బృహత్సంహితలో భూగర్భజలాల ఉనికి


ఒక ప్రాంతంలో సహజ పరిస్థితులలో పెరిగే వృక్షజాతులు మరియు నివసించే జంతు సమూహాలు ఆ ప్రాంతంలో దొరికే భూగర్భజలాల ఉనికిని సూచిస్తాయా? ఈ ప్రశ్నకు సమాధానం ఔను అని చెప్పవచ్చు.
ఈ విషయంలో వరాహమిహిరుడు (క్రీ.శ. 505-587) రచించిన బృహత్సంహితలో వివరించటం జరిగింది. వృక్ష సమూహాల లక్షణాలు 15అడుగుల నుంచి 562 అడుగుల వరకు ఉండే భూగర్భజలాల ఉనికిని తెలియజేస్తాయని చెప్పబడింది. ఈ పరిశీలనలు సెమి ఎరిడ్‍, ఏరిడ్‍ వాతావరణంకు సంబంధించినవి. వరాహమిహిరుడు ఉజ్జయిని ప్రాంతంలో జీవించాడు.


వరాహమిహిరుడి రచనలు జర్మన్‍, ఆంగ్ల భాషలలో తర్జుమా చేయబడ్డాయి. బృహత్సంహితలో 54వ అధ్యాయం ‘డకార్గళం’ 125 శ్లోకాలలో భూగర్భజలాల ఉనికికి అక్కడి జంతు, వ•క్ష జాలాలకు ఉన్న సంబంధాలను వివరిస్తుంది.
భూగర్బజలాల ఉనికిని సూచించే ‘హైడ్రో ఇండికేటర్‍’ లక్షణాలను బట్టి ఏ దిశలో, ఎంత లోతులో నీరు ఉండవచ్చు అన్న అంశాలను వివరించటం జరిగింది.


చిన్న జంతువులైన చేపలు, సరీస•పాలు, ఎలుకలు, పాములు, తాబేళ్ళు, ముంగిసలు, తేళ్ళు తక్కువ లోతులో ఉండే భూగర్భజలాల ఉనికిని తెలియజేస్తాయని వివరించబడింది.
భట్టాలపాలుడు ఈ బృహత్సంహితను వివరిస్తూ దాని కొలతలు హస్తాలు (18అంగుళాలు), పురుష (7అడుగుల 6 అంగుళాలు)గా పేర్కొనటం జరిగింది.
భూగర్భజల సూచికలైన వృక్షాలు వాటి తల్లివేర్లు భూగర్భజలాలవైపుగా వెళ్తాయని సూచించటం జరిగింది. అది ఒక్కొక్కసారి కాండం నుంచి కొన్ని అడుగుల దూరంగా కూడా వుండవచ్చు.


వృక్ష లక్షణాలు నీటి లభ్యత:

  • ఎక్కువగా ఎదిగిన పొట్టి వృక్షజాతులు వాటి కొమ్మలు క్రిందికి వంగి ఉన్నట్టయితే అక్కడ. పడమరగా 6 అడుగులలో నీరు 450 అడుగులలో ఉత్తరం వైపు ప్రవాహముగా ఉంటుంది.
  • తొర్రగా ఉండి, గరుకుగావున్న వృక్షాలున్న ప్రదేశంలో నీరు లేదని సూచిస్తుంది.
  • గడ్డిపుట్టనిచోట గడ్డి పాయలుగా ఉన్నచోట, బాగా గడ్డి ఎదిగే దగ్గర గడ్డిలేని పాయలున్నా అక్కడ నీరు ఉండదని అర్థం.
  • ముళ్ళులేని వృక్షాల మధ్య ముళ్ళచెట్లుగాని దానికి వ్యతిరేకంగా ముళ్ళ చెట్ల మధ్య ముళ్ళు లేని చెట్లుగాని ఉంటే దానికి 6అడుగుల లోపల 30అడుగులలోతున నీటి లభ్యత ఉంటుంది. పెద్దచెట్టుకొమ్మలు భూమి దగ్గరగా ఎదిగితే ఆ కొమ్మల కింద నీటిలభ్యతను సూచిస్తుంది. అసాధారణంగా ఉండే పూలు, పండ్లు కలిగినచెట్లు వాటికి తూర్పుదిశగా 30 అడుగుల లోపల నీటి ఉనికిని సూచిస్తాయి.
  • కంటకారి (ములుపుచ్చ) చెట్లు ముళ్ళు లేకుండా ఉండి తెల్లనిపూలు ఉంటే దాని క్రింద నీరు 26అడుగుల్లో దొరుకుతుంది.
  • ఖర్జూర, ఈత చెట్లు రెండు తలలతో ఉంటే దానికి పడమరగా 22 అడుగులలో నీరు ఉండవచ్చు.
  • కర్ణికార, పలాశ(మోదుగ)చెట్లు తెల్లపూలు కలిగి వుంటే దానికి దక్షిణంగా 15అడుగులలో జలాలు ఉండవచ్చు.
  • Glassy Vegitation లేదా పూర్తి తెలుపుబారిన పంట ఉన్నా అక్కడ జల లభ్యత దక్షిణముఖ 3 అడుగులలో 15 అడుగుల లోతులో నీరు అందుబాటులో ఉంది.
  • ముళ్ళతో కూడిన తెల్లని శమీ వృక్షాలు దానికి 562 అడుగుల లోతులో జలాలను సూచిస్తుంది. Glassy చెట్టు దానికి దక్షిణంగా 30 అడుగులలో నీటిని సూచిస్తుంది.
  • అసాధారణంగా కనిపించే వృక్షం గుబురుగా ఉన్న పచ్చని చెట్ల మధ్య వుంటే దానికి దక్షిణంగా 30 అడుగులలో నీరు ఉండవచ్చు.
  • పాలుకారే వృక్షాలు లేదా గాజు వంటి చెట్లు, పొదలు, లతలు దట్టంగా ఎదిగిన గుబురుగా ఉంటే దానికి దక్షిణంగా 30 అడుగులలో నీరు ఉంటుంది.
  • Course Shrubs మరియు తీగలు రంధ్రాలున్న ఆకులతో ఉంటే దానికి నీరు దూరంగా ఉందని సూచిస్తుంది.
  • పలాస, బదరీవృక్షాలకు పడమరగా 6అడుగుల లోపల 24 అడుగుల లోతులో నీటిలభ్యత ఉండవచ్చు. దానికి తోడుగా విషంలేని సర్పం అక్కడ ఉంటే నీరు తక్కువ లోతులో లభిస్తుంది.
  • బిల్వ మరియు ఉడుంబ వృక్షాలకు దక్షిణంగా 6అడుగుల దూరంలో 22అడుగుల లోతులో నీరు ఉండవచ్చు. అక్కడ నలుపు కప్పలు ఉంటే ఇంకా తక్కువ లోతులో నీరు
  • ఉండవచ్చు.
  • బదరీ రోహిత వృక్షాలు వాటి పడమరగా 120 అడుగులలో మంచినీరును సూచిస్తాయి. అక్కడ ముద్దగా ఉండే బంకమన్ను తేళ్ళు ఉన్నట్టయితే తక్కువ లోతులో నీరు
  • ఉండవచ్చు.
  • కరీర బదరీ వృక్షాలు వాటికి పడమరగా 135 అడుగుల లోతులో ఈశాన్యంగా ప్రవహించే ఎక్కువ నీటిలభ్యతలను సూచిస్తాయి.
  • పీలు, బదరీ వృక్షాలు వాటికి తూర్పుగా 6అడుగుల దూరంలో 150 అడుగుల లోతులో అంత రుచిగా లేని ఎక్కువ నీరును సూచిస్తాయి.
  • కుకుభ కరీర లేదా కుకుభ బిల్వ వృక్షాలు వాటికి దక్షిణంగా 6 అడుగులలో, 17 అడుగుల లోతుగా ఉండే ఎక్కువనీరు సూచిస్తాయి.
  • పలాశ, శమీ వృక్షాలు పడమరగా ఎక్కువలోతులో ఉండే నీటిని సూచిస్తాయి. అక్కడ, బురద మట్టి గులకరాళ్ళ, వాటిలో పాములు ఉంటే తక్కువ లోతులో నీరు లభిస్తుంది.
  • నిగ్రోధ, పలాశ మరియు ఉడుంబ లేదా నిగ్రోధ పిప్పల వృక్షాల పడుమరగా 450 అడుగుల లోతులో ఉత్తరదిశగా ప్రవహించే నీరు లభిస్తుంది.


Morphological and Physiological features of Plants as Hydrological indicators :
ఆధునిక పరిజ్ఞానం ప్రకారం కూడా సూచించే కొన్ని అంశాలు వరాహమిహిరుడు రెండు వేరు వేరు జాతుల చెట్లు పరస్సరం పెనవేసుకుని ఉంటే అది 25 నుంచి 450 అడుగుల లోతులో నీటి ఉనికిని సూచిస్తుంది అన్నాడు.


మర్రిచెట్టు లోపల తాటిచెట్టు, మర్రి రావిచెట్లు కలిసి వుండడం వీటికి ఉదాహరణలు.

  • Lianas (చెట్లపై పాకి ఎదిగే దట్టమైన తీగలు) నీటి ఉనికిని సూచిస్తాయి. ముఖ్యంగా ఇవి చెదలపుట్టలతో కూడి ఉన్నట్టయితే అక్కడ నీరు తప్పక లభిస్తుంది. చెదలు నీటిచెమ్మ ఉన్న దగ్గర పుట్టలను నిర్మించుకుంటాయి.
  • పొట్టివృక్షాలు, తెల్లనిగడ్డి ముఖ్యంగా దూర్వాగడ్డి పుట్టల పక్కన ఉంటే నీటిలభ్యత సూచిస్తుంది. తెల్లని బెరడు కలిగిన చెట్లు నీటిలభ్యత సూచిస్తుంది.
  • దట్టమైన ఆకులు ఏపుగా ఎదిగిన వృక్షాలు నీటి లభ్యత సూచిస్తాయి. ముడులున్న చెట్లు, తక్కువ ఎత్తులో ఎక్కువగా సాగిన కొమ్మలు కలిగిన చెట్లు నీటిలభ్యతను సూచిస్తాయి.
  • వరాహమిహిరుని పరిశీలనలు వాటి వివరణలు Empiricalగా ఉంటాయి. అవి పూర్తి శాస్త్రీయమైనవి అని చెప్పలేము. పైగా అవి మధ్య భారతదేశంలో పీఠభూమి ప్రాంతానికి పరిమితమైనవి. శుష్క, అర్ధశుష్క ప్రాంతాలలో సహజ పరిస్థితులలో ఉన్న వృక్షజాతులకు ఇది వర్తిస్తుంది. బహుశః జంతువుల విషయంలో ప్రస్తుతం ఇది అంతగా పనిచేయక పోవచ్చు.
  • ఇటీవలికాలంలో కొందరు భూవిజ్ఞాన శాస్త్రజ్ఞులు ఈ విషయాలను పరిశీలించారు. స్థానికంగా వృక్షజాతుల ఎదుగుదలకు నీటిలభ్యతకు సంబంధాలను గుర్తించారు.
  • తెలంగాణా ప్రాంతంలో మర్రిచెట్టులో తాటిచెట్టు ఉండటం, ఏపుగా ఎదిగిన ఒకదానితో ఒకటి పెనవేసుకున్న చెట్లు, దట్టంగా తీగెలు అలుముకున్న చెట్లు, చదలపుట్టలు నీటిలభ్యతను సూచించటం గమనించవచ్చు.
  • చెట్లకొమ్మలు నీటిలభ్యత ఎక్కువ ఉన్నవైపు పెరగడం కూడా మనం చూస్తాం. తల్లివేరు కాండం దిశ నుండి ఒకసారి దూరంగా పక్కకు జరిగి భూమిలోపలికి వెళ్ళటం కద్దు. ఇదికూడా ఆ దిశలో నీటి ఉనికిని సూచిస్తుంది.
  • గులకరాళ్ళు వాటిలో తొండలు గుడ్లు పెట్టటం, దానిమీద ఏడెగడ్డి (చీపురుపుల్లలు), భూత రాకాసి గడ్డి, దుబ్బ తుత్తురు పొదలు వంటివి భూగర్భజలాల లేమిని తెలియజేస్తాయి


భూగర్బజలవృక్షాలు:
భూగర్భజలాలు సూచించే చెట్లజాతులను Phreatophytes అంటారు. వీటి వేర్లు చాలా లోతుకు చొచ్చుకునిపోయి అక్కడి భూగర్బజలాలను వాడుకుంటాయి. వీటికి పైన ఉండే నీటితోగాని, రుతువులతోగాని సంబంధం లేకుండా ఎప్పుడూ పచ్చదనంతో ఉంటాయి.
ఉదా: alvadora.oleoides, Acacia nilotica, Prosopis cineraria మొదలైనవి.


