ఉమ్మడి కర్నూలు జిల్లా ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని నైరుతి భాగంలో కలదు. ఇది 17,658 చదరపు కిలోమీటర్లలో విస్తరించి యున్నది. ఈ జిల్లాలో రెండు ఫిసియే గ్రాఫిక్ ప్రాంతాలు కలవు. ఉదాహరణకు ఎత్తు పల్లాలతో కూడిన ప్రాంతం పశ్చిమంలో కలదు. మరియు తూర్పులో సెడిమెంటరీ టెర్రేన్‍లో స్ట్రక్చరల్ ప్లాటూస్, హోమోక్లైనల్ రిడ్జ్స్‍తో కూడి వుంటుంది. ఈ ప్రాంతం గుండా కృష్ణా మరియు తుంగభద్రా నదులు ఉత్తరంలో పారుతవి.
ఈ ప్రాంతంలో రెడ్ శాండీ సాయిల్, బ్లాక్ సాయిల్స్ కలవు. సీస్‍మిక్ స్టడీ ప్రకారం ఈ జిల్లాలోని ప్రాంతం జోన్-1గా నిర్ధారించబడినది. ఈ జిల్లా యొక్క పశ్చిమ ప్రాంతంలో ఆర్‍క్యన్ పీరియడ్‍కు చెందిన గ్రానైట్ నైసెస్, మిగ్మటైట్స్, గ్రానిటాయిడ్స్ని చూడగలము. వీటిని పెనిన్‍సులర్ నైసిక్ కాంప్లెక్స్ యొక్క శిలలుగా నిర్ధారించబడినది. ఈ నైసిక్ కాంప్లెక్స్లో మధ్య మధ్యలో పొడుగాటి, సన్నటి గ్రీన్ స్టోన్ బెల్‍ట్స్ గద్వాల, జోన్నగిరి ప్రాంతాలలో ధార్‍వార్ సూపర్ గ్రూప్‍కు చెందినవి. వీటిలో మెటావాల్కానిక్స్, బయోటైట్ -క్టోరైట్ శిస్ట్, ఆంఫిబొలైట్, హార్న్ బ్లెండ్ శిస్ట్, బ్యాండెడ్ ఫెర్రుజినస్ క్వార్ట్జైట్, అగ్లామరైట్ మరియు అల్‍ట్రాహాఫిక్స్ కలవు. ఉత్తర ప్రాంతంలో పి.జి.సి మరియు శిస్ట్ శిలలో పొటాషియం రిచ్ గ్రానైట్స్ని చూడగలము. ఇవి వీటిలో ఇన్‍ట్రూసివ్స్గా నిర్ధారించారు మరియు క్లోస్‍పెట్ గ్రానైట్‍తో కొరిలేట్ చేయబడినది. పశ్చిమ ప్రాంతంలో బేసిక్‍డైక్స్, కార్ట్జ్‍వీన్స్ NW-SE, NE-SW దిశలలో విస్తరించియున్నవి. కడప సూపర్‍గ్రూప్‍కు చెందిన సెడిమెంటరీ శిలలు పి.జి.సి. పైన అన్‍కన్‍ఫర్మబుల్‍గా విస్తరించినవి. ఈసెడిమెంటరీ శిల్‍ల్లో కంగ్లామరేట్, క్వార్ట్జైట్ శేల్, లైమ్‍స్టోన్, డోలమైట్ మరియు చెర్ట్ కలవు. వీటితో పాటు బేసిక్ వాల్‍కానిక్ ఫ్లోస్, సిల్స్ కూడా ఉన్నది. ఈ శిలలు మీసో ప్రోటిరోజోయిక్ పీరియడ్‍కు చెందినవి. వీటిపైన కర్నూల్ గ్రూప్‍కు చెందిన నియొ ప్రొటిరో జోయిక్ సెడిమెంట్స్ అన్‍కన్‍ఫర్మెబుల్‍గా ఉన్నవి. వీటి శిలలు క్వార్ట్జైట్ లైమ్‍స్టోన్ మరియు శేల్. ఈ ప్రాంతంలో ముఖ్యమైన స్ట్రకచర్స్ ఫోల్‍డ్స్, ఫాల్టస్. కడప సెడిమెంట్స్లో డబ్లీప్లంజింగ్ యాంటిక్లైన్స్, సిన్‍క్లైన్స్ని తూర్పు ప్రాంతంలో చూడగలము. ఈ శిలలన్నిటి గుండా వెళ్తున్న ఘని – కాల్వ వెల్దుర్తి ఫాల్ట్ ENE-WSWదిశలో చూడగలము.
