సెలవురోజు, వీకెండ్ వచ్చిందంటే చాలు.. అందమైన పర్యాటకం.. అనురాగాల ప్రయాణం అంటూ.. నగరవాసులు విహార యాత్రలకు జై కొడుతున్నారు. ఉరుకులు.. పరుగుల జీవన ప్రయాణంలో ఇల్లూ.. ఆఫీసుల మధ్య పనుల ఒత్తిడితో సతమతమయ్యే ఉద్యోగులు.. కాసేపు ప్రకృతి ఒడిలో ఓలలాడుతున్నారు. మరీ కొత్త ప్రదేశాలకు వెళ్లి ఇబ్బందులు పడకుండా.. కాస్త పరిచయం ఉన్న చోట్లకే టూర్లు వేసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి ఒక్కరోజులో చూడగల పర్యాటక ప్రాంతాలను వీక్షించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

శామీర్‍పేట్ లేక్..
హైదరాబాద్ శివారు ప్రాంతమైన శామీర్‍పేట్ సికింద్రాబాద్‍కు 20 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఎన్నో విలాసవంతమైన రెస్టారెంట్లు, హోటళ్లు ఉన్నాయి. ఇక్కడ ఉన్న జింకల పార్క్లో జింకలతో పాటు నెమళ్లు, అనేక రకాల పక్షులు కనిపిస్తాయి..
కొండపోచమ్మ:

నూతనోత్తేజాన్ని నింపే అత్యుత్తమ క్యాంపింగ్ ప్రదేశంగా దీనిని చెప్పవచ్చు. హైదరాబాద్‍కు 50 కిలో మీటర్ల దూరంలో ఉంది. సిద్దిపేట జిల్లాలో ఉన్న ఈ రిజర్వాయర్ అందాలు ప్రత్యేకం. వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఇక్కడ క్యాంపింగ్ చేసేందుకు అధిక శాతం పర్యాటకులు ఆసక్తి చూపుతారు.

అనంతగిరి
ట్రెక్కింగ్ కోరుకునే వారికి అనంతగిరి స్వర్గధామం. వికారాబాద్‍కు కేవలం పది కిలోమీటర్లు.. హైదరాబాద్‍కు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. అనంతగిరి కొండల చుట్టుపక్కల ఉన్న అటవీ ప్రాంతం.. నిర్మలమైన వాతావరణం పర్యాటకులను ఆకర్షిస్తోంది.ప్రాచీనమైన అనంతగిరి పద్మనాభ స్వామి ఆలయాన్ని కూడా దర్శించుకోవచ్చు.
దక్కన్న్యూస్
ఎ : 9030 6262 88