బంజారా తీజ్ పాటల్లో బంధుత్వ మాధుర్యం
తెలంగాణ జనాభాలో లంబాడీలది 6శాతం. వీరు జరుపుకునే పండుగల్లో ప్రధానమైనది తీజ్. వర్షాకాలం ఆరంభంలో తొమ్మిది రోజులపాటు జరుపుకునే ఈ పండుగలో కన్నె పిల్లలు వ్యవసాయం, కుటుంబ పోషణ గురించి తెలుసుకుంటారు. ఈ సందర్భంగా రోజూ పాడుకునే పాటలను ఇప్పటికే ఆచార్య సూర్యధనంజయ్, డా. కె. పద్మావతిబాయి దక్షిణ తెలంగాణ ప్రాంతంలోను, డా. జనపాల శంకరయ్య ఉత్తర తెలంగాణ ప్రాంతంలోను సేకరించి ప్రచురించారు. ఆ పాటలకు భిన్నంగా ఆదిలాబాద్ జిల్లా నార్మూర్ మండలంలో పాడే పాటల్లో బంధుత్వ …







