మన రామప్పకు విశ్వమంతా గుర్తింపు
ప్రపంచ వారసత్వ కట్టడంగా ఎంపికకాకతీయుల కళావైభవానికి యునెస్కో గుర్తింపు రాళ్లలో పూలు పూయించిన అలనాటి శిల్పి అపురూప కళాఖండమైన రామప్ప అస్తిత్వం నేడు అంతర్జాతీయంగా వైభవోపేతమైంది. భారతీయ శిల్ప కళాచరిత్రలో అతి విలక్షణమైన స్థానాన్ని చాటిన శైలి కాకతీయ శిల్పానిది. ఈ శైలిలో కూడా మరింత విశిష్టమైనది రామప్ప. రామప్ప గుడిగోడల రమణీయ మంజరులని మహాకవులు కీర్తించిన మదనికలు.. లలిత కళాభిమానులను మంత్ర ముగ్ధులను చేశాయి. ఈ శిల్ప సౌందర్యం ఒకరికి కవిత్వానుభూతి కలిగిస్తే.. మరొకరి హృదయంలో …








