ప్రపంచవ్యాప్తంగా ఆడబిడ్డలపై ఉండే వివక్షతను, హింసను, బాల్యవివాహాల వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆడబిడ్డల ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఐక్యరాజ్య సమితి ఈ కార్యక్రమాన్ని ఏటా చేపడుతుంది.
ప్రతీ ఏటా అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని ఏదో ఒక ప్రత్యేక థీమ్‍తో నిర్వహిస్తుంటారు. ఈ ఏడాదికిగాను ‘‘ఉజ్వల భవిష్యత్తు కోసం బాలికలను శక్తివంతం చేయడం’’ అనే థీమ్‍తో నిర్వహించనున్నారు. బాలికలకు విద్య, ఆరోగ్య సంరక్షణ మరియు వ్యక్తిగత వృద్ధిలో సమాన అవకాశాలను అందించడం యొక్క ప్రాముఖ్యతను ప్రత్యేకంగా చేస్తుంది. సమాజంలో వారి పాత్రను మరియు వారు అభివృద్ధి చెందడానికి సమగ్ర మద్దతు అవసరాన్ని ప్రముఖంగా చెబుతుంది.
ప్రపంచవ్యాప్తంగా బాలికలు విద్య, శారీరక, మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. వీటన్నంటిపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలనే లక్ష్యంతో అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని బాలికలకు సంబంధించిన స్ఫూర్తిదాయకమైన కథనాలను, వీడియోలను అందరితో పంచుకోవాలని ఐక్యరాజ్య సమితి ప్రజలకు పిలుపునిచ్చింది.
చరిత్ర ఏంటంటే..
అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహించడం వెనకాల పెద్ద చరిత్రే ఉంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ డిసెంబర్ 19, 2011న, అక్టోబర్ 11ని అంతర్జాతీయ బాలికా దినోత్సవంగా ప్రకటించడానికి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అక్టోబర్ 11న జరిగే కార్యక్రమంలో ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా అమ్మాయిలు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించి, వారి మానవ హక్కులను నెరవేర్చే దిశగా వారిని శక్తివంతం చేయడంపై ద•ష్టి సారించింది. అణగారిన బాలికల హక్కుల తరఫున గొంతు కావాలనేదే ఈ దినోత్సవం ప్రాముఖ్యత. బాలికలకు మెరుగైన ఆరోగ్య సేవలు, విద్యలో సమాన అవకాశాలు, లింగ-ఆధారిత వివక్ష, బాలికలపై హింసలేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
- దక్కన్న్యూస్, ఎ : 9030 6262 88