పూటకూళ్ళవ్వ


ఆ తరువాత రెండు రోజులు సరదాగా గడిచిపోయాయి. వాళ్లు నలుగురు ఉదయం సాయంత్రం వాకింగ్‍ చేయడం, రోజంతా ఏవో ఒక ఆటలు.. ముచ్చట్లు, మధ్య మధ్యలో అవ్వను కూడా కలుపుకొని అంత్యాక్షరి ఆడుకోవడం, అందులో
పెద్దవాళ్లు ముగ్గురు పాత పాటలతో.. కొడుకు కోడలు లేటెస్ట్ పాటలతో పోటీ పడటం.. హడావిడిగా గడిచిపోయాయి. ఎప్పుడూ వచ్చిన పిల్లలను అవ్వ ఆడించటమే.. కానీ, ఈసారి అవ్వను వాళ్లు ఆడించటంతో అవ్వకు కూడా సంతోషమైంది.
సుమారు 70 సంవత్సరాలు వున్న అవ్వ ఎలాంటి హడావిడిలో ఉన్నా.. తన వయసుతో వచ్చిన అనుభవం వలన కావచ్చు… చుట్టూ ఉన్న సమాజాన్ని గమనిస్తూనే ఉంటుంది. వాల్లు వచ్చినప్పటి నుండి చూస్తూనే ఉంది. ఎంతటి పెద్ద ఉద్యోగులైనా రోజూ సాంప్రదాయ దుస్తులు వేసుకోవటం, విడిదిలో ఉన్న దేవుని గదిలోకి వెళ్లి దండం పెట్టుకోవడం, అందరితో స్వచ్ఛమైన తెలుగు మాట్లాడటం, ఆఫీస్‍ వాళ్లు కానీ.. ఎవరైనా పని మీద ఫోన్‍ చేసినప్పుడు కానీ అవసరాన్ని బట్టి టకటక ఇంగ్లీషులో మాట్లాడటం’’ అన్నీ గమనించింది. ‘‘ఈ కాలంలో మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్‍ భాషను ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే అంత గొప్ప వాళ్ళమని భ్రమ పడుతుంటారు. వీళ్లు మాత్రం స్వచ్ఛమైన మన తెలుగు భాషలో ఎంత బాగా మాట్లాడుతున్నారు?’’ అనుకుంది. ఇదే విషయం కొడుకును అడిగింది.
వెంటనే నవ్వేశాడు కొడుకు. అవ్వా! నువ్వు అడగటానికి సందేహపడుతున్నావు. కానీ, ఈ విషయం మమ్మల్ని ఇప్పటికే చాలామంది అడిగారు. తిరిగి మళ్ళీ తనే ఇలా చెప్పాడు.. అవ్వా! మా నాన్నగారిని మా తాత ఎప్పుడూ లైబ్రరీకి తీసుకెళ్లే వాడట. అక్కడ ఒకసారి ఉత్తమ కథల పుస్తకం ఒకటి కనబడితే తాత చదివి అందులో ఉన్న ‘‘భారతీయం’’ కథను నాన్నను కూడా చదవమన్నాడట. అది బాగా నచ్చి ఆ ఒక్క కథను అనేకసార్లు తిరిగి ప్రింట్‍ చేయించి అన్ని లైబ్రరీలలో పెట్టించారు. అది చదివాక నాన్నకు నాకు కూడా మన సంప్రదాయాలను పాటిస్తూ మన మాతృభాషలోనే మాట్లాడాలనిపిస్తుంది. ఆ కథ చెప్పేదానికంటటే చదివితే ఇంకా బాగుంటుంది. కానీ నీకు చదవడం వస్తుందా’’? అడిగాడు అవ్వను.
‘‘వస్తుంది బాబు.. చదవటమే కాదు రాయటం కూడా అలవాటు చేసుకున్నాను. మరి ఆ కథ ఇప్పుడు ఉందా నీ దగ్గర’’ ఆత్రుతగా అడిగింది. ఎందుకంటే ఎప్పుడూ అందరి ప్రశ్నలకు అవ్వ సమాధానిమిస్తుంది. ‘‘ఈసారి నా సందేహాన్ని వీళ్లు తీరుస్తున్నారు’’ అనుకుంది.
