అనేక బాధలను తట్టుకున్న మానవజాతి : కె.బి.గోపాలం
సైన్స్ రచయిత కె.బి.గోపాలం గారితో కోవిడ్-19పై ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రముఖ సైన్స్ రచయిత, అనువాదకులు కె.బి.గోపాలం డిగ్రీ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేసి, తరువాత ఆకాశవాణిలో సైన్స్ ఆఫీసర్‍గా, అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్‍గా, స్టేషన్ డైరెక్టర్‍గా, డిప్యుటీ డైరెక్టర్‍గా వివిధ హోదాలలో హైదరాబాదు, ఆదిలాబాదు, న్యూఢిల్లీ కేంద్రాలలో పనిచేశారు. కరోనా విపత్తుపై మే మాసంలో దక్కన్ ల్యాండ్‍కు వారు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలోని కొన్ని ముఖ్యాంశాలు. కరోనా సమయంలో మీకు కలిగిన ఆలోచనలు, అంతర్మథనాలు ఏమిటి?దీనిమీద ఒక పుస్తకం రాయాలి. రెండు లక్షల సంవత్సరాల నాడు మానవ జాతి పుట్టింది. …