హమారా హైదరాబాద్ డబుల్ డెక్కర్ బస్సు
మూడు దశాబ్దాల క్రితం దాకా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారు హైదరాబాద్ నగరంలో డబుల్ డెక్కర్ బస్సులను పరిమిత మార్గాల్లో నడిపేవారు. దాదాపు పాతికేళ్ల పాటు ఆ బస్సులు నగర ప్రజల జీవనంలో ఒక భాగంగా ఉండేవి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి 5వ నంబరు బస్సు మెహిదీపట్నంకు, 7వ నంబరు బస్సు అఫ్జల్ గంజ్ కు, 8 నంబరు బస్సు చార్మినార్ కు, 10వ నంబరు బస్సు సనత్ నగర్ కు నడుస్తుండేవి. అదే …