తుమ్మ, జమ్మి, మర్రి, రావి, జువ్వి వంటి చెట్లు ఎక్కువగా కనిపించే ప్రదేశాలలో కొంచెం లోతుగా అయినా సరే నీళ్ళు ఉండటం సూచిస్తాయి. బాగా ఎదిగిన తాటితోపులు, ఈతచెట్లు తక్కువ లోతులో నీటిలభ్యత సూచిస్తాయి.


Tree of Life(Shagarat-al- Hayat)గా పేర్కొనబడిన ఈ చెట్టు బహరేన్‍లో jebel Dikhan వద్ద ఒక ఎడారిలో ఉన్నది. దీని పొడవు 9.75మీ.లు (32అడుగులు). దీని వయస్సు 400ల సం.రాలు.Prosopis Cineraria దీని శాస్త్రీయనామం. ఈ చెట్టుకు చుట్టుపక్కల ఎలాంటి చెట్లు లేవని అంటారు. పైగా ఎలాంటి వర్షపాతం లేని ఎడారిలో ఉంది. దీని ఆకులు పచ్చదనంతో ఉంటాయి. దీనివేర్లు దాదాపు 50మీ.ల వరకు భూమిలోపలికి చొచ్చుకొనిపోయాయి. ఎడారిలో ఉన్న ఈ ఒంటరి పచ్చదనంగల చెట్టుకు రక,రకాల మహిమలు ఆపాదించటం జరిగింది. 2009లో ఈ చెట్టును ప్రపంచంలోని ఏడు వింతలలో చేర్చటం జరిగింది. కాని, అది ఆ జాబితాలో నిలువలేదు. ఈ చెట్టు ప్రస్తావన 1991లోL.A.storyలో ఉంది. Steve Martin దీన్ని one of the Mystical place అని అన్నాడు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న Phreatophytes ఒక పర్యాటక ఆకర్షణగా నిలిచింది. దీనికంతటికి కారణం దీని వేర్లు చాలా లోతునుండి నీరు గ్రహించటం, దీనికి ఆకులద్వారా తేమ గ్రహించే శక్తి ఉండటం.


వృక్షలక్షణాలపై పూర్తిగా ఆధారపడకుండా ఆధునిక పరిజ్ఞానంతో నీటిలభ్యతను కనిపెట్టే పద్ధతులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వీటిలో Resistivity method చాలా అనుకూలమైన భూభౌతిక విజ్ఞాన పద్ధతి(Geophysical method). దీనిని ఆధునిక కంప్యూటర్‍ పరిజ్ఞానం జోడించిన Interpretation వల్ల సత్ఫలితాలు వస్తాయి.


కొబ్బరికాయ, పంగలకర్ర, రాగిపుల్లలు మొ. ఉపయోగించి నీటికోసం వెతికే పద్ధతులు చాలా ప్రచారంలో ఉన్నాయి. కాని, వీటిలో ఎలాంటి శాస్త్రీయత లేదు. ఇటీవల man, Japan machines అంటూ ప్రచారం చేస్తూ అవి నీటి ఉనికి ఖచ్చితంగా చూపిస్తాయి అని చెప్తుంటారు. ఇలాంటి ప్రచారాలు నమ్మవద్దు. Qualified Ground Water Geologist లేదా Geophysist మాత్రమే Ground water exploration చేయడానికి అర్హత కలిగి ఉంటారు.


Geobotanical Indicators గా గుర్తించబడ్డ వృక్ష సమూహాలు, వృక్షలక్షణాలు జలాల అన్వేషణకు పరికరాలుగా పనికివస్తాయి. అసాధారణమైన వృక్షసమూహం, ఒకే వరుసలో ఎదిగిన మహా వృక్షాలు, చదలపుట్టల గుట్టలు, చాలా ప్రాచీనమైన మహా వృక్షాల ఎదుగుదల తక్కువలోతులో ఉండే నీటి ఉనికిని సూచిస్తాయి. ఉప్పునీటిని తట్టుకునే మొక్కలు (Halopytes), భూమిపైన కనిపించే ఉప్పు ఆనవాళ్ళు తక్కువలోతులో ఉంటే
ఉప్పునీరును సూచిస్తుంది. ఎడారి మొక్కలు ఎక్కువలోతులో ఉన్న భూజలాలను సూచిస్తాయి. ఇవన్నీకూడా ఆధునిక అన్వేషణ పద్ధతులకు సప్లిమెంటరీగా వాడుకోవాలి.


