సంస్కృతి, సాంప్రదాయాలు తెలిపే టూరిజం

ప్రతి ఒక్కరికీ ట్రావెల్‍ చేయాంటే ఇష్టం. కానీ సమయం లేక, డబ్బులు లేక ఇష్టాన్ని వదులుకుంటారు. కొత్త కొత్త ప్రదేశాలను సందర్శించడానికి వెళ్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి సమస్యలు ఉన్న అవి క్షణాల్లో మర్చిపోతారు. ఈ ప్రపంచంలో ఎన్నో ప్రకృతి అందాలు ఉన్నాయి. వీటిని సందర్శించాలంటే ఒక జీవితం సరిపోదు. ట్రావెల్‍ అంటే ఇష్టం ఉన్నవారు ఎంత బీజీగా ఉన్నా.. కొంత సమయం వీలు చూసుకుని ఏదో ఒక ప్రదేశానికి వెళ్తుంటారు. ఇలా వెళ్లడం వల్ల ఎలాంటి బాధ నుంచి అయిన విముక్తి పొందవచ్చని భావిస్తారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక దినోత్సవాన్ని ప్రతీ ఏడాది సెప్టెంబర్‍ 27న జరుపు కుంటారు.

పర్యాటక దినోత్సవ చరిత్ర
ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక దినోత్సవాన్ని జరుపు కోవాలని వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్‍ నిర్ణయించింది. ప్రతి ఏడాది సెప్టెంబర్‍ 27న ఈ టూరిజం డేను జరుపుకోవడానికి 1980 నుంచి ప్రారంభించారు. ఐక్యరాజ్య సమితి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్‍ సెప్టెంబర్‍ 27న అధికారిక హోదా వచ్చింది. దీంతో ప్రతి ఏడాది ఈ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా జరుపు కుంటున్నారు. అయితే సెప్టెంబర్‍ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకోవాలని నైజీరియా జాతీయుడైన దివంగత ఇగ్నేషియస్‍ అమదువా అటిగ్బి మొదటిసారి తెలిపారు. ఇతన్ని పర్యాటక దినోత్సవ పితామహుడు అని కూడా పిలుస్తారు. పర్యాటక దినోత్సవానికి నీలం రంగును అధికారిక రంగుని నిర్ణయించారు. అలాగే ప్రతి ఏడాది కొత్త థీమ్‍, కార్యక్రమాన్ని నిర్వహించే దేశాన్ని కూడా ఎంపిక చేస్తారు. ఈ ఏడాది ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని మలేషియా దేశంలోని మెలకా నగరంలో నిర్వహిస్తున్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించే దేశం ప్రతి ఏడాది మారిపోతుంది. దేశంలోని గొప్ప సంస్కృతి, సాంప్రదాయాల గురించి తెలుపనున్నది.

ఎందుకు జరుపుకుంటారంటే?
ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకంపై అవగాహనను కల్పించడానికి ప్రతీ ఏడాది ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. పర్యాటకం అతిపెద్ద పరిశ్రమ. పర్యాటక రంగం నుంచి దేశాలకు ఆర్థికంగా ఇబ్బందులు తొలగుతాయి. ఆర్థిక అభివృద్ధి ఎలా ఉపయోగపడుతుందని, దీనిపై అవగాహన కల్పించాలనే
ఉద్దేశంతోనే ప్రతి ఏడాది జరుపుకుంటారు. బయటకు వెళ్లినప్పుడు పర్యావరణానికి హాని కలిగించకుండా ఉండే వాటిని ఉపయో గించాలి. ముఖ్యంగా ప్లాస్టిక్‍ వస్తువులకు దూరంగా ఉండాలి. ఇలాంటివన్నీ పాటిస్తూ.. పర్యాటకంపై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపు కుంటారు. కోవిడ్‍ సమయంలో పర్యాటక రంగం ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ప్రతి దేశానికి పర్యాటకం రంగం ఆర్థికంగా నిలబడుతుంది.

థీమ్‍:సెప్టెంబర్‍ 27న జరుపుకునే 2025 ప్రపంచ పర్యాటక దినోత్సవం యొక్క థీమ్‍ ‘‘పర్యాటకం మరియు స్థిరమైన పరివర్తన’’. ఈ థీమ్‍ ప్రజలు మరియు గ్రహం రెండింటికీ సానుకూల మార్పును నడిపించ డంలో పర్యాటక పాత్రను ప్రత్యేకంగా చెబుతుంది.

  • దక్కన్‍న్యూస్‍,
    ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *