కవి, రచయిత, సాహిత్య విమర్శకులు, గ్రామనామాల పరిశోధకుడు డాక్టర్ మండలస్వామి అక్టోబర్ 18న అనారోగ్యంతో మృతి చెందారు. వీరు ప్రస్తుతం నలగొండ మండలంలోని వెలువర్తి జడ్పీ ఉన్నత పాఠశాలలో తెలుగు అధ్యాపకుడిగా పని చేస్తున్నారు. ‘ప్రాచీన గ్రామనామాల చారిత్రక సాంస్కృతిక సామాజిక దృక్పథం’ అనే అంశంపై పరిశోధన చేసారు.
నల్గొండ జిల్లాలోని పలు గ్రామాలలోని ప్రాచీన శిలా శాసనాలను పరిశీలించి ఆ గ్రామాల నామాల గురించి పరిశోధనా వ్యాసాలను రాసారు. వారి రచనలు దక్కన్‍ల్యాండ్ ప్రచురించింది. వారి మృతి సాహితీరంగానికి, తెలంగాణా చరిత్ర, పరిశోధనా రంగానికి తీరని లోటు. వారి మృతికి దక్కన్‍ల్యాండ్ మాసపత్రిక నివాళి అర్పిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియ జేస్తుంది.
–దక్కన్‍ల్యాండ్, మాసపత్రిక