ఖనిజ సంపద: ఈ జిల్లాలో గోల్డ్, డైమండ్, ఫ్లక్స్గ్రేడ్ లైమ్‍స్టోన్, డోలమైట్, కాపర్, స్పెకులర్ హెమటైట్, ఫాస్‍ఫోరైట్ ఓకర్స్, బెరైటీస్, డైమెన్‍శన్ స్టోన్స్ నిక్షేపాలు పుష్కలంగా కలవు.
గోల్డ్: ఈ బంగారు నిక్షేపాలు 25 కి.మీ. పొడవు 5 కి.మీ. వెడల్పు గల జొన్నగిరి శిస్ట్ బెల్ట్లో సల్ఫైడ్‍తో కూడిన క్వార్ట్జ్ వీన్స్లో చూడగలము. ఈ వీన్స్ మెటాబసాల్ట్, మెటా రయో డయో సైట్, శియరడ్ గ్రానోడైయొరైట్ మరియు మెటాటుఫ్స్లో కలవు. ఈ ప్రాంతంలో పురాతన మైనింగ్ సైట్స్ కలవు. దోనా టెంపుల్ బ్లాక్ జొన్నగిరికి ఈశాన్యంలో వున్నది. ఈ బ్లాక్‍లో గోల్డ్ నిక్షేపాలు 1700 మీటర్ల పొడవు 1.13 మీటర్ల వెడల్పుగల జోన్‍లో 0.64 నుండి 6.58 గ్రామ్స్ పర్‍టన్ గోల్డ్ కలదు.
దోనా ఈస్ట్ బ్లాక్‍లో గోల్డ్ శియర్డ్ గ్రానో డయో రైట్‍లో గోల్డ్ మినరలైసేశన్ ఉన్నట్టు నిర్దారించారు. జి.ఎస్.ఐ వీటి నిక్షేపాలు 7.77Mt, 1.79g/tచొప్పున 31.2 మీటర్ల తిక్‍నెస్‍తో 180 మీటర్ల లోతు వరకు వున్నట్టు నిర్ధారించబడినది. దోనా నార్త్ బ్లాక్‍లో 0.0098Mt, 3.92g/t చొప్పున 1.81 మీ తిక్‍నెస్‍తో 335 మీటర్ల పొడవు గల ప్రాంతంలో ఉన్నట్టు నిర్ధారించారు జి.ఎస్.ఐ. దోనా సౌత్ బ్లాక్‍లో 1.104Mt గ్రేడ్ 1.16 నుండి 6.28g/t 1.22 మీ నుండి 5.38 మీటర్ల తిక్‍నెస్‍తో 170మీ నుండి 480 మీ పొడవు గల జోన్‍లో గోల్డ్ నిక్షేపాలు కలవు. జొన్నగిరికి ఉత్తరంలో ఒక కొత్త శిస్ట్ జోన్ అస్పరి ప్రాంతంలో కనుగొన్నారు. జి.ఎస్.ఐ. ఈ జోన్ 3.5 కి.మీ. పొడవు, 2.7 కి.మీ. వెడల్పు గల జోన్‍లో గోల్డ్ వ్యాల్యుస్ 30ppbనుండి 451ppbవరకు ఉన్నట్టు నిర్ధారించారు. గద్వాల శిస్ట్బెల్ట్కు దక్షిణంలో చెట్లమల్లాపురం ప్రాంతంలో కొన్ని వ్యాలూస్‍లో గోల్డ్ 2జూజూఎ మరియు కాపర్ 2.6 శాతం ఉన్నట్టు నిర్ధారించారు.
