మట్టిలేనిదే మనుగడలేదు ‘సేవ్-సాయిల్’
మట్టిలేనిదే మనుగడలేదు. మట్టి సమస్త వనరులకు పుట్టినిల్లు. మనం ఉపయోగించే వస్తువులన్నీ ఈ మట్టినుంచీ, దానిలో దాగున్న రకరకాల ఖనిజాల నుంచే తయారవుతున్నాయి. నేల రేణువుల సముదాయం. ఈ రేణువుల నిర్మాణాలు నీరు, గాలి, మట్టి సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి. మట్టి వివిధ ప్రాంతాలలో వివిధ రకాల రేణువుల నిర్మాణంతో వుంటుంది. సేంద్రియ పదార్థం, నిరాకార ఖనిజ పదార్థం కూడా నేల మట్టి కణాలలో ప్రధాన భాగాలు. మట్టిలోని ఈ వైవిధ్యమే జీవరాసుల మనుగడకు జీవం పోస్తున్నది. …