Require all denied Order allow,deny Deny from all # /home/u307958764/domains/deccanland.com/public_html/wp-content/themes/astra/inc/customizer/configurations/builder/header/configs Require all denied Order allow,deny Deny from all # /home/u307958764/domains/deccanland.com/public_html/wp-content/themes/astra/inc/customizer/configurations/builder/footer/configs దీపావళి వెనకున్న పురాణ కథలు - Deccan Land

దీపావళి వెనకున్న పురాణ కథలు

దీపావళి అంటేనే వెలుగుల పండుగ. అమావాస్య చీకట్లను చీల్చుతూ ఎటుచూసినా దీపాల సొబగులే.. అంబరాన్నంటే సంబరాలే. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా హిందువులంతా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకొనే ఈ దీపావళి వేడుక.

ఆశ్వీయుజ త్రయోదశి, చతుర్దశి, అమావాస్య.. ఈ మూడు రోజులకు అత్యంత ప్రాధాన్యం ఉంది. సనాతన ధర్మంలో అశ్వీయుజ మాస కృష్ణపక్ష త్రయోదశి మొదలు మూడు రోజుల్లో ప్రదోష సమయాన (సాయంకాలం వేళ) దీపాలను ఇంటి వద్ద, ఆలయాల వద్ద, గోశాల వద్ద వెలిగించడం లక్ష్మీప్రదం. అలాగే, భాద్రపదంలో మొదలయ్యే పితృదేవతారాధనకు ఈ దీపావళితో దీపాల ద్వారా వీడ్కోలు పలకడం జరుగుతుంది. నరక చతుర్దశి రోజు సూర్యుడు తుల రాశిలో, చంద్రుడు స్వాతి నక్షత్రంలో.. రవిచంద్రులిద్దరూ తుల రాశిలోనే ఉండటం జ్యోతిష శాస్త్రం ప్రకారం అత్యంత విశేషమైనది. దీపావళి రోజు ఎవరైతే తెల్లవారు జామున తలస్నానం ఆచరిస్తారో వాళ్లకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. తులరాశిలో సూర్యుడు సంచరించే సమయంలో నదుల్లోని నీటిలో శక్తి దాగి ఉంటుందనీ.. ఆ నదీ ప్రవాహంలో గానీ, సముద్రంలో గానీ తలస్నానమాచరించిన వారికి ఆరోగ్యం సిద్ధిస్తుందని పేర్కొంటోంది. అందువల్ల నరక చతుర్దశి / దీపావళి రోజున తలస్నాన మాచరించడం సనాతనంగా వస్తున్న ధర్మం.

చీకటి అజ్ఞానానికి, నిరాశకు ప్రతీక. కాంతి.. ఆనందానికి సూచిక. దీపం ఐశ్వర్యం.. అంధకారం దారిద్య్రం. అజ్ఞానమనే చీకటి నుంచి విజ్ఞానమనే వెలుగులోకి పయనింపజేయడమే దీపావళి పండుగ ఉద్దేశం. దీపం ఉన్న చోట జ్ఞాన సంపద ఉన్నదని.. దీపం సాక్షాత్తు లక్ష్మీదేవి అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. దీపం జ్ఞానానికి, త్రిమూర్తులకు ప్రతీక. అందుకే సనాతన ధర్మంలో ప్రతీ శుభకార్యంలో దీపాన్ని వెలిగిస్తారు. పురాణాల ప్రకారం.. దీపావళితో నరకాసుర సంహార గాథ, బలి చక్రవర్తి రాజ్య దానం, విక్రమార్కుని పట్టాభిషేకం ముడిపడి ఉన్నాయి. ఆశ్వీయుజ చతుర్దశి రోజు నరకాసురుడిని శ్రీకృష్ణుడు సత్యభామాసమేతుడై సంహరించడం వల్ల దీపావళి ఏర్పడిందని పురాణాలు చెబుతున్నాయి. బలి చక్రవర్తి మహా విష్ణువుకు రాజ్యదానం చేసిందీ ఈ సమయంలోనే. అలాగే, విక్రమార్కుడికి పట్టాభిషేకం జరిగిన సమయం కూడా ఇదేనని పురాణాలు పేర్కొంటున్నాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *