ఆనందాంబ
పూర్వ కవుల చరిత్ర తెలుసుకోవాలంటే వారు రాసిన గ్రంథావతారికలు గానీ, వారి గురించి ఇతరులు తెలిపిన విషయాలే ప్రమాణాలు. విద్యయే మృగ్యమై ఉన్న నైజాం రాష్ట్రంలో తెలంగాణలోని మారుమూల గ్రామంలో పుట్టిపెరిగిన ఆణిముత్యం ఆనందాంబ. బాలకవయిత్రి, అష్టావధాని పన్నెండేళ్ల కాలంలో 1934వ సంవత్సరంలో 28 పుటాల పద్యకావ్యం ‘సతీలలామ’ పేరుతో ఆనందాంబ రచించారు. అంతకుముందే వెలమవీర, మాదవ పంచాసత్ కావ్యాలు రాసినట్టు గోల్కొండ కవుల సంచికలో పేర్కొనబడింది.ఉపోద్ఘాతంలో ఈమెను గురించి విద్వాన్ వెంకట నృసింహాచార్య శాస్త్రిగారు స్వయాన ఆమె గురువు సిరి శెనహల్ …