యునెస్కో ఇటీవల భారతదేశానికి చెందిన 6 సైట్స్‌ను తన తాజా టెంటేటివ్ వరల్డ్ హెరిటేజ్ జాబితాకు జోడించింది. వీటిలో 34 ప్రాంతాల్లోని అశోకుడి శాసన ప్రదేశాలు కూడా ఒక సీరియల్ నామినేషన్‌గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ అశోకుడి శాసన ప్రదేశాలు, ఈ సీరియల్ నామినేషన్ గురించి మరిన్ని వివరాలు…

నామినేషన్ దాఖలు తేదీ: 11/02/2025
ప్రమాణాలు: (iii) (iv) (v)
వర్గం: సాంస్కృతికం
సమర్పించినవారు: యునెస్కో భారతదేశ శాశ్వత ప్రతినిధి బృందం
రాష్ట్రాలు: హార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, దిల్లీ, కర్ణాటక, ఆంధప్రదేశ్, గుజరాత్
రెఫరెన్స్: 6803
వివరణ:

I. ప్రధాన శిలా శాసనాలు రక్షిస్తున్న విభాగం

- గిర్నార్-ప్రధాన శిలా శాసనాలు భారత పురావస్తు సర్వే సంస్థ
- ధౌలి-ప్రధాన శిలా శాసనాలు భారత పురావస్తు సర్వే సంస్థ
- జౌగడ – ప్రధాన శిలా శాసనాలు భారత పురావస్తు సర్వే సంస్థ
- సోపారా-ప్రధాన శిలా శాసనాలు ఛత్రపతి శివాజీ మహరాజ్ మ్యూజియం
- కల్సి-ప్రధాన శిలా శాసనాలు భారత పురావస్తు సర్వే సంస్థ
- ఎర్రగుడి- ప్రధాన శిలా శాసనాలు భారత పురావస్తు సర్వే సంస్థ
- సన్నతి – ప్రధాన శిలా శాసనాలు భారత పురావస్తు సర్వే సంస్థ
II. మైనర్ శిలా శాసనాలు - ససారాం- మైనర్ శిలా శాసనాలు భారత పురావస్తు సర్వే సంస్థ
- రూపనాథ్ మైనర్ శిలా శాసనాలు భారత పురావస్తు సర్వే సంస్థ
- బైరత్ మైనర్ శిలా శాసనాలు ఆసియాటిక్ సొసైటీ మ్యూజియం
- బ్రహ్మగిరి మైనర్ శిలా శాసనాలు భారత పురావస్తు సర్వే సంస్థ
- సిద్ధాపుర మైనర్ శిలా శాసనాలు భారత పురావస్తు సర్వే సంస్థ
- జటింగ-రామేశ్వర మైనర్ శిలా శాసనాలు భారత పురావస్తు సర్వే సంస్థ
- మాస్కీ మైనర్ శిలా శాసనాలు భారత పురావస్తు సర్వే సంస్థ
- ఎర్రగుడి మైనర్ శిలా శాసనాలు భారత పురావస్తు సర్వే సంస్థ
- గవిమత్ మైనర్ శిలా శాసనాలు భారత పురావస్తు సర్వే సంస్థ
- పాలిగుండ మైనర్ శిలా శాసనాలు భారత పురావస్తు సర్వే సంస్థ
- రాజుల మందగిరి మైనర్ శిలా శాసనాలు భారత పురావస్తు సర్వే సంస్థ
- గుజ్జారా మైనర్ శిలా శాసనాలు భారత పురావస్తు సర్వే సంస్థ
- బహాపూర్ మైనర్ శిలా శాసనాలు భారత పురావస్తు సర్వే సంస్థ
- పంగురారియా మైనర్ శిలా శాసనాలు భారత పురావస్తు సర్వే సంస్థ
