సాధికారత కలిగిన తెలంగాణ తొలితరం మేధావికుంభం మధుసూదన్‍ రెడ్డి

తెలంగాణ సాధనలో క్రియాశీలక పాత్ర
ఓయూ ఆర్టస్ కాలేజీ ప్రిన్సిపాల్‍గా సేవలు
బీఆర్‍ఎస్‍ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‍ నివాళి
సంతాపం ప్రకటించిన పలువురు ప్రముఖులు

ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్టస్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్‍ ప్రొఫెసర్‍ కుంభం మధుసూదన్‍రెడ్డి (90) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన జూలై 23, 2025న నారాయణగూడ (హైదరాబాద్‍)లోని తన నివాసంలో చివరిశ్వాస విడిచారు. ఆయనకు భార్య విమల, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
స్వరాష్ట్ర సాధనలో
క్రియాశీలక పాత్ర

నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం, శివన్నగూడానికి చెందిన శివారెడ్డి, రంగనాయకమ్మకు 1935లో మధుసూదన్‍రెడ్డి జన్మించారు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం శివన్నగూడెంలో, ఇంటర్మీడియట్‍ హైదరాబాద్‍ వీవీ కళాశాలలో, డిగ్రీ నిజాం కళాశాలలో పూర్తిచేశారు. ఆర్టస్ కళాశాల ప్రిన్సిపాల్‍గా గొప్ప పాలనాధ్యక్షుడుగా పనితీరు కనబరిచారు. ఓయూ సోషల్‍ సైన్సెస్‍ డీన్‍గా వ్యవహరించారు. రాజనీతి శాస్త్రంలో గొప్ప బోధకుడిగా పేరొందిన ఆయన వివిధ దేశాల్లో నిర్వహించిన సెమినార్లలో పాల్గొన్నారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఉద్యమకారులనుంచి రాజకీయ నేతలవరకు అందరితో కలిసి పనిచేసిన ఘనత ఆయనది. ఆయన ఆల్‍ ఇండియా పొలిటికల్‍ సైన్స్ ప్రొఫెసర్స్ అసోసియేషన్‍ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు.

మధుసూదన్‍రెడ్డి మరణం తెలంగాణకు తీరని లోటు: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో.. ఒక ప్రొఫెసర్‍గా, మేధావిగా, భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ, ఉద్యమ పాఠాలు బోధిస్తూ.. క్రియాశీలకంగా కృషి చేశారని కేసీఆర్‍ తెలిపారు. ప్రొఫెసర్‍ మధుసూదన్‍రెడ్డితో తనకున్న ఉద్యమ బంధాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. తెలంగాణ సామాజిక, రాజకీయ నిర్మాణం పట్ల లోతైన అవగాహనతో, పూర్తి సాధికారత కలిగిన తెలంగాణ తొలితరం మేధావిగా, బహుజన పక్షపాతిగా మధుసూదన్‍రెడ్డి ఆలోచనధార చాలా గొప్పది. వారి మరణం తెలంగాణకు తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.


మధుసూదన్‍రెడ్డి మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే ఓయూ మాజీ వైస్‍చాన్స్లర్‍ ప్రొఫెసర్‍ సులేమాన్‍ సిద్ధిఖి, ప్రముఖ సామాజికవేత్త ప్రొఫెసర్‍ కంచె ఐలయ్య, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్‍ జూలూరు గౌరీశంకర్‍, రామానందతీర్థ గ్రామీణ విద్యాసంస్థ చైర్మన్‍ నారా కిశోర్‍రెడ్డి, మీడియా అకాడమీ మాజీ చైర్మన్‍ అల్లం నారాయణ, హైకోర్టు మాజీ అడ్వకేట్‍ జనరల్‍ ప్రకాశ్‍రెడ్డి, అంబేద్కర్‍ ఓపెన్‍ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‍ ఘంటా చక్రపాణి, విశ్రాంత న్యాయమూర్తులు, తెలంగాణ ఉద్యమకారులు, వివిధ పార్టీల నేతలు, ప్రొఫెసర్లు, వర్సిటీల వైస్‍ చాన్స్లర్లు ఆయన నివాసానికి వచ్చి భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. మధుసూధన్‍రెడ్డి అంత్యక్రియలు ఫిల్మ్నగర్‍లోని మహాప్రస్థానంలో నిర్వహించారు.

  • దక్కన్‍న్యూస్‍
    ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *