చాళుక్యుల శిల్ప సంపదకు ముప్పు!
మహబూబ్ నగర్ జిల్లా గంగాపురం చెన్నకేశవ స్వామి ఆలయంలో చారిత్రక ఆనవాళ్లు కనుమరుగవుతున్నాయి. ఆలయం నిర్లక్ష్యం కారణంగా అద్భుతమైన చాళుక్యుల శిల్ప సంపదకు ముప్పు వాటిల్లుతుంది. ఇప్పటికే చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన కోట గోడలు ధ్వంసమయ్యాయి. చారిత్రక ఆధారాలుగా నిలిచిన శాసనాలు కనుమరుగయ్యాయి. ఆలయంలోపల శిల్పాల్లో కొన్ని ధ్వంసమయ్యాయి. ఉప ఆలయాలు పట్టించుకునేవారు లేక శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రధాన ఆలయం ద్వారం శిల్ప శోభితంగా కనిపించేది. అది ఇప్పుడు రంగు వెలిసి కళావిహీనంగా కనిపిస్తోంది. లోతైన మెట్ల …