- నిట్టూర్ మైనర్ శిలా శాసనాలు భారత పురావస్తు సర్వే సంస్థ
- ఉడేగోలం మైనర్ శిలా శాసనాలు భారత పురావస్తు సర్వే సంస్థ
- రతన్పూర్వా చిన్న శిలా శాసనాలు భారత పురావస్తు సర్వే సంస్థ
- అహ్రౌరా మైనర్ శిలా శాసనాలు భారత పురావస్తు సర్వే సంస్థ
III. స్తంభ శాసనాలు - అలహాబాద్ – కోసంబి స్తంభ శాసనాలు భారత పురావస్తు సర్వే సంస్థ
రాణుల శాసనం - లౌరియా-అరరాజ్ స్తంభ శాసనాలు భారత పురావస్తు సర్వే సంస్థ
- లౌరియా-నందన్‌గర్ స్తంభ శాసనాలు భారత పురావస్తు సర్వే సంస్థ
- దిల్లీ-మీరట్ స్తంభ శాసనాలు భారత పురావస్తు సర్వే సంస్థ
- దిల్లీ-తోప్రా స్తంభ శాసనాలు భారత పురావస్తు సర్వే సంస్థ
- సాంచి స్తంభ శాసనాలు భారత పురావస్తు సర్వే సంస్థ
- రాంపూర్వ స్తంభ శాసనాలు భారత పురావస్తు సర్వే సంస్థ లయన్ క్యాపిటల్- ఇండియన్ మ్యూజియం
బుల్ క్యాపిటల్- రాష్ట్రపతి భవన్
IV. ఇతర శాసనాలు- గుహ శాసనాలు - సారనాథ్ శాసనాలు భారత పురావస్తు సర్వే సంస్థ క్యాపిటల్ – సారనాథ్ మ్యూజియం
- బరాబర్ గుహ శాసనం భారత పురావస్తు సర్వే సంస్థ


మౌర్య రాజవంశం మూడవ పాలకుడు అశోక చక్రవర్తి భారత ఉపఖండాన్ని వర్తమాన శకపూర్వం 268 నుండి 232 వరకు పరిపాలించాడు. నాటి కాలంపై ఆయన గణనీయమైన ప్రభావం కనబర్చాడు. విజయాలకు ప్రసిద్ధి చెందాడు. ప్రధానంగా బౌద్ధమతంలోకి మారడం, తన విస్తృత సామ్రాజ్యం ద్వారా ప్రపంచవ్యాప్తంగా బుద్ధుని బోధనలను ప్రచారం చేయడానికి చేసిన ప్రయత్నాలకు గాను అశోకుడు చరిత్రలో గుర్తుండిపోతాడు. తన చారిత్రక వారసత్వాన్ని కాపాడు కునేందుకు ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఆ నిర్దిష్ట కాలంలో ఎక్కువగా శాసనాల రూపమే ప్రపంచ చరిత్రలో అశోకుడిని ప్రత్యేకంగా నిలబెట్టింది. ప్రాచీన భారతదేశంలో అశోకుడు తన నైతిక సూత్రాలను ప్రజల అవగాహన కోసం రాతి శాసనాలపై చెక్కడం ద్వారా వాటిని తెలియజేయడానికి గణనీయమైన సమయం కేటాయించాడు. ఈ అశోక శాసనాలు బౌద్ధమతం వ్యాప్తికి తొలి ప్రత్యక్ష సాక్ష్యాలను సూచిస్తాయి కాబట్టి అవి ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఈ శాసనాలలో, అశోకుడు ‘‘ధర్మం’’ అని పిలువబడే బౌద్ధ తత్వ శాస్త్రం పట్ల తన నిబద్ధతను ప్రకటించాడు.