‘‘ఎప్పుడూ ఆ కథ మా వెంటే ఉంటుంది. ఏదైనా లైబ్రరీ కనబడినప్పుడు అది ఇస్తుంటాం. ఎందుకంటే మన సాంప్రదాయాలు, మాతృభాషల విలువ ప్రపంచమంతా చాటి చెప్పి వాటి గౌరవం నిలబెట్టాలన్పిస్తుంది. ఉండు.. ఇప్పుడే నీకు కూడా ఒక కాపీ తెచ్చిస్తాను’’ అంటూ వెళ్లి తీసుకొచ్చి అవ్వకిచ్చాడు.
అవ్వ వెంటనే ఆఫీస్‍ రూం లోకి వెళ్లి కథ చదవటం ప్రారంభించింది. మొదటి పేజీ తిప్పగానే ‘‘భారతీయం’’ అని కనిపించింద.ఇ మనం కూడా ఆ కథలోకి వెళదామా…
భారతీయం
………..
‘‘యశ్వంత్‍… ఏమిట్రా చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాను. నువ్విక మారవా!’’ కొంచెం విసుగ్గా అడిగాడు రేవంత్‍.
‘‘ఇప్పుడేమయిందిరా! హఠాత్తుగా అలా మాట్లాడు తున్నావేంటి?’’ ఆశ్చర్యపోయాడు యశ్వంత్‍.
‘‘ఏమవటమేమంటి… మన ఫ్రెండ్‍ బర్త్ డే పార్టీకి కదా ఇప్పుడు మనం వెళ్ళేది..’’ స్టైల్‍గా జీన్స్ డ్రెస్‍ వేసుకోక ఈ లాల్చీ పైజామాలు ఏమిట్రా!’’ ‘‘ఏమయినా అంటే ఇది మన సాంప్రదాయం అంటూ నాకు తెలుగులో చెప్పబోతావు..’’ మనం చదివేది ఇంగ్లీష్‍ మీడియంలో.. ఇంగ్లీష్‍లో మాట్లాడితే ఎంత గ్రేట్‍గా ఉంటుంది’’ చెబితే వినవు కదా! దానికి కూడా మన మాతృభాష -మన సంస్క•తి అంటూ మళ్లీ నాకు క్లాస్‍ తీసుకుంటావు..’’ కొంచెం చికాకు, కొంచెం స్నేహితుడిపై ప్రేమ రెండూ కలిపి గొంతులో ఒలికిస్తూ అన్నాడు రేవంత్‍.
రేవంత్‍, యశ్వంత్‍ ఇద్దరూ ప్రైమరీ స్కూల్‍లో చదువుతున్నప్పటి నుండే స్నేహితులయ్యారు. ఇప్పుడు పదవ తరగతిలోకి వచ్చినా ఆ స్నేహం అలాగే కొనసాగుతోంది. కానీ వీరిద్దరి అభిప్రాయాలు.. అభిరుచులు ఎప్పుడూ కలవవు. యశ్వంత్‍కి ఇంగ్లీష్‍ మీడియంలో చదివినా మాతృభాష అంటే ఎంతో ఇష్టం మన సంస్క•తి సాంప్రదాయాలను గౌరవిస్తాడు. గొప్ప గొప్ప వ్యక్తుల చరిత్ర చదువుతుంటాడు. వారి బాటలో నడవాలనుకుంటాడు. కానీ, ‘‘నేటి కాలంలో వాటితో గొప్ప పేరు రాదు.. అవన్నీ అవసరమా’’ అంటాడు రేవంత్‍. రేవంత్‍కు కొంచెం ఆర్భాఆటాలు ఎక్కువ, ఎవరైనా ప్రముఖులు, సెలబ్రిటీలు కనపడితే చాలు.. వాళ్ళతో ఫోటోలు దిగి గొప్పగా చెప్పుకుంటాడు. యశ్వంత్‍ అలా కాకుండా నిరాడంబరంగా ఉంటాడు. అభిరుచులు వేరయినా రేవంత్‍ గుణం మంచిదే అవటంతో ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు.
ఆ రోజు కూడా ఎప్పటిలా రేవంత్‍ అలా అనేసరికి వీడు ఇంకా నన్ను అర్థం చేసుకోవటం లేదని ఆశ్చర్యపోయాడు. రేవంత్‍ వైపు చూస్తూ ‘‘అదేమిట్రా మళ్లీ అదేమాట.. మనం జ్ఞానం కోసం అన్ని భాషల్లో చదువుకుంటాము.. అందుకని మనం మన మాతృభాషను విడిచి పెట్టాలా!’ మన వ్యక్తిత్వాన్ని నిలబెట్టేది కూడా మన భాష, మన సంస్క•తే కదరా’’ అంటూ నవ్వుతూ వివరించబోయాడు యశ్వంత్‍.
