Day: March 1, 2022

హైదరాబాద్‍ మహానగరంలో ఇక సాఫీ సడక్‍లు

పలు ప్లై ఓవర్లు, అండర్‍ పాస్‍లు, జంక్షన్‍లు కొత్తగా రైలు వంతెనల నిర్మాణానికి చర్యలు గ్రేటర్‍లో 3 ఆర్‍యూబీలు.. 6 ఆర్‍ఓబీలు సిగ్నల్‍ ఫ్రీ సిటీగా మారనున్న గ్రేటర్‍ హైదరాబాద్‍ మునిసిపల్‍ శాఖ మంత్రి కేటీఆర్‍ మహానగరంలో ట్రాఫిక్‍ చిక్కులు లేని ప్రయాణాల కోసం ఇప్పటికే వ్యూహాత్మక రహదారుల పథకం (ఎస్సార్‍డీపీ) ద్వారా పలు ఫ్లై ఓవర్లు, అండర్‍పాస్‍లు, జంక్షన్ల అభివృద్ధి వంటి పనులు చేస్తున్న జీహెచ్‍ఎంసీ ఆయా ప్రాంతాల్లో రైలు ఓవర్‍ బ్రిడ్జీలు (ఆర్‍ఓబీలు), రైలు …

హైదరాబాద్‍ మహానగరంలో ఇక సాఫీ సడక్‍లు Read More »

అద్భుతమైన ప్రకృతి సౌందర్యం సుందర్‍బన్స్ జాతీయ ఉద్యానవనం 1987లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు•

సుందర్‍బన్స్ జాతీయ ఉద్యానవనం పశ్చిమ బెంగాల్‍ రాష్ట్రంలోని సౌత్‍ 24 పరగనాస్‍ అనే ప్రాంతంలో దాదాపు 1,355 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ ఉద్యావనానికి సుందర్‍బన్‍ అనే పేరు సుందర్బన్‍ అనే మడ చెట్టు నుండి వచ్చింది. ఈ ఉద్యానవనాన్ని 1984లో జాతీయ ఉద్యానవనంగా ప్రకటించారు. ఈ ఉద్యానవనం 1973లో సుందర్బన్‍ పులుల సంరక్షణ కేంద్రంగా, 1977లో వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతంగా, మే 4, 1984న దీనిని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించారు. 1987లో యునెస్కో ప్రపంచ వారసత్వ …

అద్భుతమైన ప్రకృతి సౌందర్యం సుందర్‍బన్స్ జాతీయ ఉద్యానవనం 1987లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు• Read More »

చారిత్రాత్మక కళారూపం బాతిక్‍ పెయింటింగ్‍

బాతిక్‍ పెయింటింగ్‍ అత్యంత అందమైన, చారిత్రాత్మక కళారూపం. బాతిక్‍ పెయింటింగ్‍లు బట్టల ముక్కలపై గీసిన వివిధ బొమ్మలు, నమూనాలతో కూడిన కళ యొక్క అద్భుతమైన రూపాన్ని సూచిస్తాయి. ఈ పెయింటింగ్‍ల కళానైపుణ్యం ఇండోనేషియాలో పుట్టింది. బాతిక్‍ పెయింటింగ్‍ అంటే ‘బట్టలపై చుక్కలు’ అని అర్థం. బాతిక్‍ వస్త్రాలలో ఉపయోగించే మైనపు-నిరోధక రంగు సాంకేతికతను సూచిస్తుంది. ఈ కళ దాదాపు రెండు వేల సంవత్సరాల నాటిది. జావా (ఇండోనేషియా), భారతదేశం, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో బాతిక్‍ ఆర్ట్ వర్క్ …

చారిత్రాత్మక కళారూపం బాతిక్‍ పెయింటింగ్‍ Read More »

