నదులను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిది


ఫోరం ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍ చైర్మన్‍ మణికొండ వేదకుమార్‍
‘వరల్డ్ రివర్స్ డే’’ సందర్భంగా ‘మూసీ రివర్‍ ఫ్రంట్‍ వాక్‍’


నదులు కలుషితం కాకుండా కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఫోరం ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍ చైర్మన్‍, అర్బన్‍ అండ్‍ రీజినల్‍ ప్లానర్‍ మణికొండ వేదకుమార్‍ అన్నారు. ప్రపంచ నదుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫోరం ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍, డెక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో సాలార్‍జంగ్‍ మ్యూజియం వద్ద ‘మూసీ రివర్‍ ఫ్రంట్‍ వాక్‍’ నిర్వహించారు. ఈ వాక్‍ సాలార్జంగ్‍ మ్యూజియం ఎదురుగా మొదలై, మూసీనది దక్షిణ తీరం వెంబడి శివాజీ వంతెన వరకు కొనసాగింది. అనంతరం చారిత్రాత్మక మూసీ నది ప్రాముఖ్యతను తెలిపే ఫోటో ఎగ్జిబిషన్‍ నిర్వహించారు.


ప్రపంచ నదుల దినోత్సవం (World Rivers Day): ప్రపంచ నదుల దినోత్సవాన్ని అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన నదుల పరిరక్షకుడు, బ్రిటిష్‍ కొలంబియా నదుల దినోత్సవం ( BC Rivers Day ) మరియు ప్రపంచ నదుల దినోత్సవం ( World Rivers Day ) వ్యవస్థాపకుడు Mr. మార్క్ ఏంజెలో ప్రారంభించారు. Mr . మార్క్ ఏంజెలో 1980లో పశ్చిమ కెనడాలో మొదలుగా BC Rivers Dayని ప్రారంభించారు. తర్వాత 2005లో ప్రపంచ నదుల దినోత్సవాన్ని మొదటి ప్రపంచ ఈవెంట్‍గా ప్రారంభించారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం సెప్టెంబర్‍ నాల్గవ ఆదివారంను ‘‘ప్రపంచ నదుల దినోత్సవం’’గా ప్రపంచమంతా జరుపుకుంటున్నారు. సుమారు 100 దేశాలు ఈ దినోత్సవంలో పాల్గొంటున్నారు. ప్రపంచ నదుల దినోత్సవం ప్రపంచ జలమార్గాలను పునరుద్ధరించదానికి మరియు మన నదుల యొక్క అనేక విలువలను, చారిత్రక ప్రాముఖ్యతను తెలియ చేయడానికి, వాటి రక్షణ మరియు పునరుద్ధరణపై ప్రజల అవగాహనను పెంచడానికి కృషి చేస్తుంది.


ఈ సందర్భంగా Er.వేద కుమార్‍ మణికొండ, చైర్మన్‍, ఫోరమ్‍ ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍ మాట్లాడుతూ దేశంలో అనేక నదుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని, గత కొన్ని దశాబ్దాల కంటే నదులు మరింత కలుషితం అవుతున్నాయని అన్నారు. ప్రస్తుతం ప్రవహిస్తున్న అనేక నదులు కాలువలుగా మారాయన్నారు. నదులను కలుషితం కాకుండా కాపాడటానికి ప్రజల్లో అవగాహన పెంచే అనేక కార్యక్రమాలు ఫోరం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్‍ పూర్వపు ప్రధాన నీటి వనరైన మూసీ నది చారిత్రక ప్రాముఖ్యత, విలువలను తెలియ చేయడానికి, వాటి రక్షణ, పునరుద్ధరణపై ప్రజలకు అవగాహన పెంచడానికి ఈ వాక్‍ ఏర్పాటు చేశామన్నారు. కెనడాలోని వరల్డ్ రివర్స్ డేతో కలిసి ఫోరమ్‍ ఫర్‍ ఏ బెటర్‍ హైదరాబాద్‍ గత సంవత్సరం కూడా ప్రపంచ నదుల దినోత్సవాన్ని నిర్వహించిందని గుర్తు చేశారు. ఫోరం ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను వరల్డ్ రివర్స్ డే వ్యవస్థాపకులు మార్క్ ఏంజెలో అభినందనలు తెలిపినట్లు చెప్పారు. నీటి మార్గాలు మన జాతీయ ఆర్థిక వ్యవస్థకు జీవనాధారాలని, జలమార్గాలను పునరుద్ధరించడం మరియు వాటి అభివృద్ధి దేశపు ఆర్థిక, పారిశ్రామిక వృద్ధి,జీవనోపాధి మరియు పర్యాటకాన్ని ఉత్తేజపరుస్తుంది.నీటి మార్గాల ద్వారా కనెక్ట్ అవ్వడం అంటే, 5 ప్రకృతి మూలకాలలో నీటి ద్వారా మనం ప్రజలకు, వారి అభివృద్ధికి కార్యాచరణ ద్వారామరింత దగ్గరగా ఉంటాము అని తెలిపారు.