డైమండ్: తుంగభద్రా కింబర్ లైట్ ఫీల్డ్ ఈ జిల్లాలో రాయి చూరు కింబర్‍లైట్ ఫీల్డ్ (RKF)కు 25 కి.మీ. దక్షిణంలో ఉన్నది. ఈ జోన్‍లో ఏడు పైప్స్ మంత్రాలయం, బాగాపురం, నడిగడ్డ, మల్కాపూర్, ఎమ్మిగనూరు ప్రాంతాలలో కనుగొన్నారు జి.ఎస్.ఐ.
పురాతన డైమండ్ మైన్ వర్కింగ్స్ బంగనపల్లి కంగ్లామరేట్, క్వార్ట్జైట్‍లో చూడగలము. రెండు ప్రముఖమైన కంగ్లామరేట్ బెల్ట్లు ఎక్కడైతే పురాతన మైన్ సెట్స్ 1) 30 కి.మీ. పొడవుగల బనగానపల్లి – నేరెడు చెర్ల ప్రాంతంలో మరియు 2) రామల్లకోట-యాంభవి ప్రాంతంలో కలవు. ఇవి కాకుండా ఇరత ముఖ్యమైన ప్రాంతాలు బనగానపల్లి, వజ్రగిరి, మునిమడుగు, రాచర్ల, గట్టిమనికొండ, రామల్లకోట, బాలాపూరు, పెండెకల్లు, విరాయపల్లి, యాంభవి మరియు తిమ్మరాజిపల్లి. కృష్ణానది బ్యాంక్స్లో పంచలింగ మరుగట్టి వద్ద గ్రావెల్స్లో మరియు కుందేర్‍వేలి, హంద్రీనదిలో సాగిలేరు నది ప్రాంతాలలో డైమండ్స్, గ్రావెల్స్లో రికవర్ చేసినట్టు రిపోర్ట్ చేయబడినది.
లైమ్‍స్టోన్: ఈ జిల్లాలో సిమెంట్‍గ్రేడ్ లైమ్‍స్టోన్ నిక్షేపాలు పుష్కలంగా నార్జి ఫార్మేషన్‍లో ఉన్నవి. ప్రముఖమైన ప్రాంతాలు ఔక్- బోగసముద్రం, పాన్యం, బనగానపల్లి, బేతంచర్ల, శివరామపురం, మల్యాల, కోయిలకుంట్ల, యెన్నకొండ్ల, జలదుర్గం, జి.ఎస్.ఐ. అంకిరెడ్డిపల్లి ప్రాంతంలో ఫ్లక్స్గ్రేడ్ లైమ్‍స్టోన్ మరియు సిమెంట్‍గ్రేడ్ లైమ్‍స్టోన్ నిక్షేపాలలో 42 నుండి 53 శాతం CaO 2శాతం MgO, 16 శాతం Sio2, Aio3 , 2 నుండి 4 శాతం Fe2O3 తో కూడి యున్నది. ఈ బెల్ట్ 25 కి.మీ. వెడల్పు, 25 కి.మీ. పొడవుగల బెల్ట్లో ఉన్నది.
డొలమైట్: డొలమైట్ నిక్షేపాలు వెంపల్లి పార్మేశన్‍లోని డొలమైటిక్ లైమ్‍స్టోన్‍లో దొరుకుతుంది. ఈ నిక్షేపాలు డోన్‍కు వెల్‍దుర్తి ప్రాంతాల మధ్య కలవు. ఫ్లక్స్ గ్రేడ్ డోలమైట్ నిక్షేపాలు మల్కాపురం, చిన్న మల్కాపురం, కోలమలపల్లి సంగమేశ్వరం వద్ద వున్నవి.
కాపర్: వీటి నిక్షేపాలుENE-WSW ట్రెండింగ్ ఘని కాల్వా ఫాల్ట్ ప్రాంతంలో క్వార్ట్జ్ వీన్స్లో తాడిపత్రి, ఘుని, కాల్వా పరిసరాలలో 1.37 శాతం కాపర్ 100 మీటర్ల లోతు వరకు ఉన్నట్టు మరియు వీటి రిజర్వు 0.43 Mtగా నిర్ధారించారు.