దక్కన్‍ ల్యాండ్‍ చర్చ మానవత్వం, మతసహనం, మర్యాద… వన్నె తెచ్చిన దక్కన్‍ సంస్కృతి

ఎంత చెప్పినా తరిగిపోని అంశాలు చరిత్రలో కొన్ని ఉంటాయి. ఆ జ్ఞాపకాల ఊటలు అలా ఊరుతూనే ఉంటాయి. దక్కన్‍ సంస్కృతి కూడా తెలంగాణలో ప్రధానంగా భాగ్యనగరంతో, దాని ఐదు శతాబ్దాల చరిత్రతో ముడిపడినప్పటికీ, అంతకు ముందు కొన్ని వేల ఏళ్ళ చరిత్ర కూడా దానిలో అంతర్భాగంగానే ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఇందులో కలగలసిపోయి దానికొక విశిష్టతను సంతరింపజేశాయి. ఒకటి కాదు, రెండు కాదు.. పదుల సంఖ్యలో నగరాల, దేశాల భిన్న సంస్కృతులు తెలంగాణలో …

దక్కన్‍ ల్యాండ్‍ చర్చ మానవత్వం, మతసహనం, మర్యాద… వన్నె తెచ్చిన దక్కన్‍ సంస్కృతి Read More »

ఎడారుల చిరుగాలి వాణి సూఫీ సంగీతపు రారాణి రేష్మాకు నివాళి

గాలి దూమారాల మధ్య హోయలు పోయే ఇసుక తిన్నెల మధ్య స్వరధారలా సాగిపోయిన ఆ గొంతు అప్పుడే ఆగిపోయింది. అక్షరమంటే తెలియని ఆమె తన స్వరలయలతో తరతరాల భారత ఉపఖండపు సూఫీయోగుల మార్మికతా మర్మాలు అలవోకగా తను గాత్రపు చాలులో మొలకలెత్తి అనామకుల ఆత్మలను తట్టిలేపేవి. పాటలు కట్టేది ఆమే.. పాడేది ఆమే. ఆధునికార్ధంలో చెప్పుకుంటే ఆమె గొప్ప సూఫీ గీత రచయిత, సుస్వరాల సంగీతపు రారాణి. ఆమెది ప్రాచీన సుఫియానా (భారతదేశ సుఫీ మత యోగుల …

ఎడారుల చిరుగాలి వాణి సూఫీ సంగీతపు రారాణి రేష్మాకు నివాళి Read More »

వన్యప్రాణుల రక్షణ అందరి బాధ్యత!

మార్చి 3న వన్యప్రాణుల దినోత్సవం అంతరించిపోతున్న జంతువులు, మొక్కలపైన అవగాహన పెంచడానికి, వాటిని రక్షించడానికి మార్చి 3న ప్రత్యేకంగా కార్యక్రమం చేపడతారు. భూమి లెక్కలేనన్ని జీవజాతులకు, వృక్షజాలానికి నిలయం. మనం పీల్చే గాలి, తినే ఆహారం, మనం ఉపయోగించే శక్తి, వంటి అనేక ఇతర ప్రయోజనాల కోసం మొక్కలు, జంతువులపై ఆధారపడి ఉన్నాం. మనకు అవసరమైన పదార్థాలన్నీ ప్రకృతి నుంచి పొందుతున్నాం.అయితే రోజు రోజుకీ పెరుగుతున్న మానవ అవసరాలు వాతావరణ కాలుష్యం జీవ జాతులు, సహజ వనరులను …

వన్యప్రాణుల రక్షణ అందరి బాధ్యత! Read More »

ఒక్కో చుక్కా ఒడిసి పడితేనే.. భవితకు భరోసా

మార్చి 22న ప్రపంచ జల దినోత్సవం సమస్త జీవకోటికి ప్రాణాధారం జలం. జలం లేనిదే జీవం లేదు. నీరు లేకుంటే ప్రాణి మనుగడ ప్రశ్నార్థకమే. ఈ క్రమంలో ప్రపంచానికి ప్రతీ నీటిబొట్టు విలువ తెలియాలి. ప్రాణంతో సమానంగా నీటిని జాగ్రత్తగా చూసుకొని వాడుకోవాలి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో నీటి కరువు తాండవిస్తోంది. నీరు చేతినిండా ఉన్నప్పుడు దుర్వినియోగం చేస్తే భవిష్యత్‍ తరాలకు నీటికొరత అతి త్వరలోనే వచ్చే ప్రమాదముంది. ఈ క్రమంలో నీటి ప్రాధాన్యతను …

