January

చరిత్రలో వెలుగు చూడని చీకటి కోణాలు

(గత సంచిక తరువాయి)
నాసిర్‍జంగ్‍ హత్యకు గురైన తర్వాత ఫ్రెంచ్‍ కంపెనీ వారు ఏడునెలలుగా నాసిర్‍జంగ్‍ ఖైదులో ఉన్న ముజఫ్ఫర్‍ జంగ్‍ (?-1751)ని విడుదల చేసి రాజుగా ప్రకటిస్తారు. దీంతో ముజఫ్ఫర్‍ జంగ్‍ తనకు అండగా నిలిచిన ఫ్రెంచ్‍ కంపెనీకి జింజి, తిరువత్తి తదితర ప్రదేశాలను జాగీర్లుగా దారాదత్తం చేసిండు. నిజాం తర్వాత అంతటి బలవంతుడు …

చరిత్రలో వెలుగు చూడని చీకటి కోణాలు Read More »

ఓయూలో రాతి పనిముట్లు, నాణేలు, శిలాజాల ప్రదర్శన

చరిత్ర పూర్వ యుగం నాణాలు, శిలాజాల ప్రదర్శన అమోఘం : ప్రిన్సిపాల్‍ ప్రొ. డి.రవీందర్‍


చరిత్ర పూర్వ యుగం, చారిత్రక యుగానికి సంబంధించిన ముఖ్య పనిముట్లు, నాణాలు, శిలాజాలను ప్రదర్శనలో ఉంచడం వల్ల విద్యార్థులకు ఎంతో ఉపయోగం ఉంటుందని ఆర్టస్ కళాశాల ప్రిన్సిపాల్‍ ప్రొఫెసర్‍ డి.రవీందర్‍ అన్నారు. ఓయూ ఆర్కియాలజీ విభాగం ఆధ్వర్యంలో చారిత్రక పూర్వయుగానికి …

ఓయూలో రాతి పనిముట్లు, నాణేలు, శిలాజాల ప్రదర్శన Read More »

వాసన


ఒక్కమాట చాలు
వాసన పసికట్టడానికి.
అది అవసరమో
ఆప్యాయతో
ఆనందమో
అవ్యాజమో
చప్పున స్ఫురిస్తుంది.

పరిమళం పువ్వులనుంచే రాకపోవచ్చు
ఆకాశం నుండి రాలే వాన చినుకులు
భూమిని ముద్దుపెట్టుకునేటప్పుడు
లేచే మృత్తికాసౌరభం కావచ్చు,
తోటంతా ఉక్కిరిబిక్కిరౌతూ
సమిష్టి భావనలు నిండిపోవచ్చు
కాని ఇవేవీ కావు.

అది రింగ్‍టోనో
ఎస్‍. ఎం. ఎస్సో
వాట్సాపో
చివరికి ఈ

వాసన Read More »

అరబ్బీ మురబ్బా ‘బార్కాస్‍’

ఒక తాతీల్‍ (సెలవు) దినం పురుసత్‍గ చార్మినార్‍కు వెళ్లండి. అక్కడ చార్మినార్‍ చల్లని చత్రచ్ఛాయలలో ఒక పాత సైకిలు సీటు వెనుక త్రాళ్లతో కట్టిన గుండ్రటి వెదురు గంపలో దోరగా మగ్గిన జాంపండ్లను పెట్టుకుని, నడుముకు తోలు బెల్టుతో ఎగగట్టిన ఎర్ర గళ్లలుంగీని గట్టిగా బిగించి కట్టుకుని, నోటినిండా ఎర్రని పాన్‍ నములుతూ మధ్యలో తుపుక్‍, …

అరబ్బీ మురబ్బా ‘బార్కాస్‍’ Read More »

పర్యావరణం – శాస్త్రం – నైతికత – తాత్విక దృక్పథాలు

ర్యావరణ సంక్షోభం – నైతికత

21వ శతాబ్ది ప్రారంభం నుండి మానవాళి మునుపెన్నడూ లేని విధంగా పర్యావరణ విషయంగా అనేక సమస్యలను, సవాళ్ళను ఎదుర్కొంటూ వస్తున్నది. మానవ చరిత్రలోనే ఇవి Unprecedented గా ఉన్నాయి. ఈ సవాళ్ళన్నీ మానవ కార్యకలాపాల ద్వారా ఉత్పతన్నమైనవే. భూమిపై జీవుల, జీవరాశులు పెద్దయెత్తున అంతరింపులకు గురవుతూ వస్తున్నవి. 65 …

పర్యావరణం – శాస్త్రం – నైతికత – తాత్విక దృక్పథాలు Read More »

నానీలు

నగరవాసుల
ధమనులు
సిరిలల్లో
నిర్విరామ జన ప్రవాహం

ఒకప్పుడు
అన్నం మెతుకుపై మన పేరు
మరి ఇప్పుడో
ట్యాబ్‍ లెట్లపై

భూమాత
గుండెల్లో దింపిన
ఇనుప స్ట్రాలు
బోరింగ్‍ మిషన్లు

కెరటాలు
కాళ్ళ కింది ఇసుకను
లాగేస్తున్నాయి
నమ్మక ద్రోహిలా !

రోజూ దసరా పండగే
నడక దారిలో
పాలపిట్ట
దర్శనం !


-కంచనపల్లి రవికాంత్‍

నానీలు Read More »

ప్రక్షాలన…


చీకటి ముసిరింది మొదలు
తూరుపు తెల్లారుదాకా…
చెత్తా చెదారం చేరిపి
దుమ్ము ధూళి దులిపి
నల్లటి రోడ్ల ‘‘చంద్రబింబం’’లా మెరిపిస్తారు

వంచిన నడుము ఎత్తక
వీధుల ‘‘చిత్తడి’’ ఊడ్చి
కడిగిన ‘‘ముత్య’’మల్లే మార్చుతారు

ముక్కు పుటాలు అదిరే
మురికి కాల్వ ‘‘కుళ్లును’’ ఎత్తిపోసి
పరిశుభ్రత చేకూరుస్తారు

కాలలతో నిమిత్తం లేక
చలి మంచులో ‘‘నెగళ్లై’’ రగులుతారు

ప్రక్షాలన… Read More »

రాజేశ్వరపురం శాసనం

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని గ్రామం రాజేశ్వరపురం. ఇక్కడ వీరగోపాలస్వామి దేవాలయంలో నిలబెట్టివున్న 15 అడుగుల ఎత్తు, 3అడుగుల వెడల్పు 6అంగుళాల మందమున్న రాతిబండ (పలక,సలప)మీద రెండువైపులా శాసనం చెక్కివుంది. ఈ శాసనంలో 12మంది వ్యక్తుల పేర్లు పేర్కొనబడ్డాయి. వీరిలో మొదటిపేరు కోటకేతన. కోట వంశస్తులు కాకతీయుల సామంతులే కాదు వారి బంధువులు కూడా. వీరి …

రాజేశ్వరపురం శాసనం Read More »

తెలంగాణ చరిత్రను నిర్భయంగా చెప్పిన ధీశాలి బి.ఎన్‍.శాస్త్రి

తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్‍ డా.నందిని సిధారెడ్డి

తెలంగాణ వివక్షతకు గురైనప్పుడు తెలంగాణ చరిత్రను నిర్భయంగా, నిరంతరంగా చెప్పిన ధీశాలి బి.ఎన్‍.శాస్త్రి అని తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్‍ డా.నందిని సిధారెడ్డి కొనియాడారు. ఉన్నదాన్ని ఒప్పుకోక ఘర్షణ పడి చరిత్రను రచించిన వారే చరిత్రకారులని, ఈ కోవలోకే చెందినవారు బి.ఎన్‍.శాస్త్రి అని ఆయన చెప్పారు. తెలంగాణ …

తెలంగాణ చరిత్రను నిర్భయంగా చెప్పిన ధీశాలి బి.ఎన్‍.శాస్త్రి Read More »

స్వప్న శైధిల్యం

చూపులు వేలాడుతున్నప్పుడు
అడుగులు తడబడుతున్నవి
మరకలంటించుకొని జ్ఞానం పుస్తకాల్లోంచి
ఎగిరిపోయింది
ఆలోచనలు చుక్కల దారుల వెంట
నీటి ధారలే కనపడని వింత
దారుల విస్తరణ మరింత ఇరుకవుతుంది
చీకటి వేళ చీకటినే ముట్టించే
కన్ను ఎక్కడో మాయమయ్యింది
చేతుల కింద చురకత్తులు పరిహసించబడి
రాలుతున్న పూలకు ఉరేసుకున్నవి
ఎగురేసుకు పోయిన జెండాలు
పొలిమేరలు దాటంగనే వలలైపోయినవి

స్వప్న శైధిల్యం Read More »