అశోకుడు బౌద్ధ మతము స్వీకరించిన ప్రథమ శాసనం ఆంధప్రదేశ్‍లో!

అశోకుని శాసనములు రమారమి 40 కలిగి ఉన్నాయి. ఈ శాసనంలు 50 విభిన్న ప్రదేశములలో ప్రత్యేకించి ఈ శాసనములను ఆంధ్ర, కర్ణాటక Hnn ఒరిస్సా, ఉత్తరప్రదేశ్‍, బీహార్‍, ఢిల్లీ, నేపాల్‍, మధ్యప్రదేశ్‍ మరియు పాకిస్తాన్‍ నందు సైతం గమనించగలము.
అశోకుడు ధర్మ మహామాత్రులు, స్త్రీ మహా మాత్రులు, అరణ్య మహామాత్రులు, నాగలక మహామాత్రులు, రాజుకులు మరియు యుక్తులు అన్న రకాల వారీగా విభజన చేసి వారికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ పక్రియలో భాగంగా, అధికారులు (సేనాధిపతులు, మహామాత్రులు) అశోకుని ఆజ్ఞలననుసరించి పర్వతాలపైన రాళ్లపైన మరియు స్తంభాలపైన అశోకుని ఆదేశాలను తెలియపరిచినారు. ఈ పక్రియలో భాగంగానే కర్నూలు జిల్లా పత్తికొండ నియోజక వర్గానికి చెందిన రాజుల మందగిరి గ్రామము నందు గల గుట్టపైన అశోకుని ఆదేశాలను లిఖించినారు. సామ్రాట్‍ అశోకుడు బౌద్ధమును స్వీకరించినట్టు తెలిపే తొలి శాసనం రాజుల మందగిరి నందు కలదని తెలియుచున్నది. అశోకుని శాసనంలను Minor rock edicts (MRE-1)గాను Major Rock edicts(MRE-2) గాను, pillar edits, queen edicts మరియు ప్రత్యేక శాసనములు గాను గమనించగలము.
ఈ శాసనంల ద్వారా అశోకుడు తన రాజ్యాభిషేకం అయిన రెండున్నర సంవత్సరముల తర్వాత బౌద్ధ మతం స్వీకరించినాడని తెలుస్తుంది. స్వీకరించినప్పటికీ ఏమాత్రము శ్రద్ధ వహించలేదని ఈ శాసనము ద్వారా అర్థం అవుతుంది.

కర్నూలు జిల్లా నందలి పత్తికొండ నియోజకవర్గం నకు 5.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజుల మందగిరి నందలి గుట్టమీద ఉన్న Minor Rock edit ద్వారా తెలుస్తుంది. భారతదేశంలో, అశోకుడు బౌద్ధ మతము స్వీకరించినాడని తెలిపే తొలి శాసనం ఇదే. ఇటువంటి రాతి శాసనములను రాజుల మందగిరి నందే గాక కర్నూలు జిల్లా నందలి పత్తికొండకు సమీపమున గల ఎర్రగుడి నందు సైతం గమనించగలరు. అశోకుని శాసనంలను ఆంధప్రదేశ్‍ రాష్ట్రము నందు, కర్నూలు జిల్లాలో గల పత్తికొండ నియోజకవర్గంలో మాత్రమే చూడగలము. అదేవిధంగా ఇటువంటి శాసనములను కర్ణాటక రాష్ట్రం నందలి Maski, Brahmagiri మరియు Siddapur నందు గమనించగలము.
అశోకుడు తన అభిషేకం అయిన రెండున్నర సంవత్సరముల తర్వాత 256 రాత్రులలోనే, ధర్మంతో ఉండాలని నిశ్చయించుకున్నాడని అర్థమవుతుంది. అంతేకాకుండా కలింగ యుద్ధం తర్వాత మరింతగా ధర్మంతో స్థిరపడ్డాడని తెలుస్తుంది. భిక్షువులు, భిక్షునీలు మరియు గృహస్తులు అందరు కూడా ధర్మవచనాలను తరచుగా వినాలి మరియు ఆచరించాలి అని ఆజ్ఞాపించాడు. ఎవరు చదివి, విని మరియు ఆచరిస్తారో వారు ధర్మంలో స్థిరపడతారు అని శాసనముల ద్వారా ఆజ్ఞాపించారు.

మునిగాథలు, మౌనియస్థితి ఉపతిస్స ప్రశ్నలు మరియు ధర్మ గాథలు అందరికీ చేరేలా చూడాలని ఈ ధర్మ శాసనాలను పర్వతాల యందు రాతిగుట్టల యందు ఏర్పాటు చేయాలని అధికారులకు, సేనాధికారులకు మరియు మహామాత్రులకు అశోకుడు ఆదేశించారు. ఇటువంటి రాతి శాసనంను రాజుల మందగిరి నందు గమనించవచ్చు.
ప్రత్యేక శ్రద్ధ వహించకపోవడం వల్ల రాతి మీద చెక్కబడి ఉన్న బ్రాహ్మిలిపి అక్షరాలు కనపడకుండా పోతున్నాయని గ్రామస్తులు తెలియజేస్తున్నారు. సామ్రాట్‍ అశోకుడు బౌద్ధమతం స్వీకరించినట్టుగా తెలియజేసే ప్రథమ శాసనం రాజుల మందగిరి లో ఉండడం గర్వంగా భావిస్తున్నట్టు ఈ ప్రాంతము ప్రజలు తెలియచేస్తున్నారు. అంతేకాకుండా రాజుల మందగిరి గుట్టలో అద్భుతమైన పురాతనమైన శివాలయములను గమనించవచ్చు. భిన్నమైనటువంటి సూర్య విగ్రహం వీరుల శిలలను అనేకములైన నాగులను గమనించగలం. ఇదే గుట్టకు ఎదురుగా ఉన్న కొండమీద అప్పటి రాజుల కోట లాంటి నిర్మాణం సైతం కూడా చూడగలము. మరెన్నో రాక్‍ షెల్టర్స్ను కలిగి రాతియుగ మానవుని ఉనికి సైతం తెలుపుతున్న ఈ ప్రాంతము పర్యాటకాభివృద్ధి చేయవలెనని అందరూ కోరుకుంటున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *