Tuesday, 13 October 2026
TRC
May · May 1, 2025 · deccanland

ఇస్రో చేసిన అంతరిక్ష అద్భుతం@స్పేడెక్స్

ఇస్రో కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. అంతరిక్ష పరిశోధనల్లో ఒక విప్లవాత్మక పరిణామానికి శ్రీకారం చుట్టింది. భవిష్యత్‍లో చేపట్టబోయే భారీ అంతరిక్ష యాత్రలకు అవసరమైన కీలక పరిజ్ఞానాన్ని ఒడిసిపట్టింది. భూకక్ష్యలో రెండు ఉపగ్రహాల అనుసంధాన పక్రియ (డాకింగ్‍) కోసం, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన స్పేడెక్స్ (స్పేస్‍డాకింగ్‍ ఎక్స్పెరిమెంట్‍) మిషన్‍ అద్భుత విజయాన్ని సాధించింది. తద్వారా భవిష్యత్‍లో భారత్‍ సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించేందుకు మార్గం సుగమమైంది. ఈ మిషన్‍లో భాగంగా ప్రయోగించిన రెండు ఉపగ్రహాలు విజయవంతంగా అనుసంధానమై, కలిసికట్టుగా భూమి చుట్టూ తిరుగుతున్నాయి. కేవలం అమెరికా, రష్యా, చైనా లాంటి అగ్రదేశాలకే సొంతమైన ఈ సంక్లిష్ట సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్‍ కూడా అందిపుచ్చుకొని ఆయాదేశాల సరసన సగర్వంగా నిలిచింది. ఈ నేపథ్యంలో స్పీడెక్స్ మిషన్‍ అంటే ఏమిటి, దానివల్ల కలిగే ప్రయోజనాలు, ప్రాధాన్యతను గురించి, భవిష్యత్‍ అంతరిక్ష ప్రయోగాలలో స్పేడెక్స్ మిషన్‍ పోషించబోయే పాత్ర గురించి మనం కూడా తెలుసుకుందాం!!