అశోక చక్రవర్తి కాలం తరువాత వచ్చిన పలు రచనలు ఆయన జంబూద్వీపాన్ని (భారత ఉపఖండం) బలప్రయోగం ద్వారానో, లేదంటే సైన్యాన్ని ఉపయోగించడం కంటే కూడా బయటకు కనిపించే దండన లేని క్రమశిక్షణతోనే ప్రజలను చక్కగా పాలించిన చక్రవర్తిగా వర్ణించాయి. అతని విస్తారమైన సామ్రాజ్యం భారతదేశం, నేపాల్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అంతటా విస్తరించింది. దాదాపు భారత ఉపఖండం మొత్తం కూడా ఇందులో ఉంది. మగధ రాజ్య రాజధానిని రాజగృహం నుండి ఉత్తరాన పాటలీపుత్రానికి మార్చడం ద్వారా అశోకుడు గణనీయమైన మార్పు చేశాడు. ఉత్తర ప్రాంతం వెంట, ఉత్తర-పథం అని పిలువబడే బాగా స్థిరపడిన కమ్యూనికేషన్ నెట్వర్క్ ఉండింది. ఇది తక్షశిల దాటి తూర్పు తీరం వరకు తామ్రలిప్తి వద్ద ప్రాంతాలను అనుసంధానించింది. ఈ మార్గం వ్యాపారులు, చిరువ్యాపారులు, కారవాన్ వర్తకులు, మతపరమైన వ్యక్తులు, తరచుగా ప్రయాణించే యువరాజులతో సందడిగా ఉండేది. రాజకీయ, వాణిజ్య కారణాల వల్ల అశోకుడు తన తండ్రి బిందుసారుడి ఆదేశాల మేరకు పాటలీపుత్ర నుండి మాల్వాకు ప్రయాణించాడు. ఈ ప్రయాణం దక్షిణాపథ్ లేదా దక్షిణ మార్గం అని పిలువబడే విస్తృత మార్గాల నెట్‌వర్క్‌లో భాగంగా ఉండే మార్గాన్ని అనుసరించింది. వ్యాపారులు ప్రధానంగా దక్షిణ ప్రాంతాల నుండి వస్తువులను రవాణా చేయడానికి ఈ మార్గాన్ని ఉపయోగించారు. అశోకుడు మాల్వాలోని ఉజ్జయినికి ప్రయాణించే టప్పుడు ప్రాంతీయ తేడాలను గమనించి ఉండవచ్చు. ఈ మార్గాల్లో అనేక అశోక శాసనాలు వ్యాప్తి చెందాయి, దీని వలన అశోకుడి శాసనాలలో ఉత్తరాపథం, దక్షిణాపథం ప్రముఖంగా కనిపించాయి.
ప్రాచీన భారతదేశ రాజకీయ నిర్మాణం ప్రాంతీయ అధికారులతో కమ్యూనికేషన్‌పై ఎక్కువగా ఆధారపడింది. వాయువ్యంలో తక్షశిల, దక్షిణాన మాల్వా, తూర్పున కళింగ ఉన్నాయి. అశోకుడు గుజరాత్ నుండి బెంగాల్ వరకు, ఆఫ్ఘనిస్తాన్ నుండి కర్ణాటక వరకు విస్తరించి ఉన్న సామ్రాజ్యాన్ని వారసత్వంగా పొందాడు. ఈ పరిమాణంలో ఉన్న సామ్రాజ్యాన్ని నిర్వహించడానికి, తరచుగా రాజకుటుంబం నుండి వచ్చిన ప్రాంతీయ నాయకులతో క్రమం తప్పకుండా కమ్యూనికేషన్ అవసరం. ఉజ్జయినిలో వైస్రాయ్గా పనిచేసిన అశోకుడు, వివిధ ప్రావిన్సులను పర్యవేక్షించడానికి సన్నిహిత బంధువులకు అధికారాన్ని అప్పగించే పద్ధతిని కొనసాగించాడు. అతను ఈ స్థానిక నిర్వాహకులకు శాసనాల ద్వారా ఆదేశాలు జారీ చేశాడు. కళింగ అనంతర కాలంలో కమ్యూనికేషన్లో ఒక ముఖ్యమైన అభివృద్ధి ఏమిటంటే, అశోకుడు తన అనేక ప్రకటనలను రాతిపై చెక్కి బహిరంగ ప్రదేశాలలో ప్రదర్శించాలనే నిర్ణయం తీసుకోవడం. ప్రారంభంలో, అశోకుడి సందేశాలు సాపేక్షంగా చిన్నవి, సాధారణంగా ఆరు నుండి ఇరవై రెండు పంక్తుల వరకు ఉండేవి. తరువాతి శాసనాలు, ‘మైనర్’ శిలా శాసనాలుగా సూచించ బడతాయి. ప్రధాన శిలా శాసనాలు విస్తృతమైన సందేశాలు, తరచుగా బహుళ శిలా ఉపరితలాలను కవర్ చేస్తాయి. వందకు పైగా పంక్తులను కలిగి ఉంటాయి. ‘మేజర్’ అనే పదం ఈ సందేశాల పొడవు, ప్రాముఖ్యత రెండింటినీ ప్రతిబింబిస్తుంది.

అశోకుడు తన విస్తృత సామ్రాజ్యం అంతటా ఉన్న నిర్వాహకులకు తన సందేశాల కోసం స్థిరమైన పద్ధతిని ఉపయోగించాడు. దీనిని సాధించడానికి, అతను తన సందేశాల బహుళ కాపీలు దేశవ్యాప్తంగా వెళ్లేలా చూసుకున్నాడు. ఈ శాసనాలు పట్టణాల శివార్లలో, కారవాన్ మార్గాల్లో ఉంచబడ్డాయి. ఇవి ప్రయాణికులకు, సంచార వ్యక్తులకు అందుబాటులో ఉండేలా చేశారు. నేడు, అశోకుడు మొదట్లో తన ప్రావిన్సులకు పంపిన సందేశాల అవశేషాలు ఇప్పటికీ వాటి అసలు ప్రదేశాలలో చాలా వరకు కనిపిస్తాయి ఎందుకంటే అవి స్థిరమైన రాళ్ళు, బండరాళ్లపై చెక్కబడ్డాయి.
ఈ శాసనాలు వివిధ రకాల ఉపరితలాలపై చెక్కబడ్డాయి. వివిధ ప్రాంతాల్లో ఆ వైవిధ్యం కనిపిస్తూ ఉంది. వీటిలో కొన్ని రాజుల మందగిరి (ఆంధ్ర), శ్రీనివాసపురి (న్యూ దిల్లీ) సమీపంలో ఉన్న వాటిలాగా సాపేక్షంగా చదునైన క్షితిజ సమాంతర శిలా ముఖాలపై ఉన్నాయి. మస్కి, నిట్టూర్ (కర్ణాటక) వంటి మరికొన్ని శాసనాలు నిలువు ఉపరితలాలపై చెక్కబడ్డాయి. ఈ శిలలు ప్రజలకు చేరువలో ఉండే తీరు కూడా మారుతూ ఉంటుంది. రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లాలోని బైరాట్ శాసనం వంటివి కొండ దిగువన ఉన్నాయి. మరికొన్ని, ఆంధప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలోని ఎర్రగుడి శాసనం వంటివి నిటారుగా, కొంతవరకు ప్రవేశించలేని గట్లపై ఉన్నాయి. బౌద్ధమతానికి మారిన తర్వాతే అశోకుడు తన ప్రజలతో అట్టడుగు స్థాయిలో నిమగ్నమవ్వడం ప్రారంభించాడు, ఎందుకంటే అతని బౌద్ధ పూర్వ దశలో ఈ ఉద్దేశ్యాన్ని ప్రతిబింబించే శాసనాలు లేవు. బౌద్ధ పాలకుడిగా అతని ఉనికి ఉత్తర (దిల్లీ, అహరౌర, రతన్పూర్వా, ససారం), మధ్య భారతదేశం (గుజ్జర, రూపనాథ్), దక్కన్ వంటి అతని సామ్రాజ్యంలోని అనేక ప్రాంతాలలో స్పష్టంగా కనిపిస్తుంది. నిజానికి, దక్కన్ ప్రాంతం బౌద్ధ మతానికి మారిన వ్యక్తిగా అశోకుడి గుర్తింపును తరచుగా వ్యక్తపరిచింది. ఈ సందేశం పది వేర్వేరు ప్రదేశాలలో చెక్కబడింది. బుద్ధుని ప్రఖ్యాత బిరుదు ‘శాక్యముని’ నేపథ్యంలో, బౌద్ధుడిని సూచిస్తూ తనను తాను శాక్యుడిగా బహిరంగంగా ప్రకటించుకున్నాడు. ఈ సందేశం యొక్క కొన్ని వెర్షన్లలో, అతను తనను తాను బౌద్ధ విశ్వాసం యొక్క సామాన్య అనుచరుడిని (‘ఉపాసకే’) అని కూడా పేర్కొన్నాడు.