‘‘బాబోయ్‍.. మళ్లీ మొదలుపెట్టావా.. ఓకే ఓకే నీది నీ ఇష్టం… నన్ను వదిలేయ్‍.. నేను మాత్రం ఇలాగే ఉంటాను. ‘‘ఫ్రెండ్‍ భుజం చుట్టూ చేయి వేస్తూ అన్నాడు రేవంత్‍.
× × ×
ఇద్దరూ పెరిగి పెద్దవారయ్యారు.
రేవంత్‍ పెద్ద స్వంత ఫ్యాక్టరీని నెలకొల్పి బిజినెస్‍ మెన్‍ అయ్యాడు. యశ్వంత్‍ బాగా చదువుకొని కలెక్టర్‍ అయ్యాడు. నిజాయితీ గల వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. ఆఫీసులో ఉన్నంత వరకే సూటూ.. బూటూ వేసుకొని, తరువాత తనకు నచ్చిన విధంగానే ఉండి.. ప్రతి సభలో సాంప్రదాయ దుస్తులు ధరించి అవసరమైన చోట తప్పితే మాతృభాషలోనే మాట్లాడేవాడు. అతని నడవడికకు అందరూ ఆకర్షితులయ్యేవారు.
ఒకరోజు అంతర్జాతీయ బిజినెస్‍మెన్‍ల మీటింగ్‍ రాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేసారు. దానికి విదేశాల నుండి పెద్దలంతా వచ్చారు. ఆ సభకు అన్ని రాష్ట్రాల విఐపీలను అతిథులుగా ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి యశ్వంత్‍ కూడా ఆహ్వానం అందుకున్నాడు. అదే సభకు బిజినెస్‍ పని మీద రేవంత్‍ కూడా హాజరయ్యాడు. అతనికున్న ఫోటోల మోజు వల్ల విదేశీ ప్రముఖులతో ఫోటోలు దిగాలని చాలా ఆరాటపడ్డాడు. కానీ, విఐపి పాస్‍ లేకుండా లోనికి అనుమతించలేదు, నిరాశతో సభలోనే కూర్చున్నాడు.
ఇంతలో వేదిక మీదకు అతిథులు, విదేశీయులు, ప్రముఖులు అందరూ చేరుకున్నారు. సభలో విదేశీయుల ప్రసంగాలను తెలుగువారి కోసం తెలుగులో అనువదించవలసిందిగా యశ్వంత్‍ను కోరారు. సాంప్రదాయ దస్తులలో ఉన్న యశ్వంత్‍ను చూసి ఇతర దేశాలవారు మన సంస్క•తిని గౌరవిస్తూ రెండు చేతులూ జోడించి నమస్కరించారు. వేదికపైన యశ్వంత్‍తో కలిసి ఫోటో దిగటానికి విదేశీయులంతా పోటీపడ్డారు. మన భారతీయ సంస్క•తిని చూసి ముచ్చటపడ్డారు. మెచ్చుకున్నారు. అతని వినమ్రతను, వ్యక్తిత్వాన్ని గ్రహించి త్వరలో విదేశాల్లో ఏర్పాటు చేయనున్న సభకు భారత్‍ దేశం నుండి ముఖ్య అతిథిగా యశ్వంత్‍ను ఆహ్వానించారు.
ఇదంతా చూస్తున్న రేవంత్‍ ఆశ్చర్యలో మునిగిపోయాడు. స్నేహితుడి అభిరుచుల విలువ ఇప్పుడే అర్థం అవుతోంది. ‘‘హ్యాట్సాఫ్‍ రా యశ్వంత్‍!’’ ‘‘నువ్వు గ్రేట్‍ రా… నువ్వు నా ఫ్రెండ్‍ అవటం నాకెంతో గర్వంగా ఉంది’’ అనుకుంటూ మనసులోనే యశ్వంత్‍ను మెచ్చుకున్నాడు.
(మిగతా కథ వచ్చే సంచికలో)

మాదారపు వాణిశ్రీ
ఫోన్‍ : 9247286668
బొమ్మలు: కైరం బాబు


Leave a Comment

Your email address will not be published. Required fields are marked *