వరహాల భీమయ్య
పుణ్యదంపుతులు శ్రీ వరహాల రాజన్న, శ్రీమతి అంబక్కగార్ల ఏకైక పుత్రుడు వరహాల భీమయ్యగారు. 1911, అక్టోబర్‍లో ఆయన జన్మించారు. మంథనిలో 7వ తరగతి వరకు విద్యాభ్యాసము చేసి, 8వ తరగతి కరీంనగర్‍లో, 9,10 తరగతులు హన్మకొండలో పూర్తి చేసారు. హైద్రాబాదులోని సిటీ కళాశాల నుండి ఇంటర్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.ఉస్మానియా యూనివర్శిటీ నుండి బి.ఎస్సీ తర్వాత రసాయనశాస్త్రంలో ఎం.ఎస్సీ, పట్టా సంపాదించారు. ఉస్మానియా యూనివర్శిటీ నుండి ఫస్టుర్యాంకు సంపాదించి గోల్డ్మెడల్ స్వంతం చేసుకొన్నారు. వీరు కరీంనగర్ హైస్కూల్లో టీచరుగా …