అంతరించిపోతున్న జాతులం

ప్రపంచ జంతు దినోత్సవం (అక్టోబర్‍ 4) సందర్భంగా అంతరించిపోతున్న జాతుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా, వాటిని ఎలా కాపాడుకోవాలో నేర్పుతారు. ఈ రోజు జంతు హక్కుల కోసం ప్రపంచవ్యాప్తంగా చొరవ చూపుతారు. జంతు దినోత్సవం ప్రధాన లక్ష్యం జంతు సంక్షేమం కోసం మెరుగైన ప్రమాణాలను నిర్ధారించడం. ప్రపంచ జంతు దినోత్సవాన్ని క్రమంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. జంతు రక్షణ కదలికను ఏకం చేయడంతోపాటు.. ప్రోత్సహిస్తుంది. జంతు సంరక్షణ ఆశ్రయం, జంతు సంక్షేమానికి కొంత సహకారం అందించడమే కాకుండా, ప్రజలు జంతు దినోత్సవం రోజున అనేక ఇతర కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు.
ఈ జంతు దినోత్సవాన్ని తొలిసారి 1931లో ఇటలీ దేశంలోని ఫ్లోరెన్స్ పట్టణంలో జరుపుకున్నారు. పర్యావరణ పరిరక్షకుడుగా ఖ్యాతిగడించిన సెయింట్‍ ఫ్రాన్సిస్‍ ఆఫ్‍ అసిసి అక్టోబరు 3, 1226న చనిపోగా, ఆయన చనిపోయిన మరుసటి రోజును పెద్ద పండుగగా జరుపుకుంటారు. ఈ పండుగనే ప్రపంచ జంతు దినోత్సవంగా ప్రకటించి జరుపుకుంటారు.
వాస్తవానికి ఈ భూమిమీద ఎన్నో రకాలైన జంతువులు మనుషులతో పాటు జీవిస్తున్నాయి. అయితే, భూమిమీద మనుషుల కంటే ముందు నుంచే జంతువులే ఉన్నాయని సైన్స్ చెబుతోంది. అయితే, భూమి ఆవిర్భవించిన తర్వాత అనేక అరుదైన జంతువుల జాడ కనిపించకుండా పోయింది. నేటి ఆధునిక యుగంలోనూ అనేక జంతువులు అంతరించిపోతున్నాయి.
థీమ్‍: ‘‘జంతువులను రక్షించండి, గ్రహాన్ని రక్షించండి!’’. ఈ థీమ్‍ ప్రపంచ జంతు దినోత్సవం యొక్క 100వ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది. జంతు సంక్షేమం, గ్రహ ఆరోగ్యం యొక్క పరస్పర సంబంధాన్ని ప్రధానంగా తెలుపుతుంది. జంతువులను రక్షించడం భూమిని రక్షించడంతో కలిసి ఉంటుందని ప్రత్యేకంగా తెలుపుతుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *