August

కొండా లక్ష్మణ్‍ బాపూజీ

ఆచార్య కొండా లక్ష్మణ్‍ బాపూజీ ప్రజల మనిషి.స్వాతంత్య్ర సమరయోధుడు.ప్రముఖ గాంధేయవాది.నిజాం రాజ్యం నుండి ఎదిగిన జాతీయ నాయకుడు.ఆయన వ్యక్తిత్వం విశిష్టమైనది.జీవిత లక్ష్యాలు మహోన్నమైనవి.పదవులకోసం ఎన్నడూ అర్రులు చాచని ధీరోదాత్తుడుఆచార్య కొండా లక్ష్మన్‍ బాపూజీ జీవితం తెరిచిన పుస్తకం.కొండా లక్ష్మణ్‍ కేవలం రాజకీయ నాయకుడు కాదు. అనేక సామాజిక రంగాల్లో కృషి చేసిన ఉద్యమకారుడు.కొండా లక్ష్మణ్‍ బాపూజీ లాలాలజపతిరాయ్‍, మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్‍ బి.ఆర్‍. అంబేద్కర్‍, గాంధీజీల వారసుడు.కొండా లక్ష్మణ్‍బాపూజీ తన యవ్వన కాలంలో భగత్‍సింగ్‍, సుభాష్‍ …

కొండా లక్ష్మణ్‍ బాపూజీ Read More »

వజ్రాలు కాని వజ్రాలు

(గత సంచిక తరువాయి)HPHT వజ్రాలు:1954 లో జనరల్‍ ఎలక్ట్రిక్‍ (GE)కి చెందినTracy Hall అనే శాస్త్రవేత్త అధిక పీడనం,(10 GPA)అధిక ఉష్ణోగ్రత (2000 డిగ్రీల సెల్సియస్‍) వద్ద గ్రాఫైట్‍ ను కరిగించి ఒక చిన్న 0.15 మి.మీల వజ్రాన్ని తయారు చేసినట్లు సమాచారం. 1970 నుండి రత్నాల గ్రేడ్‍ వజ్రాలను ఈ పద్ధతిలో తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పక్రియను ఆధునీకరించి 25 కారట్ల పరిమాణంలో కూడా HPHT వజ్రాలను తయారు చేస్తున్నారు. డీబీర్స్ వారు కృత్రిమ …

వజ్రాలు కాని వజ్రాలు Read More »

‘‘స్వంత కథ’’

(గత సంచిక తరువాయి)మా తాత ముత్తాతల వారసుడినైన నాకు సహజంగానే సంచారకాంక్ష అబ్బింది. చాలా చిన్నప్పుడే నన్ను ‘‘రోడ్లు’’ ఆకర్షించాయి. అవి ప్రాణమున్న ప్రాణుల్లాగే కనబడేవి. ఈ పొడవైన, అందమైన ‘‘సడక్‍’’లు ఎంత దూరం ఇట్లా వెళ్లుతాయన్న జిజ్ఞాస నాకు కలిగేది. అట్లా అకారణంగా ఏ పనిలేకున్నా సడక్‍ల మీద గాలి గాలిగా తిరిగే అలవాటు మొదలయ్యింది. మా అమ్మ చేతిలో చింత బరిగె పట్టుకుని నన్ను వెదుకుతూ బయలుదేరేది. కవి అజంతా అన్నట్లు రోడ్లకు నా …

‘‘స్వంత కథ’’ Read More »

చెదరని జ్ఞాపకం, మధుర స్మృతులుఆగస్టు 19న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

ఫోటోగ్రఫీ అంటే..ఫోటో అంటే చిత్రం..గ్రఫీ అంటే గీయడమని అర్థం అన్నమాట.మనిషి జీవిన శైలిలో ప్రతీరోజు ఓ మధుర జ్ఞాపకం. 24గంటల్లో మన జీవితంలో సరదాలు, సంతోషాలు, వీటిలో కొన్ని అప్పటికప్పుడు మరచిపోయేవి, మరికొన్ని జీవితాంతం భద్రంగా దాచుకోవాల్సినవి. ఈకరిగే కాలంలో చెదిరిపోని స్మృతులకు ప్రతిబింబాలు ఫోటోలు. ఈ కరిగేకాలంలో చెదిరిపోని స్మృతులకు ప్రతిబింబాలే మన ఫోటోలు. అనాటి మధుర జ్ఞాపకాలను మళ్లీ మళ్లీ తనివితీరా వీక్షించేందుకు అవకాశాలను ఇచ్చే తీపిగుర్తులు ఫోటోలు. మనం మాట్లాడే మాటలు, పదాలు …

చెదరని జ్ఞాపకం, మధుర స్మృతులుఆగస్టు 19న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం Read More »

మనదేశపు తొలి హారీతీకంచు బొమ్మనందించిన తెలంగాణా

తెలంగాణా రాష్ట్రం, జోగులాంబ-గద్వాల జిల్లా, ఆముదాలపాడులో బాదామీ చాళుక్య మొదటి విక్రమాదిత్యుని సా.శ.660 నాటి రాగిరేకు శాసనం దొరికింది. అందులో బాదామీ చాళుక్యులు తాము ‘మానవ్యస గోత్రాణాం హారీతీ పుత్రాణాం సప్తలోక సప్తమాతృరభి వర్థితాణామ్‍’ అని చెప్పుకొన్నారు. ‘హారీతీ పుత్రాణాం’ అన్న సమాసంలోని హారీతీ ఎవరు? తెలుసుకోవాలంటే బౌద్ధంలోకి తొంగి చూడాలి. రాజగృహానికి చెందిన హారీతి, పంచికుని భార్య. చాన్నాళ్లు ఆమెకు పిల్లలు పుట్టక పోయేసరికి, తోటి స్త్రీలు ఆమెను గేలి చేసేవారు. తట్టుకోలేని హారీతి, చుట్టుపక్కల …

మనదేశపు తొలి హారీతీకంచు బొమ్మనందించిన తెలంగాణా Read More »

అంతరించిపోతున్న ఏనుగులుఆగస్టు 12న ప్రపంచ ఏనుగుల దినోత్సవం

భూమి మీద భారీ జంతువు ఏనుగు. మనిషి జీవన విధానం.. ఏనుగు జీవన విధానం దాదాపు ఒకేలా ఉంటాయి. అందరితో ప్రేమగా కలిసిపోయే ఏనుగులు భావోద్వేగాలను కలిగి ఉంటాయి. అంతేకాదు తెలివి, జ్ఞాపకశక్తి కూడా ఎక్కువే. దంతాల కోసం, ఇతర శరీర భాగాల కోసం ఏనుగులను చంపేయడంతో ఏనుగుల సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతుంది. ఏనుగులకోసం ఒక దినోత్సవం ఉంటే వాటి రక్షణపై అవగాహన పెరుగుతుందన్న ఉద్దేశ్యంతో కెనడాలోని కెనజ్వెస్ట్ పిక్చర్స్ చిత్ర నిర్మాతలు ఏనుగుల సంరక్షణ ప్రచారకులు …

అంతరించిపోతున్న ఏనుగులుఆగస్టు 12న ప్రపంచ ఏనుగుల దినోత్సవం Read More »

యుద్ధం, కాలుష్యం, ఆకలి =పర్యావరణం

ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను కొందరు అత్యంత సరళంగా వివరించగలుగుతారు. అందుకు వారి క్షేత్రస్థాయి అనుభవం, ఆలోచన దూరదృష్టి ఎంతగానో ఉపకరిస్తుంది. పర్యావరణ ఉద్యమ నేత సుందర్‍లాల్‍ బహుగుణ ఒక సందర్భంలో వ్యాఖ్యనిస్తూ మానవాళి ప్రబల శత్రువులుగా మూడింటిని పేర్కొన్నారు. యుద్ధం, కాలుష్యం, ఆకలి ఇవే ప్రపంచానికి హానికారకాలు ముఖ్య శత్రువులు అంటాడు బహుగుణ. అయితే ఈ మూడింటికి ఒకదానితో ఒకటి ముడవడి, విడదీయలేనంతగా దృఢంగా ఉంటాయి. ప్రజలు తమకు ఉన్నదానికంటే మరింత మరింత కావాలనే ఒక విచక్షణా …

యుద్ధం, కాలుష్యం, ఆకలి =పర్యావరణం Read More »

గగన్‍ యాన్‍ మిషన్‍కు ముందు నూతనోత్తేజం@ యాగ్జియం-4

ఎవరో ఒకరు… ఎపుడో అపుడు, నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు… మొదటివాడు ఎప్పుడు ఒక్కడేమరి, మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి…!! అన్న సుకవి మాటలు భారతీయ వ్యోమగామి శుభాంశుశుక్లాకు అతికినట్లు సరిపోతాయి. ఎప్పుడో 41 సం।।రాల కిందట ఇండియా నుండి తొలిసారి రాకేశ్‍శర్మ అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చిన తరువాత, యాగ్జియం-4 మిషన్‍ద్వారా మళ్ళీ ఇన్నేళ్ళకు అంతరిక్షంలోకి వెళ్ళిన రెండవ భారతీయుడిగా, ఇంటర్నేషనల్‍ స్పేస్‍స్టేషన్‍ (ఐఎస్‍ఎస్‍)లో అడుగిడిన తొలి ఇండియన్‍గా, మొత్తం మీద 634 …

గగన్‍ యాన్‍ మిషన్‍కు ముందు నూతనోత్తేజం@ యాగ్జియం-4 Read More »

బ్రిటీష్‍ సైన్యాన్ని ఓడించినప్రిన్స్ ముబారిజుద్దౌలా!

తెలంగాణ… హైదరాబాద్‍ నగరం.. రాజ్యం… తవ్విన కొద్దీ కొత్త మణులు, చారిత్రక వైఢూర్యాలు, సాంస్కృతిక రత్నాలను, సాహిత్య కెంపులను అందించే విలువైన నిక్షేపాలున్న నిధి. ఒకప్పుడు ఇది ‘కోహినూరు’కు ప్రసిద్ధి. ఇప్పుడు ఈ ప్రాంతం అంతకన్నా గొప్పదైనా చారిత్రక వారసత్వానికి వారధి. హైదరాబాద్‍ నగరం గురించి పర్షియన్‍, ఉర్దూ, ఇంగ్లీషు, తెలుగు, మరాఠీ, కన్నడ భాషల్లో.. శిలా శాసనాల్లో, రాగి రేకుల్లో, తాళపత్రాల్లో ఎంతో చరిత్ర నిక్షిప్తమై ఉన్నది. కుతుబ్‍షాహీల కాలం నుంచి ఫ్రెంచ్‍, డచ్‍, బ్రిటీష్‍, …

బ్రిటీష్‍ సైన్యాన్ని ఓడించినప్రిన్స్ ముబారిజుద్దౌలా! Read More »