తరువాతి కాలంలో, ప్రధాన శిలా శాసనాలు పలు ప్రదేశాలలో ప్రదర్శించబడ్డాయి, కానీ అవి సహజ శిలలకు బదులుగా స్తంభాలపై చెక్కబడ్డాయి. ప్రధాన శిలా శాసనాలను చెక్కే కాలం నుండి ఈ స్తంభ శాసనాలను చెక్కే కాలం వరకు ఈ మార్పు ధమ్మం (బౌద్ధ సిద్ధాంతం)లో పాతుకుపోయిన నైతికతను ప్రోత్సహించే అశోకుడి విధానంలో మార్పును సూచిస్తుంది. ఈ స్తంభాలపై సందేశాలు స్థిరంగా ఉన్నాయి. ప్రధానంగా ఉత్తర భారతదేశంలోని ముఖ్యమైన ప్రాంతాలలో, ముఖ్యంగా లౌరియా-అరరాజ్, లౌరియా-నందన్గఢ్, రాంపూర్వాతో సహా గంగా మైదానాల
ఉత్తర బిహార్ ప్రాంతంలో ఉన్నాయి. వీటితో పాటుగా, అలహాబాద్‌లో ఇలాంటి సందేశంతో కూడిన ఒక స్తంభం ఉంది, నిజానికి ఇది కౌశాంబి నుండి వచ్చింది.
ఈ రాతి శాసనాలన్నీ ప్రాకృత మాండలికాలను కలిపిన బ్రాహ్మి లిపిలో ఉన్నాయి. భారత పురావస్తు సర్వే మొదటి డైరెక్టర్ జనరల్ అలెగ్జాండర్ కన్నింగ్‌హామ్, ఈ శాసనాల విశ్లేషణ ద్వారా అశోకుడి చారిత్రక వివరణకు గణనీయంగా దోహదపడ్డాడు.
అత్యుత్తమ సార్వత్రిక విలువ సమర్థన
ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఆంధ్ర, కర్నాటక, కళింగ ప్రాంతాలతో సహా వైవిధ్యభరితమైన రాజ్యమంతా కూడా తను జీవించి ఉన్న సమయంలోనే తన జీవితం, విజయాల సంస్కరణ జరగాలని అశోకుడు కోరుకున్నాడు. అశోకుడి మీద వచ్చిన విస్తృతమైన రచనలలో ఈ శాసనాలు ముఖ్యమైన భాగంగా ఉన్నాయి. అతని పాలన ఒక కొత్త దశకు నాంది పలికింది, ఎందుకంటే అతను తన సందేశాలను రాతిపై లిఖించాలని ఎంచుకున్నాడు. తన సందేశాల పలు కాపీలను సృష్టించి, వాటిని వివిధ ప్రావిన్సులకు పంపించాలనే అశోకుడి నిర్ణయం టెక్సట్-ఆధారిత సామూహిక సమాచార మార్పిడిని సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది – ఇది అతని సందేశం పరిధిని బాగా విస్తరించిన వ్యూహం. మునుపటి పాలకులకు భిన్నంగా, అశోకుడు తన సందేశంలోని పదాల ద్వారా తన ఇమేజ్ను స్థాపించడానికి ప్రయత్నించాడు. తన విస్తృత సామ్రాజ్యం అంతటా తన స్థిరమైన ఇమేజ్ను తెలియజేయడం లక్ష్యంగా పెట్టుకున్నాడు. రాజ్యం అంతటా తన ప్రజలు తన ఏకైక స్వరాన్ని వినగలగడం అతనికి చాలా కీలకం. ఈ కొత్త కమ్యూనికేషన్ రూపం శైలి చాలా వ్యక్తిగతీకరించబడింది. ఈ సందేశాలను రాతిపై లిఖించడం ద్వారా, అశోకుడు తన ప్రజలు నివసించిన, వారి విశ్వాసాన్ని ఆచరించే ప్రదేశాలలోనే వారితో అనుసంధానం అవడానికి అపూర్వమైన ప్రయత్నం చేశాడు. ఈ విధానం ద్వారా, అతను ఉపఖండం అంతటా తనకంటూ ఒక ప్రత్యేక ఉనికిని ఏర్పరచుకున్నాడు.
ప్రమాణాలు (iii): అశోకుని శాసనాలు బౌద్ధమత సాంస్కృతిక, మతపరమైన ఆచారాలకు ఒక అద్భుతమైన సాక్ష్యం. ఇది చక్రవర్తి విధానాలు, నమ్మకాలు, వారసత్వంపై కీలకమైన వివరాలను అందిస్తుంది. మౌర్య పాలనలో బౌద్ధమత ప్రభావాన్ని, నైతిక ప్రమాణాలను వివరిస్తుంది. అవి ముఖ్యమైన చారిత్రక రికార్డులుగా పనిచేస్తాయి. మౌర్య సామ్రాజ్యం, దాని భూభాగాలు, పరిపాలనా విభాగాలు, ఆ సమయంలో ఉపయోగించిన భాషలు, లిపిల గురించి వివరాలను అందిస్తాయి.

ప్రమాణాలు (iv): శాసనాల ద్వారా వచ్చే సందేశాలు పరిసరాలతో సందర్భోచితంగా మిళితమయ్యాయి, ప్రభావిత మయ్యాయి, మెరుగుపరచబడ్డాయి, సవరించబడ్డాయి. అశోక స్తంభాల శాసనాలు పురాతన భారతీయ హస్తకళలు, ఇంజనీరింగ్‌కు అద్భుతమైన ఉదాహరణలుగా ఉండటం వలన అవి నిర్మాణ ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. స్తంభాలపై క్లిష్టమైన శిల్పాలు, సింహాలు వంటి జంతువుల తలలు ఉన్నాయి. ఈ నిర్మాణ అంశాలు ఆ కాలం నాటి కళాత్మక నైపుణ్యాలు, సంకేత ప్రాతినిధ్యాలను ప్రతిబింబిస్తాయి.
ప్రమాణాలు (v): శిలలపై పదాల ప్రత్యేక కలయిక కారణంగా అశోకుడి ముద్ర స్పష్టంగా ఉంది. అవి స్థావరాలు, స్థూపాల అద్భుతమైన శిథిలాలు. అశోకుడు తన శాసనాలను ప్రధాన వాణిజ్య మార్గాలు, తీర్థయాత్ర స్థలాలు, ముఖ్యమైన జనావాస కేంద్రాల వెంట వ్యూహాత్మక ప్రదేశాలలో ఉంచాడు. అలా చేయడం ద్వారా, అతను తన సందేశాలను వ్యాపారులు, యాత్రికులు, స్థానిక నివాసులతో సహా విస్తృత ప్రేక్షకులకు చేరేలా చూసుకున్నాడు. ఇది మానవ కదలిక, కమ్యూనికేషన్ నమూనాలపై లోతైన అవగాహనను ప్రదర్శిస్తుంది. కమ్యూనికేషన్ కోసం సహజ మార్గాలను సద్వినియోగం చేసుకుంటుంది. మొత్తంమీద, అశోకుడి శాసనాలు పురాతన నాగరికత వారి పర్యావరణంతో ఎలా నిమగ్నమైందో, స్థానిక వనరులు, పరిసరాల లక్షణాలను సద్వినియోగం చేసుకుని ప్రజలతో కమ్యూనికేట్ చేయడానికి, వారి సమాజాలను సానుకూలంగా ప్రభావితం చేస్తుందో వివరిస్తాయి.
అశోకుని శాసనాలు పురాతన నగరం హరప్పా పతనం తరువాత భారతదేశంలో మొట్టమొదటి లిఖిత శాసనాలుగా గుర్తింపు పొందాయి. విశేషమేమిటంటే, ఈ శాసనాలలో చాలా వరకు వాటి అసలు ప్రదేశాలలో కనిపిస్తాయి ఎందుకంటే అవి స్థిరమైన బండరాళ్లలో చెక్కబడ్డాయి. రాళ్ళు, స్తంభాలపై ఉన్న ఈ శాసనాల ద్వారా, అశోకుడు తన రాచరిక జీవితంలోని కీలకమైన క్షణాలను పంచుకున్నాడు. తన సామ్రాజ్యంలో, దాని సరిహద్దులకు మించి కూడా ప్రజల జీవితాలను మార్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అతను తన స్వంత ప్రయాణాన్ని ఎలా మార్చుకున్నాడో అతని మాటలు ఒక సంగ్రహావలోకనం ఇస్తాయి. అశోకుని శాసనాలు నిజాయితీ, భావోద్వేగం, మరణం, వినాశనం గురించి చర్చలు, అధికారిక ఆదేశాలతో సహా విస్తృత శ్రేణి భావోద్వేగాలను తెలియజేస్తాయి. ఈ శిలా శాసనాల అద్భుతమైన సంరక్షణ గమనార్హం. 2,200 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు
ఉన్నప్పటికీ, వాటిలో చాలా వరకు అవి మొదట సృష్టించబడినప్పుడు ఉన్నట్లుగానే కనిపిస్తాయి. అటువంటి పురాతన శాసనాల మనుగడ వాటి అసలు రూపం, ప్రదేశాలలో చాలా అసాధారణమైనది. ఈ శిలా శాసనాలన్నీ భారత పురావస్తు సర్వే ద్వారా రక్షించబడుతున్నాయి.

ఇతర సారూప్య లక్షణాలతో పోలిక
- శాంటియాగో డి కాంపోస్టెలా మార్గం, స్పెయిన్ (ప్రపంచ వారసత్వ ప్రదేశం, 1993) ప్రమాణాలు: (ii) (iv) (vi)
- ఉత్తరాపథ్, బాద్షాహి సడక్, సడక్-ఎ-ఆజం, గ్రాండ్ ట్రంక్ రోడ్ (తాత్కాలిక జాబితా) ప్రమాణాలు: (ii) (iv) (vi)
- ఉత్తర లేదా ప్రిమిటివ్ మార్గం (శాంటియాగో డి కంపోస్టెలా మార్గం పొడిగింపు) (తాత్కాలిక జాబితా) ప్రమాణాలు: (ii) (iv) (vi)
- సెరువిల నుండి శ్రీ పాద (పవిత్ర మందిరం), శ్రీలంకలోని మహావేలి నది వెంబడి పురాతన యాత్రికుల మార్గం (తాత్కాలిక జాబితా) ప్రమాణాలు: (ii) (iii) (iv)
- సెంట్రల్ స్లేవ్ అండ్ ఐవరీ ట్రేడ్ రూట్, యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియా (తాత్కాలిక జాబితా) ప్రమాణాలు: గుర్తించబడలేదు.
- చైనాలోని సిల్క్ రూట్ యొక్క చైనీస్ విభాగం (తాత్కాలిక జాబితా) ప్రమాణాలు: (i) (ii) (iii) (iv) (v) (vi)
అనువాదం: వంశీ మోహన్ నర్ల
ఎ : 98489 0252