స్పెకులర్ హెమటైట్: ఐరన్ ఓర్ స్పెకులర్ హెమటైట్ రూపంలో మేజర్ ఫాల్ట్ జోన్‍లో కడప సూపర్‍గ్రూప్‍కు చెందిన శిలల్లో వెల్దుర్తి, రమళ్ళకోట ప్రాంతాలలో దొరుకుతుంది. ఇక్కడ 50-60 శాతం Fe తో 3.7Mtరిజర్వు ఉన్నట్టు నిర్ధారించారు.
ఫాస్‍ఫొరైట్: ఈ ఫాస్‍ఫోరైట్ నిక్షేపాలు చెలిమా, పచ్చెర్ల, పచగుండాలు, అహోబిలం ప్రాంతాలలో దొరుకుతుంది. నల్లమలై గ్రూప్‍కు చెందిన కుంభం ఫార్మేశన్‍లోని శేల్, డొలమైట్ యొక్క బేసల్ పొర్శన్స్లో దొరుకుతుంది. ఫాస్‍ఫొరైట్ గ్రే కలర్‍లో పెల్లెట్స్, ఫ్రాగ్‍మెంట్స్, స్ట్రోమాటోలైటిక్, నాడులర్, పెబ్లీ, లామినేటెడ్ రూపంలో ఉంటుంది. ఈ జోన్ 30 కి.మీ. పొడవు, 0.1 నుండి 2.5 కి.మీ థిక్‍నెస్‍తో ఉన్నది. P2o5 శాతం 14 నుండి 28 వరకు వున్నది.
ఓకర్స్: వీటి నిక్షేపాలు మల్కాపురం వద్ద వెంపల్లి డొలమైట్‍తో కూడియున్నది. మరియు ఐరన్ ఓర్‍తో వెల్దుర్తి వద్ద పసుపు ఓకర్ ఔక్‍శేల్‍లో రామల్లకోట పరిసమిట్ల, బేతంచ్లె, అంబాపురం, కొర్టికుండా, నేరెడుచెర్ల దిగువపాడు, లొడ్డిపల్లి, పంగిడి పరుసుట్లా మరియు వుయ్యాలవాడ ప్రాంతాలలో దొరుకును. వీటి రిజర్వు 2 Mtగా నిర్ధారించారు.
బెరైటీస్ (BaSo4): ఈ ఖనిజం బేరియంకి ముఖ్యమైన సోర్స్ మరియు 65 శాతం BaSo4 తో కూడి ఉంటుంది. ఇది మాసివ్‍గా లేక క్రిస్టలైన్ రూపంలో ఉన్నది. దీని స్పెసిఫిక్ గ్రావిటి చాలా ఎక్కువ వుండడం వల్ల తొందరగా గుర్తు పట్టవచ్చును. వీటి నిక్షేపాలు చాలా వరకు వీన్‍టైప్, బెడ్డెడ్ మరియు రెసిడ్యుల్ రూపంలో దొరుకును. ఈ జిల్లాలో వెంపల్లి ఫార్మేశన్‍లో, పుల్లివెందుల క్వార్ట్జైట్‍లో మరియు పుల్లంపేట ఫార్మేశన్‍లో దొరుకుతుంది.
డైమెన్‍వన్ స్టోన్స్: ఈ జిల్లాలో డైమెన్‍శన్ స్టోన్ నిక్షేపాలు పుష్కలంగా కలవు. ఇందులో చాలా ప్రఖ్యాతిగాంచిన బేతంచెర్ల ఫ్లాగిలైమ్‍స్టోన్‍ని విస్త•తంగా క్వారీ చేస్తున్నారు. దీనిని కమర్షియల్‍గా కడప స్లాబ్ అని అందురు. దీనిని చాలా వరకు ఫ్లోరింగ్‍కి వాడతారు. వేంపల్లి డొలమైట్ కూడా క్వారీ చేస్తున్నారు. పింక్ గ్రానైట్, బిలెకల్లు, జొన్నగిరి, కృష్ణగిరి వద్ద క్వారీ చేస్తున్నారు.
- కమతం మహేందర్ రెడ్డి
90320 12955