
ఏడవరాజైన పూసపాటి విజయరామ గజపతిరాజుగారు (1883-1922) విజయనగరం సంస్థానాన్ని పరిపాలించారు. వీరు విద్యకు మరియు వైద్యకు చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. 1860వ సంవత్సరములో సంస్కృత పాఠశాలను నిర్మించారు. తన సంస్థానములోని ఉద్యోగి జోగారావు కుమారుడు అవధుడైపనటువంటి గంగబాబును గమనించాడు. ఇలాంటి అంధులు చదువు సంధ్యలకు నోచుకోలేక ఆటపాటలు లేక నిరాశలో జీవించే వారిని గమనించి 5 ఫిబ్రవరి 1919వ తారీకున విజయరామ గాన పాఠశాలను ఏర్పాటు చేసారు. విజయనగరం కోట ప్రాంతములోని టౌన్‍హాల్‍ను సంగీత కళాశాలగా మార్చారు.
కర్ణాటక శాస్త్రీయ సంప్ర దాయాలకు పరిరక్షించే ఈ పాఠశాల యందు ప్రస్తుతము వీణ, గాత్రం, వయోలిన్, మృదంగం మరియు సన్నాయి వాద్యాలలో శిక్షణ ఇస్తున్నారు. శ్రీ ఘంటశాల వెంకటేశ్వరరావు గారు, శ్రీమతి పి.సుశీల గారు మరియు శ్రీ రంగం గోపాలరత్నం గారు సైతం ఈ పాఠశాల విద్యార్థులే. అంతేగాదు సినీ మ్యూజిక్ డైరెక్టర్లు అయిన సాలూరు రాజేశ్వరరావు మరియు భూవనేశ్వర మిశ్రో సైతం ఈ కళాశాల విద్యార్థులే అని గర్వంగా చెబుతారు.
1919లో ఒక అంధ విద్యార్థి చాగంటి గంగబాబు కోసం సంగీత పాఠశాలను నిర్మించింది. భారతదేశములో ఈ కళాశాల మొట్టమొదటిది అనుటలో ఏ మాత్రం అతిశయోక్తి కాదు. 1919 నుండి ఇప్పటి వరకు ఒక ప్రవాహములా ఇప్పటికి చక్కగా కొనసాగుతూ అందరి ఆదరణలను పొందుతుంది. అంతేగాక వేలాది మందికి సంగీత జ్ఞానాన్ని ఇప్పించగలిగింది. ఈ సంగీత పాఠశాల. ఆ కళాశాలలోని మొదటి ప్రిన్సిపాల్‍గా హరికథా పితామహుండయిన ఆదిభట్ల నారాయణ దాసుగారు పనిచేసారు.

పూసపాటి రాజులది సూర్యవంశం. ఆ వంశపు రాజుల వంశావలి గమనిద్దాం.
1) శ్రీ పూసపాటి పెద్ద విజయరామరాజు గారు (1) (1708-1757)
2) శ్రీ పూసపాటి ఆనందరాజు గారు (1732-1760)
3) శ్రీ పూసపాటి చిన్నవిజయరామరాజు గారు (2) (1748-1794)
4) శ్రీ పూసపాటి నారాయణ గజపతిరాజుగారు (1786-1845)
5) శ్రీ పూసపాటి విజయరామ గజపతిరాజు గారు (3) (1826-1879)
6) శ్రీ పూసపాటి ఆనంద గజపతిరాజుగారు (1850-1897)
7) శ్రీ పూసపాటి విజయరామ గజపతిరాజు గారు (4) (1883-1922)
8) శ్రీ పూసపాటి అలకనారాయణ గజపతిరాజుగారు (1902-1937)
9) శ్రీ పూసపాటి విజయరామ గజపతిరాజుగారు (పి.వి.జి. రాజుగారు) (1924-1995)
10) శ్రీ పూసపాటి ఆనంద గజపతిరాజుగారు (1950-2016)
11) శ్రీ ప్రస్తుతము పూసపాటి అశోక గజపతిరాజు గారు
(ప్రస్తుత గోవా గవర్నర్ గారు) (1951-ఇప్పటి వరకు).

-డా।। జి.యస్.రామయ్య
ఇంటాక్ సభ్యులు-కర్నూలు, ఆంధప్రదేశ్
ఎ : 898 555 000