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ.కె.చంద్రశేఖర్‍ రావు రాష్ట్ర అవసరాలు ముఖ్యంగా నీటిపై దృష్టి సారించి, దృఢ సంకల్పంతో, పుష్కలమైన కాల్వలతో నీటి రవాణాకు, పంట నీటిపారుదల, జలవిద్యుత్‍, తాగునీటి సరఫరా, తెలంగాణలోని అన్ని జిల్లాల్లోని కరువు పీడిత ప్రాంతాలకు నీటి సరఫరా మొదలైన ప్రయోజనాలకు ఉపయోగపడే ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ-ప్రయోజకరమైన లిఫ్ట్ ఇరిగేషన్‍ ప్రాజెక్టు కాళేశ్వరం నిర్మాణాన్ని చేపట్టి సాధించారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి, టూరిజం,ప్రజలకు ఉపాధి కల్పించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేక ఇతర మార్గాలను అభివృద్ధి చేయడానికి అంతర్జాతీయ నీటి నిపుణుల సలహాలను తీసుకోవడం ద్వారా దీనిని మరింత ఫలవంతంగా ఉపయోగించుకోవచ్చు.తద్వారా నదులను బహుళ ప్రయోజనాలకు వినియోగించుకోవడంలో తెలంగాణ నంబర్‍ 1గా నిలుస్తుంది.


వచ్చే ప్రపంచ నదుల దినోత్సవానికి లోపల, ఆయన డెక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ తరపున నిపుణులు మరియు సంబంధిత పౌరులతో కలిసి, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నదులను సందర్శించి, మన రాష్ట్ర నీటి మార్గం ద్వారా అభివృద్ధి కార్యకలాపాల కోసం వివిధ నావిగేషన్‍ కాన్సెప్ట్లను పరిశీలించి తెలుసుకోవాలని ప్లాన్‍ చేస్తున్నారని తెలిపారు.


ఈ సందర్భంగా ఇతర వక్తలు మూసీ నది పుట్టుక స్థలం మరియు పరివాహక ప్రాంతాలు, మూసీ నది ప్రాముఖ్యతపై మాట్లాడారు.
ఈ వాక్‍లో సీనియర్‍ జర్నలిస్ట్ ఎస్ రామకృష్ణ,EXCEL INDIA, ఫోరమ్‍ సభ్యులు వేణుగోపాలరావు, పి.నరహరి, ఎండీ. అఫ్జల్‍, సుదర్శన్‍ రెడ్డి, ఆదర్శ్, పర్యావరణవేత్తలు, మూసీ రివర్‍ డెవలప్మెంట్‍ కార్పొరేషన్‍ ప్రతినిధులు,AINAPUR FOUNDATION, AMAN VEDIKA, APSA, SAVE GOLCONDA, SRD Rainbow Home, SCSE సంఘాల నుంచి కార్యకర్తలు, ఆఫ్జల్‍ గంజ్‍ ఎస్‍ఐ వి.రాంబాబు, కళాశాల, పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సామాజిక సంఘాలు, పాల్గొన్నారు.

  • దక్కన్‍న్యూస్‍,
    ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *