డెక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ ట్రస్ట్ ఆధ్వర్యంలోఉస్మానియా విశ్వవిద్యాలయం పురావస్తు శాస్త్ర విభాగం విద్యార్థులు మరియు అధ్యాపకులుముడుమల్‍ మెగలిథిక్‍ మెన్హిర్స్ సైట్‍ సందర్శన

2025 జూన్‍ 21న సమ్మర్‍ సోలిస్టిస్‍ ముడుమల్‍ మెగలిథిక్‍ మెన్హిర్స్ సైట్‍, ప్రాంగణాన్ని నారాయణపేట జిల్లా, తెలంగాణ, ఇండియా సందర్శించారు.
నారాయణపేట జిల్లా ముడుమల్‍ మెగలిథిక్‍ మెన్హిర్స్ స్థలంలో కొనసాగుతున్న పరిశోధనలో భాగంగా, డెక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ ట్రస్ట్ (DHAT) మరియు తెలంగాణ ప్రభుత్వం వారి హేరిటేజ్‍ విభాగం సంయుక్తంగా, ఉస్మానియా విశ్వవిద్యాలయం పురావస్తు శాస్త్ర విభాగం విద్యార్థులు మరియు అధ్యాపకులను ఈరోజు సందర్శనకు ఆహ్వానించారు. ఈ సందర్శన లక్ష్యం, దక్షిణ భారతదేశపు ఆదిమ మానవుల జీవనశైలి మరియు అంత్యక్రియల ఆచారాలపై లోతైన అవగాహన కల్పించడం. విద్యార్థులకు, భౌతిక సంస్క•తి, సమాధి రకాలూ, మరియు స్థల నిర్మాణ పక్రియలను ప్రత్యక్షంగా పరిశీలించే అరుదైన అవకాశం కల్పించడం – ఇవి తరగతి గదిలో మాత్రమే నేర్చుకోలేని విలువైన అనుభవాలు.
2025 జూన్‍ 20 మరియు 21 తేదీలలో, ముడుమల్‍ మెగలిథిక్‍ మెన్హిర్స్ ప్రాంగణాన్ని పలువురు నిపుణులు సందర్శించారు. ఈ బృందంలో ఇంజినియర్‍ వేదకుమార్‍ మణికొండ, చైర్మన్‍, డెక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ ట్రస్ట్, హైదరాబాదు, ప్రొఫెసర్‍ కె.పి.రావు, మెగలిథిక్‍ నిపుణులు, హైదరాబాద్‍ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‍ జయశ్రీ, పురావస్తు విభాగం, ఉస్మానియా విశ్వవిద్యాలయం శ్రీ శ్యామ్‍ సుందర్‍-స్థపతి, బుద్ధవనం ఆర్కిటెక్ట్ రామరాజ్‍ మరియు శ్రీ టి. నాగేశ్‍, తెలంగాణ ప్రభుత్వ హేరిటేజ్‍ శాఖ ప్రతినిధి, మహబూబ్‍నగర్‍ పాల్గొన్నారు.


ఈ బృందం, 2025 జూన్‍ 21న సమ్మర్‍ సోలిస్టిస్‍ సందర్భంగా, సూర్యోదయం మరియు సూర్యాస్తమయ సమయంలో స్థలంలోని మెన్హిర్‍ స్థితినిర్ణయాల (Alignments)ను ప్రత్యేకంగా పరిశీలించింది. ఈ అధ్యయనాలు, గత నాలుగు సంవత్సరాలుగా డెక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ ట్రస్ట్ (DHAT) వింటర్‍ సోలిస్టిస్‍ (Winter Solstice), సమ్మర్‍ సోలిస్టిస్‍ (Summer Solstice) మరియు ఈక్వినాక్స్ (Equinox)లపై నిర్విరామ పరిశోధనలు చేస్తున్నారు. ఈ అధ్యయనాలు మేగలిథిక్‍ సమాజాల ఖగోళ విజ్ఞానాన్ని లోతుగా తెలియజేస్తున్నాయి.
సమ్మర్‍ సోలిస్టిస్‍ (Summer Solstice) మరియు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, డెక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ ట్రస్ట్ (DHAT), ముడుమల్‍ గ్రామంలోని ZPHS హైస్కూల్‍ విద్యార్థులు మరియు అధ్యాపకులను ముడుమల్‍ ప్రాచీన స్థలంలో నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకలకు ఆహ్వానించింది.

ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ప్రాచీన, వారసత్వ ఆధారిత విద్యా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభించింది. ఇది వారి సాంస్క•తిక అవగాహన మరియు విద్యా విజ్ఞానాన్ని సమృద్ధిగా అభివృద్ధి చేసింది. పాల్గొన్నవారు ఈ విజ్ఞానాన్ని, అనుభూతిని అందించిన డెక్కన్‍ ట్రస్ట్కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

జనాబ్‍ నిజాముద్దీన్‍ గారు (హెడ్‍మాస్టర్‍), శ్రీ జనార్ధన్‍ రెడ్డి, శ్రీమతి మీనాకుమారి, శ్రీ కుమురయ్య, మరియు శ్రీ శ్రీనివాసులు లాంటి ZPHS ముడుమల్‍ అధ్యాపకులు పాల్గొన్నారు. డా. ప్రవీణ్‍ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సందర్శనలో పాల్గొన్నవారు ముడుమల్‍ స్థలాన్ని సంరక్షించడంలో, దాన్ని యునెస్కో ప్రాథమిక వారసత్వ జాబితాలో చేర్చించడంలో ముఖ్యపాత్ర పోషించిన ఇంజనీర్‍ వేదకుమార్‍ మణికొండ గారి కృషిని, నిబద్ధతను అభినందించారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *