సంపూర్ణ అక్షరాస్యత ఎప్పుడు?సెప్టెంబర్‍ 8న ఇంటర్నేషనల్‍ లిటరసీ డే

1967 నుంచి ఇంటర్నేషన్‍ లిటరసీ డేని యునెస్కో ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్‍ 8న జరుపుకుంటారు. అక్షరాస్యత అనేది అందరికీ ప్రాథమిక మానవ హక్కు. ఇది ఇతర మానవ హక్కులు, స్వేచ్ఛ, ప్రపంచ పౌరసత్వానికి తలుపులు తెరుస్తుంది. అక్షరాస్యత సమానత్వం, వివక్ష లేని గౌరవం, చట్ట నియమం, సంఘీభావం, న్యాయం ఆధారంగా శాశ్వత శాంతి సంస్కృతిని పొందేందుకు పునాది. చదవడం, రాయడం ద్వారా వ్యక్తులను శక్తివంతం చేయడంలో ప్రపంచ రిమైండర్‍గా పనిచేస్తుంది.
ఇటీవల కాలంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నా.. విద్యా, ఉపాధి, వృద్ధి అవకాశాలకు దూరంగా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్ది ప్రజలు ఉన్నారు. ప్రభుత్వాలు, సంస్థలు, సంఘాలు కలిసి అక్షరాస్యత అంతరాలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరికీ ఉజ్వల భవిష్యత్తును అందించే దిశగా ఇంటర్నేషనల్‍ లిటరసీ డే ప్రోత్సహిస్తుంది.
ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలతో పోలిస్తే అక్షరాస్యత విషయంలో భారతదేశం అగాధంలో వున్నట్లే చెప్పవచ్చు. ఈ మాత్రమైనా మనదేశ అక్షరాస్యత ఉందంటే దానిక్కారణం కేరళ, ఢిల్లీ, ఉత్తారాఖండ్‍, హిమాచల్‍ లాంటి కొన్ని రాష్ట్రాలు అక్షరాస్యతను సాధించటంలో ముందుండటం తప్ప మరోటి కాదు. బీహార్‍, ఆంధప్రదేశ్‍, తెలంగాణ, మధ్యప్రదేశ్‍, రాజస్థాన్‍ రాష్ట్రాలు సగటు అక్షరాస్యతా శాతానికి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. మొత్తం మీద ప్రపంచ నిరక్షరాస్యుల్లో సగం మంది మనదేశంలోనే ఉండటం విచారకరం. స్థిరమైన ఆర్థికాభివృద్ధి సాధించాలంటే దేశంలో 90 శాతం అక్షరాస్యత సాధించాల్సిన అవసరం ఉంది. స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లు గడుస్తున్నా 78 శాతం అక్షరాస్యతనే సాధించగలిగాము. అందరూ చదివినప్పుడే గ్రామాభివృద్ధి జరుగుతుంది.

2030 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని కేందప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే విద్యా రంగంలో నెలకొన్న సవాళ్లతో పాటు 2019, 2020లో కరోనా మహమ్మారి కారణంగా ఈలక్ష్యానికి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. మరోవైపు ప్రజల్లో విద్యపై అవగాహన పెంచడానికి ఐక్యరాజ్యసమితి ప్రతీ ఏడాది సెప్టెంబర్‍ 8న అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. 1966 నుంచి విద్యపై విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రపంచ నిరక్షరాస్యుల్లో 34% మంది భారత్‍లోనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా తర్వాత 2.4 కోట్ల మంది తిరిగి పాఠశాలల్లో చేరలేదు. వారిలో 1.1 కోట్ల మంది అమ్మాయిలున్నారు. కరోనా ప్రభావం, లాక్‍డౌన్లతో దేశంలో 15లక్షల స్కూళ్లు మూత పడ్డాయని, 24.7 కోట్ల విద్యార్థులు ఏడాది పాటు చదువుకి దూరమయ్యారని యునెస్కో వెల్లడించింది. తర్వాత కూడా 30%మంది విద్యార్థులు తిరిగి పాఠశాలల్లో చేరలేదని నివేదికలు వెల్లడిస్తున్నాయి. సంపూర్ణ అక్షరాస్యత మినహిస్తే.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అక్షరాస్యతలో భారత్‍ గణనీయమైన పురగోతి సాధించింది.

థీమ్‍..
సెప్టెంబర్‍ 8న జరుపుకునే అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం 2025 యొక్క థీమ్‍ ‘‘డిజిటల్‍ యుగంలో అక్షరాస్యతను ప్రోత్సహించడం.’’ పెరుగుతున్న డిజిటల్‍ ప్రపంచాన్ని నావిగేట్‍ చేయడానికి అవసరమైన నైపుణ్యాలతో వ్యక్తులను సన్నద్ధం చేయడం యొక్క ప్రాముఖ్యతను ఈ థీమ్‍ ప్రత్యేకంగా చెబుతుంది.

  • దక్కన్‍న్యూస్‍
    ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *