మునులగుట్ట – రెండు శాసనాలు
శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాలకు సమీపాన మొక్కట్రావుపేటలో శాతవాహన చక్రవర్తి శాతకర్ణి కొడుకు హకుసిరి శాసనం దొరికింది. ఈ మధ్యనే ఆ శాసన సారాంశం వెలుగు చూసింది. ఈ గ్రామంలోనే పెద్దగుట్టగా స్థానికులు పిలుచుకునే ‘పెద్దగుట్ట’, చరిత్రకారులు రాసిన పేరు మునులగుట్ట’ మీద 5 కాదు 6 రాతిపడకలున్న రాతిగుహ వుంది. ఇది జైనులస్థావరమని పివి పరబ్రహ్మశాస్త్రి వంటి చరిత్రకారులు, కాదు బౌద్ధుల వస్సా (వర్షా) వాసమని కుర్రా జితేంద్రబాబు మొదలైన చరిత్రకారుల అభిప్రాయాలున్నాయి. కాని, పెద్దపల్లివాసి …