ఒక్కో చుక్కా ఒడిసి పడితేనే.. భవితకు భరోసా Read More »

రచనల నిషేధాలూ – భావ ప్రకటన స్వేచ్ఛ

పలానా రచనల వల్ల కొందరి మనోభావాలు దెబ్బతింటున్నాయి. అందుకని ఆ పుస్తకాన్ని నిషేధించండి. ఆ పత్రిక ప్రతులని జప్తు చేయండి అని చాలా మంది అంటూ వుంటారు. క్రిమినల్‍ కేసులు కూడా మరి కొంతమంది దాఖలు చేస్తున్నారు. భౌతిక దాడులు కూడా చేస్తున్నారు.రాజ్యాంగం మన దేశ పౌరులందరికీ భావ ప్రకటనా స్వేచ్ఛని ప్రసాదించింది. దానికి కొన్ని పరిమితులు వున్నాయి. ఆ పరిమితుల్లో ఏదైనా రచన చేసినప్పుడు కూడా కొన్ని రచనలని నిషేధించాలన్న డిమాండ్‍ వస్తూ వుంటుంది. ఇలాంటి …

రచనల నిషేధాలూ – భావ ప్రకటన స్వేచ్ఛ Read More »

శ్రీ ఉత్పత్తి పిడుగు’ శాసించేదేమిటి?

తెలుగునాట కనిపించే శాసనాలలో నామక శాసనాలది ప్రత్యేకస్థానం. కేవలం పేర్లు మాత్రమేకదా ఇవి శాసనాలా అని పెదవి విరిచే శాసనవేత్తలకు కూడా సవాలు విసురుతాయి కొన్ని లేబుల్‍ లేఖనాలు. రాజుల ఆజ్ఞలు, దానాలు, యుద్ధాలు, ప్రశస్తులు మాత్రమే కాదు శాసనాలు. చిన్నదైనా, పెద్దదైనా, పదమైనా, పదంలో ఒక ముక్కైనా, ఐదు, పది నుంచి వందల పంక్తుల శాసనాలైనా వాటిలోని విషయం, కాలాలకే ప్రాధాన్యత. రాజుల వివరాలు తెలిపే శాసనాలు చరిత్ర కాలక్రమణికకు ఎట్ల పనికొస్తాయో, ఒకప్పటి సామాజిక …

శ్రీ ఉత్పత్తి పిడుగు’ శాసించేదేమిటి? Read More »

యక్షగానం – భాషా సారస్వతాలు

‘‘కావ్యేషు నాటకం రమ్యమ్‍’’ అని చెప్పినట్లుగా జానపదకళా రూపాల్లో యక్షగానం రమ్యమైనది. నేటికీ గ్రామాల్లో ఆడబడుతున్న అచ్చమైన జానపదకళారూపం. యక్షగాన ప్రదర్శనల వలన సామాన్య ప్రజలకు తెలుగుభాష పట్ల ఆసక్తి పెరిగింది. యక్షగానాల ప్రభావంతో రామాయణ, భారత, భాగవత, పురాణ, చారిత్రక కథలు ప్రాచుర్యాన్ని పొందాయి.ప్రపంచంలోని ప్రతి మానవుడు తన ఆలోచనలను, ఇతరులకు తెలపడానికి, ఇతరుల ఆలోచనలను తెలుసుకోవడానికి ఉపయోగించే సాధనమే భాష. భాష ప్రవాహం లాంటిది. కొత్త కొత్త పదాల్ని తనలో ఇముడ్చుకుంటుంది. మానవుడు భాషను …

యక్షగానం – భాషా సారస్వతాలు Read More »