ఉపాధ్యాయ దినోత్సవ ఔన్నత్యంసెప్టెంబర్‍ 5న టీచర్స్ డే

ప్రతి మనిషి చదువు చాలా అవసరం. మనిషి జీవించడానికి గాలి, నీరు, ఆహారం ఎంత అవసరమో విద్య కూడా అంతే ముఖ్యం. దేశం ప్రగతి బాటలో నడవడానికి, ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడ్డానికి విద్యే మూలం. అందుకే ఆ విద్యను అందించే గురువును ఎంత ప్రశంసించినా తక్కువే. విజ్ఞానాన్ని అందించి విద్యార్థుల జీవితాల్లో వెలుగులను నింపేది ఉపాధ్యాయులే. డాక్టర్‍, ఇంజనీర్‍, రైటర్‍, సైంటిస్టు ఇలా ప్రతి రంగంలో ఉన్న ప్రముఖులందరూ ఒకప్పుడు ఓ గురువు అడుగుజాడల్లో నడిచినవాళ్లే. ఉపాధ్యాయులు కేవలం సబ్జెక్ట్ విషయాలే కాదు.. క్రమ శిక్షణ, విలువలు, నైతికత, మానవత్వం, ఆత్మవిశ్వాసాలను ఓనమాలతో పాటే నేర్పిస్తారు. అందుకే సమాజానికి అవసరమైన నాలుగు వృత్తుల్లో ఉపాధ్యాయ వృత్తి కూడా ఒకటిగా నిలిచింది. రేపటి తరాన్ని, దేశ భవిష్యత్తును రూపొందించేది టీచర్లే. అటువంటి టీచర్ల కృషిని ఉపాధ్యాయ దినోత్సవం రోజున స్మరించుకోవడం విద్యార్థుల ప్రథమ కర్తవ్యం. అందుకే మన దేశంలో ప్రతి ఏటా సెప్టెంబర్‍ 5వ తేదీన అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం సంప్రదాయం అయింది.
టీచర్‍, ప్రొఫెసర్‍, లెక్చరర్‍, సార్‍, మాస్టర్‍, కోచ్‍, ట్రైనర్‍, పండిట్‍ ఎలా పిలిచినా ఒక విషయాన్ని నేర్పించిన వాళ్లు, బోధించే వాళ్లు గురువులవుతారు. అన్ని బంధాల్లోకంటే టీచర్‍, విద్యార్థి బంధం చాలా భిన్నమైనది. ఎందుకంటే ఇద్దరి మధ్య ఎటువంటి రక్త సంబంధం ఉండదు. పాఠశాలలోని తరగతి గదిలోనే వారి బంధం మొదలవుతుంది. ఒకప్పుడు గురువంటే విద్యార్థుల్లో భయం ఉండేది. భక్తి ఉండేది. ఇప్పుడు భయం స్థానంలో స్నేహం ఉంటుంది. ఒక టీచర్‍.. తన ప్రియమైన విద్యార్థితో ఫ్రెండ్‍లాగేనే వ్యవహరిస్తున్నాడు. చదువే కాదు.. ఆటలు, పాటలు కూడా నేర్పిస్తున్నారు. విద్యార్థులతో కలసి ఆడుతున్నారు, పాడుతున్నారు. టెక్టస్ బుక్స్లో సబ్జెక్ట్ని మెకానికల్‍గా కాకుండా అర్థమయ్యే విధంగా సింపుల్‍గా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. విద్యార్థుల్లో ఉండే ప్రతిభను బయటకు తీస్తున్నారు. ఏ విద్యార్థికి ఏ విషయంలో టాలెంట్‍ ఉందో గుర్తిస్తున్నారు. చదువుతో పాటు తమకు నచ్చిన రంగాల్లో కూడా రాణించేలా ప్రోత్సహిస్తున్నారు. అందుకే కాలంతో పాటు గురు, శిష్యుల బంధం కూడా ట్రెండీగా మారింది. దీంతో విద్యార్థులు కూడా తమ ఉపాధ్యాయుల పట్ల అమితమైన ప్రేమను పెంచుకుంటున్నారు.

సాఫ్ట్వర్‍ నుంచి సినిమా స్టార్‍ వరకూ ప్రతి ఒక్కరూ తమకు అక్షరాలు నేర్పించిన టీచర్లను మరువలేరు. వ్యక్తి ఎంత ఎదిగినా దానికి పునాది వేసేది కచ్చితంగా టీచర్లే. వారి ఇచ్చే అక్షర జ్ఞానం, వారందించే అవగాహన, లోతైన విశ్లేషణ, చెప్పే మాట, తిట్టే తిట్లు అన్ని విద్యార్థి మంచి కోసమే. ఉపాధ్యాయులు రెండు మొట్టికాయలు వేసినా, తిట్టినా, అలిగినా, మాట్లాడకపోయినా అందులో విద్యార్థి శ్రేయస్సు దాగి ఉంటుంది.
సర్వేపల్లి రాధాక•ష్ణన్‍ను స్మరించుకుంటూ సెప్టెంబర్‍ 5న ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. ఉపాధ్యాయ దినోత్సం అనగానే విద్యార్థులకు మొదట గుర్తుకు రావాల్సిన వ్యక్తి డాక్టర్‍ సర్వేపల్లి రాధాకృష్ణన్‍. ఉపాధ్యాయ దినోత్సవం రోజున విద్యార్థులు కచ్చితంగా సర్వేపల్లి రాధాకృష్ణన్‍ గురించి తెలుసుకోవాలి. డాక్టర్‍ సర్వేపల్లి రాధాక•ష్ణన్‍ అధ్యాపకుడు, దౌత్యవేత్త, మేధావి, ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా దేశానికి సేవలందించిన వ్యక్తి. 1952 నుంచి 1962 మధ్య ఉపరాష్ట్రపతిగా, 1962 నుంచి 1967 వరకు రాష్ట్రపతిగా ఆయన పని చేశారు.

సర్వేపల్లి రాధాకృష్ణన్‍ 1888వ సంవత్సరంలో తమిళనాడులోని ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు. మద్రాస్‍ యూనివర్సిటీలో ఏంఏ (ఫిలాసఫీ) వరకు చదువుకున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్‍ పూర్తి చేసిన తర్వాత భారతీయ తత్వశాస్త్రంపై అనేక రచనలు చేశారు. ఎన్నో వ్యాసాలు రాశారు. దాంతో ఆయనెంతో పేరు ప్రఖ్యాతులను సొంతం చేసుకున్నారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన సంవత్సరం 1947లో డాక్టర్‍ రాధాకృష్ణన్‍ UNESCOలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. అసాధారణ తెలివి తేటలు, క్రమ శిక్షణ, నిబద్దతత కారణంగా ఆయన్ని ఎన్నో పదవులు వరించాయి. విద్యార్థుల కోసం, భవిష్యత్తు తరాల కోసం చాలా పాటుపడ్డారు. ఒక టీచర్‍గా సర్వేపల్లి రాధాకృష్ణన్‍ విద్యార్థుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. విద్యార్థులు ఆయనని అమితంగా అభిమానించారు.

  • కె. సత్యప్రసన్న

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *