కాకతీయ రాజులు వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. రాజ్యం సుభిక్షంగా ఉన్నప్పుడే రాజ్య ప్రజలు బాగుంటారని ఆశించి రాజ్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. కాకతీయ సామ్రాజ్యం అనగానే మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది కాకతీయుల కాలం నాటి వాస్తు శిల్ప కళా వైభవం. ఆ వైభవానికి ప్రతీకగా ఎన్నో దేవాలయాలు ప్రత్యేకమైన కట్టడాలు విరాజిల్లుతున్నాయి.
క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దం రాష్ట్ర కూటులకు సామంతు లుగా ఉన్న కాకతీయులు ఆంధ్రదేశమంతటిని ఏకతాటిపై తీసుకొచ్చి శాతవాహనుల తరువాత పరిపాలించిన హైందవ రాజ్య వంశం కాకతీయులు. కాకతీయుల కాలంలోనే ఆంధ్ర త్రిలింగ అన్న పదాలు సమానార్థకాలై దేశపరంగా జాతి పరంగా ప్రసిద్ధి చెందాయి. త్రిలింగ అన్న పదం కాలక్రమేణా తెనుగుగా మారిపోయింది.
వీరికి ‘‘ఆంధ్రదేశాధీశ్వర’’ అనే బిరుదు కూడా ఉంది వీరి రాజధాని నేటి ఓరుగల్లు ప్రాంతం. కాకతీయుల కాలంలో వ్యవసాయానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి. అనేకమైన చెరువులు తవ్వించి రాజ్య సుభిక్షానికి కారణమై ఇప్పటివరకు కూడా ఆ చెరువులు బావులు ఉపయోగపడుతున్నాయి. తాగునీటి సాగునీటి అవసరాలను తీరుస్తున్నాయి.
అందులోనే భాగంగా ఓరుగల్లు ప్రాంతానికి దగ్గరలో ఉన్న నేటి శివానగర్ ప్రాంతంలో బయటికి వచ్చిన మెట్ల బావి. ఈ బావిని శ•ంగార భావి అని కూడా అంటారు. ఈ బావి మూడు అంతస్తులలో నిర్మించారు రాణి రుద్రమదేవితో సహా రాజులు రాణులు స్థానం ఆచరించేవారు అని స్థానికులు చెప్తున్నారు. శృంగార భావిలో నుండి నేరుగా వేయి స్తంభాల గుడికి ఒక సొరంగ మార్గం ఉందని చెబుతున్నారు. కాకతీయులు 365 బావులను తవ్వించారని అందులో ఈ అంతస్తుల బావి ఒకటి. మూడంతస్తులుగా ఉన్న ఈ బావిలో శత్రువులు గనక ప్రవేశిస్తే కింది అంతస్తులో ఉన్న బటులు నీటిలో కనిపించే ముఖ ప్రతిబింబం ద్వారా మీది అంతస్తులో ఉండే వారిని హతం చేసేవారని పలువురి మాటలు, మొదటి అంతస్తులో తొమ్మిది పిల్లర్లు, రెండవ అంతస్తులు నాలుగు పిల్లర్లు, మూడో అంతస్తులో రెండు పిల్లర్లతో నిర్మాణం జరిగింది..!

ఈ బావి పరిసర ప్రాంతాల్లో నివసించేవారు దీన్ని మెట్ల బావి అనే కాకుండా పెద్ద కోనేరు. పద్నాలుగు మోటల బావి, దిగుడుబావి, స్నానాలబావి, అంతస్తుల బావి, చంద్రకళ బావి, మిల్లుల బావి ఇలా రకరకాల పేర్లతో పిలుస్తున్నారు.
దేవాలయాలే కాదు బావులను కూడా అద్భుతమైన శిల్పాలంకరణతో తీర్చిదిద్దిన ఘనత కాకతీయులది. మెట్ల బావిని పరిశీలిస్తే మనకు ఆ విషయం అవగతమవుతుంది. రెండు అంతస్తులుగా ఉన్న ఈ బావి నిర్మాణ శైలిని పరిశీలిస్తే ఆశ్చర్యం కలుగక మానదు. చతురస్రాకారంలో ఉన్న ఈ బావికి దక్షిణం నుంచి 1.8 మీటర్ల వెడల్పుతో ఉన్న మార్గం గుండా కిందికి పది మెట్లు దిగితే మొదటి అంతస్తు వస్తుంది. మొదటి అంతస్తు వద్ద మెట్లకు ఇరువైపులా ఉన్న ద్వారాల్లో దేనినుంచైనా 7,95 మీటర్లు ముందుకు వెళ్లితే బావి కనిపిస్తుంది. 1.84 మీటర్ల ఎత్తుతో తూర్పు-పశ్చిమ దిశలో 14 స్తంభాలు, ఉత్తర-దక్షిణ దిశలో 20 స్తంభాలు ఉండి పై అంతస్తును మోస్తున్నాయి. అలాగే మొదటి అంతస్తు చుట్టూ 2.5 మీటర్ల వెడల్పుతో ఒక వైపు స్తంభాలు
ఉంటే మరో వైపు గోడ ఉంది. ఈ మొత్తం కట్టడం పైభాగాన 14 మీటర్ల వెడల్పు కలిగి ఉంటే, మొదటి అంతస్తుకు వెళ్లాక 18 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. అలాగే అక్కడి నుంచి మరో 20 మెట్లు కిందికి వెళ్తే రెండవ అంతస్తు వస్తుంది. అక్కడ నాలుగు స్తంభాలతో చిన్నపాటి మండపం ఉంది.
