భాగ్యదాయిని బతుకమ్మ


బతుకమ్మ పండుగ తెలంగాణ మహిళల గౌరవం, ఐక్యత, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా తొమ్మిది రోజులు పూలతో ఘనంగా జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటిని పూలతో నింపి.. మహిళ గుండెల్లో గర్వాన్ని, ఆనందాన్ని కలిగించే పండుగ బతుకమ్మ. భాద్రపద మాసంలో మొదలై తొమ్మిది రోజుల పాటు సాగే ఈ వేడుక తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. రంగురంగుల పూలను పేర్చి అందంగా అలంకరించిన బతుకమ్మల చుట్టూ స్త్రీలు వలయంగా తిరుగుతూ చప్పట్లు కొడుతూ పాటలు పాడుతారు. మహిళల ఆనందం, ఆధ్యాత్మికత, సాంస్క•తిక వైభవం కలిసిన ఈ పండుగను వెయ్యి ఏళ్ల నుంచే జరుపుకుంటున్నారని పండితులు చెబుతున్నారు.
బతుకమ్మ పండుగ భూమి, నీరు మరియు జీవుల మధ్య సంబంధాన్ని సూచించే పండుగ. బతుకమ్మల తయారీలో ఉపయోగించే పువ్వులు జలచరాల పెరుగుదలను సుసంపన్నం చేస్తాయి. అంతేకాకుండా, ఈ పువ్వులు నీటి వనరులను శుభ్రపరచడం మరియు రిఫ్రెష్‍ చేయడంలో, కాలుష్యాన్ని తగ్గించడంలో, ఎక్కువ నీటిని నిలుపుకోవడానికి సరస్సులు, చెరువులను బలోపేతం చేయడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. సహజ మంచినీరు తగ్గిపోయి అంతరించిపోతున్న కాలంలో, తెలంగాణ ప్రజలు దానిని సంరక్షించడానికి వారి స్వంత మార్గాన్ని కలిగి ఉన్నారు. ఇది నిజంగా తెలంగాణ ప్రజలు గర్వించే విషయం. కాలుష్యం నుండి నీటిని ఆదా చేసే పక్రియను వారు స్వాభావికంగా తెలుసుకుంటారు. దానిని ఆనందదాయకంగా చేస్తారు.
బతుకమ్మ పండుగ తెలంగాణకు అస్తిత్వ చిహ్నంగా మారింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పండుగ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర పండుగగా అధికారిక గుర్తింపు పొంది అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఒకప్పుడు గ్రామాల్లో మహిళలతో ప్రారంభమైన ఈ వేడుక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ప్రజలు ఉన్న ప్రతి చోటా ఘనంగా నిర్వహిస్తున్నారు.

తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ప్రతి రోజు ప్రత్యేక నైవేద్యం చేసి గౌరీ దేవికి సమర్పిస్తారు.
మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ,
రెండో రోజు అటుకుల బతుకమ్మ,
మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ,
నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మ,
ఐదో రోజు అట్ల బతుకమ్మ,
ఆరో రోజు అలిగిన బతుకమ్మ,
ఏదో రోజు వేపకాయల బతుకమ్మ,
ఎనిమిదో రోజు వెన్న ముద్ద బతుకమ్మ,
తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ జరుపుకుంటారు.
ఎనిమిది రోజులు ప్రత్యేక నైవేద్యాలు చేస్తారు.

కానీ అలిగిన బతుకమ్మ రోజు మాత్రం ఎటువంటి సంబరాలు జరగవు. నైవేద్యం పెట్టరు. ఎందుకంటే ఆరోజు అమ్మవారు అలిగారని నమ్ముతారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *