరిటేజ్ నామినేషన్ పూర్తిగా సమర్థించబడింది, ఎందుకంటే ఇవి:

- అత్యున్నత విశ్వవ్యాప్త విలువను కలిగి ఉన్నాయి.
- ఆలయ నిర్మాణాల అభివృద్ధిలో ముందడుగు వేశాయి.
- తరువాతి మత, సాంస్కృతిక ప్రభావాలపై దీర్ఘకాల ప్రాభావం చూపాయి.
ప్రామాణికత మరియు సమగ్రత (Authenticity & Integrity)
- గుప్త ఆలయాలు కాల ప్రభావాన్నితట్టుకుని నిలిచి, ఆ కాలపు శిల్ప ప్రతిభను ప్రతిబింబిస్తున్నాయి.
- ప్రతిపాదిత ఆలయాలు తమ విశిష్ట విలువను తెలియజేయడానికి అవసరమైన అన్ని లక్షణాలు కలిగి
- ఉన్నాయి.
- భితర్గావ్ ఇటుక ఆలయం, దేవఘఢ్ దశావతార ఆలయం గుప్తకాలపు పదార్థ వైవిధ్యాన్ని సూచిస్తాయి.
- శతాబ్దాల వాడుక వలన పాడయినా, గర్భగృహం, మండపం, శిఖరం వంటి ముఖ్య భాగాలు ఇంకా నిలిచాయి.
- సాంచి, నలంద, లౌరియా, రాజగిరి కొన్నింటిలో పని చేసిన పునరుద్ధరణ మినహా ఇతర ఆలయాలలో ఎలాంటి పెద్ద మార్పులు జరగలేదు.
- గుప్త ఆలయాలు పెద్ద సాంస్కృతిక ప్రశ్నాపరిధిలో (land scape) ఉన్నాయి. వీటిలో చాలా బౌద్ధ స్మారక చిహ్నాల సమీపంలో ఉండి, ఆ కాలపు సాంస్కృతిక పూర్ణతను ప్రతిబింబిస్తాయి.
ఇతర సమాన వారసత్వాలతో పోలిక
- అజంతా బౌద్ధ గుహలు (క్రీపూ 2, 1వ శతాబ్దం) ఉదయగిరి గుహలు వీటితో పోలిస్తే నిర్మాణ పరంగా తక్కువ కానీ వారి రాయి చెక్కకళ, సవివర రూపాలు గుప్త యుగం ప్రతిభను చూపిస్తున్నాయి.
- గుప్త కాలపు 5-6వ శతాబ్దంలో అజంతాలో సవివర శిల్ప గుహలు తయారయ్యాయి.
- నాచనా ఆలయం నిర్మాణ శైలి – సాంచి (Temple 1), దేవఘఢ్ ఆలయం వంటి గుప్త ఘట్ట ఆలయాలతో పోల్చదగినది.
- గర్భగృహ ద్వారం శిల్పాల పోలికలు సిర్పూర్ లక్ష్మణ ఆలయంతో (ఛత్తీస్గఢ్) తులనీయమైనవి.
- ఎరాన్ విష్ణు ఆలయం విపులమైన గర్భగృహ ప్రణాళికను చూపుతుంది, కానీ తలుపు దృఢభాగాలు తరువాతి కాలపు (ప్రత్యహార, 8-9వ శతాబ్దం)వి.
- లౌరియా నందనగఢ్ ఇటుక దేవాలయం పహార్పూర్ (బంగ్లాదేశ్) దేవాలయానికి పూర్వ నమూనాగా నిలిచింది.
- నలందా (site 3) ఆలయం మహాబోధి ఆలయానికి శిల్ప పరంగా దగ్గరగా ఉంది, కానీ కాస్త ముందే నిర్మించబడినది.
- సింహ శిరా శిల్పాలు కూడా అభివృద్ధి చెందిన గుప్త ఆలయాలలో (దేవఘఢ్) కనబడతాయి.

నిష్కర్ష: గుప్త ఆలయాలు హిందూ దేవాలయ శిల్ప కళ యొక్క మొదటి రూపాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఇవి ఆలయ నిర్మాణ శైలిలో ప్రాథమిక నమూనాలను స్థాపించాయి. ఈ ఆలయాలు ప్రాచీన భారత నిర్మాణకళలో ఒక విప్లవాత్మక దశను సూచిస్తున్నాయి. గుప్తుల కాలంలో అభివృద్ధి చెందిన ఈ ఆలయాలు ఆ తర్వాతి శతాబ్దాల్లో భారతదేశంలోని అనేక ఆలయ నిర్మాణాలకు పునాది అయ్యాయి.
- ఎసికె. శ్రీహరి
ఎ : 9849930145