మొదటి అంతస్తులోని గోడకు నర్తకీమణుల శిల్పాలున్న నల్లరాతి ఫలకం ఉంది. అలాగే మరో చోట 11 శిల్పాలున్న రాతి ఫలకం ఉంది. ఈ బావి మొదటి అంతస్తులో పడమర వైపున ఉన్న మంటపం స్తంభాలలో ఒక స్తంభం మీద తెలుగులో ఒక లఘుశాసనం, దక్షిణం వైపున ఉన్న మరొక స్తంభం మీద హిందీలో మరొక లఘుశాసనం ఉన్నాయి.
తెలుగులో గల లఘుశాసనంలో ‘మిరాసి’ అనే పదము రాసి ఉంది. కాకతీయుల అనంతరం కుతుబ్ షాహీల పరిపాలనలో ‘మిరాసీదారుల’ వ్యవస్థ ఏర్పడింది. ఒక మిరాసీదారుని నీరుపొలానికి సాగు నీటిని అందించిన బావి ఇది. రెండో లఘు శాసనంలో దేవనాగరి లిపిలో ‘మూలదాసజీ’ అన్న పేరు కనబడుతోంది. ఈ రెండు శాసనాలు ఈ మెట్ల బావి గురించిన వివరాలు తెలుసుకోవడానికి దొరికిన లిఖిత ఆధారాలు కాగా, ఇతర ఆధారాలు బావిలో పలు చోట్లున్న కొన్ని శిథిల శిల్పాలు ఉన్నాయి కళ్యాణీ చాళుక్యుల, కాకతీయుల మధ్యకాలంలో నిర్మితమైన దేవాలయాలకు చెంది’’. అపూర్వ శిల్పాల శిధిలాలు ఉన్నాయి. బావి నిర్మాణంలో ఒకచోట ద్వారస్తంభం, మరోచోటు మంటపంలో పైకప్పులో ఉంచే అష్టకోణయంత్రాల రాతిబిళ్ళలు, ఇంకొకచోట మకడా తోరణాలలో శివుడి అనుచరగణాలు, మదనికల శిల్పాలను ఉపయోగించారు..!

ముగింపు: కాకతీయుల కాలంలో చరిత్ర పుటమిలో దాగి ఉన్న సంపద. కాకతీయులు నిర్మించిన అనేకమైన దేవాలయాలు అనేక రకాల శిల్పాలు ఈ తరానికి కూడా చూడడానికి ఎంతగానో ప్రీతికరంగా ఉన్నాయి! ఢిల్లీ సుల్తానుల దురాక్రమణాల వలన కాకతీయులు నిర్మించిన ఎన్నో కళ వైభవాలు దెబ్బతిన్నాయి. ఇప్పటికి కూడా చూడడానికి పాలంపేటలోని రామప్ప దేవాలయం, హనుమకొండ ప్రాంతంలోని వేయి స్తంభాల దేవాలయం, మిడిల్ ఫోర్ట్లో ఉన్న చెముని గుడి ఆలయం ఇంకా ఇవి నేటి తరానికి కనులవిందుగా ఉన్నాయి.
ఆ బావిని నేను నేరుగా వెళ్లి చూస్తే అది ఒక మహా అద్భుతం. ఈ తరం వారు అలాంటి కట్టడాలను నిర్మించాలి అంటే ఊహాజణితం అని చెప్పవచ్చు. అందులో ఒక్కసారి వెళ్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించే అద్భుతమైన శిల్పాలు, స్తంభాలు, బావిలోకి దిగడానికి సుందరమైన మెట్లు, దాని చుట్టూ తిరుగుతుంటే వివిధ రకములైన పుష్పాల ఆకారంలో కలిగిన శిల్పాలు, దాని చుట్టూ నాట్యం వేస్తూ వాయిద్యాలు వాయిస్తున్న న•త్యకారులు కనిపిస్తారు. సృష్టికర్త మహా శివుని విగ్రహం నంది విగ్రహం కనిపిస్తాయి. చారిత్రక ప్రదేశంగా విరాజిల్లుతుంది.
-ఆమంచ లోకేష్, 6304006470