భూజల అన్వేషణకు ఉపరితలం మీద లేదా ఉపరితలం క్రింద అన్వేషించవచ్చు. వీటిలో ఉపరితల పద్ధతలను పరిశీలించుదాం.
Esoteric methods: పూర్వకాలం ఆధునిక విజ్ఞానం అవగాహన లేనప్పుడు వాడిన పద్థతులు,water devining, water witching వంటివి ఈ కోవలోనికి వస్తాయి. ఇవన్ని అశాస్త్రీయాలు.


ఆధునిక అన్వేషణ పద్ధతులు
Geomorphological methods: భూమి ఉపరితలంపైన జియోమార్ఫిక్‍ ఆకృతులను పరిశీలించటం అనగా భూమిపైన ఎత్తు పల్లాలు నీటి ప్రవాహాల దిశ వాటి లక్షణాలను నీటి ప్రవాహాల సంరచన (pattern) పరిశీలన వీటిలోకి వస్తాయి.
Geological methods:
భూవిజ్ఞానపరమైన అంశాలు అంటే శిలలు, మట్టి ఏ విధంగా ఉన్నాయి. నిర్మితీయమైన అంశాలు అంటే సందులు, పగుళ్ళు మొదలై నవి ఏ విధంగా ఉన్నాయి పరిశీలించి ఒక అవగాహనకు రావటం. చుట్టుపక్కల ఉన్న బావులను పరిశీలించటం వల్లకూడా భూగర్భజలాల పరిస్థితులను అంచనా వేయవచ్చు.


ఇదే కాకుండా Geophysical methodలో కూడా భూగర్భ జలాలను అన్వేషించవచ్చు. వీటిలో Gravity, magnetic seismic పద్ధతులు కొంతవరకు అన్వేషణకు తోడ్పడతాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో కొన్ని రకాల ప్రదేశాలలో మాత్రమే ఇవి ఉపయుక్తంగా ఉంటాయి.


భూగర్భజలాల అన్వేషణకు ఎక్కువ ఉపయుక్తంగా ఉండేది. మన దగ్గర ఎక్కువ ఉపయోగించే పద్ధతి Electrical resistivity method. దీనిలో భూమిపైనుంచి Electrod ద్వార ఒక కొలత ప్రకారం Direct current ను భూమి లోపలికి ప్రవహింపజేసి ఒక నిర్ణీత పద్ధతిలో అమర్చిన పరికరాల ద్వారా దానిని రికార్డ్ చేస్తారు. భూమి లోపల జియోలాజికల్‍ పరిస్థితులు, నీటి లభ్యత మొ. అంశాలను ఈ రికార్డు చేసిన resistivity data ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఎలక్ట్రోడ్స్ అమర్చే విధానాలను Arrays అంటారు.


వీటిలోWerner, Schlumberger, pole-pole, pole-dipole, dipole-dipole, Array అనే రకాలు ఉన్నాయి.
Vertical electrical sounding(VES)అనే విధానాన్ని చాలాలోతుగా ఉండే resistivity పొందడానికి వాడుతారు. Electric profiling అనే పద్ధతి కూడా వాడుకలో ఉంది. దానిలో Eloctrods మధ్య దూరం స్థిరంగా ఉండి మొత్తం Array ని మారుస్తూ ఎక్కువ వైశాల్యంలో Resistivity Data ను పొందుతారు.


ఇలా పొందిన Resistivity Data ను Curve-matching పద్ధతి ద్వారాకాని,computer ఉపయోగించి చేసే Automatic Interpretation గా కాని తెలుసుకొని దానితో జలాల ఉనికిని కనుగొంటారు.


దూరం నుంచి నిర్ధారణ (Remote sensing) పద్ధతి కూడా అందుబాటులో ఉంది. పై విధానాలే కాకుండా Electro magnetic (EM) method ద్వారా కూడా అన్వేషణ చేయవచ్చు.


Reference:

  1. EAV Prasad 1980 Indian institute of science 62 (B) pp123-144
  2. Sastri and Bhat 1947 provided the English translation of Brihat Samhita
  3. First published in Bibliotheca indica by Dr. H Keran, English translation published in journal of Royal Asiatic society of Great Britain and Ireland (1870-74)

-చకిలం వేణుగోపాలరావు
డిప్యూటి డైరెక్టర్‍ జనరల్‍ జిఎస్సై(రి)
ఎ: 986644934

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *